For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమ్మ‌కాల్లో పురోగ‌తి క‌న‌బ‌రిచిన టాటా మోటార్స్ -న‌వంబ‌రులో 22% వృద్ది

టాటా మోటార్స్ వాహ‌న అమ్మ‌కాలు ఆశాజ‌న‌కంగా ఉన్నాయి. అంత‌ర్జాతీయంగా న‌వంబ‌ర్ నెల‌లో టాటా మోటార్స్ అమ్మ‌కాలు 22% పెరిగి 1,12,473 యూనిట్లుగా ఉన్న‌ట్లు శుక్ర‌వారం టాటా మోటార్స్ నివేదించింది.

|

టాటా మోటార్స్ వాహ‌న అమ్మ‌కాలు ఆశాజ‌న‌కంగా ఉన్నాయి. అంత‌ర్జాతీయంగా న‌వంబ‌ర్ నెల‌లో టాటా మోటార్స్ అమ్మ‌కాలు 22% పెరిగి 1,12,473 యూనిట్లుగా ఉన్న‌ట్లు శుక్ర‌వారం టాటా మోటార్స్ నివేదించింది. హోల్ సేల్‌గా చూస్తే టాటా మోటార్స్ వాణిజ్య అవ‌స‌రాల‌కు వినియోగించే వాహ‌నాలు, టాటా Daewoo రేంజి వాహ‌నాలు న‌వంబ‌రు 2017లో 40,845గా ఉంటూ గ‌తేడాది న‌వంబ‌రు కంటే 51% మెరుగుద‌ల‌ను క‌న‌బ‌రిచాయి. అదే విధంగా ప్యాసెంజ‌ర్ వాహ‌నాల ప‌రంగా చూస్తే 10% వృద్దితో 71,628 యూనిట్లుగా ఉన్నాయి.

టాటా మోటార్స్ అమ్మ‌కాల్లో పురోగ‌తి

కంపెనీ సంబంధించి బ్రిటీష్ విభాగ‌మైన జాగ్వార్ ల్యాండ్ రోవ‌ర్ ప్ర‌పంచ వ్యాప్తంగా చేప‌ట్టిన అమ్మ‌కాలు 54,244గా ఉన్నాయి. అందులో జాగ్వార్ బ్రాండ్ 12,287 యూనిట్ల అమ్మ‌కాలు సాధించిపెట్ట‌గా, మ‌రో బ్రాండ్ ల్యాండ్ రోవ‌ర్ 41,957 యూనిట్ల అమ్మ‌కాలు చేయ‌గ‌లిగింది.
టాటా మోటార్స్ సంస్థ‌కు ద‌శాబ్దాల చ‌రిత్ర ఉంది. ఇది పూర్తి స్థాయి స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో భారీ వాణిజ్య, ప్యాసెంజ‌ర్ వాహ‌నాల‌ను త‌యారుచేస్తున్న‌ది. ఇంకా దేశంలో వాణిజ్య, ర‌వాణా రంగంలో కీల‌క పాత్ర పోషిస్తోంది. కాలానికి త‌గ్గ‌ట్లుగా సంస్థ వ్యూహాల‌ను మారుస్తూ వ‌స్తుంది. స‌రిగా ప‌దేళ్ల కింద‌ట టాటా నానో క‌ల సామాన్యుల‌కు కారును చేరువ చేసేందుకు ప్ర‌య‌త్నించింది. 70 ఏళ్ల క్రితం 1945లో టాటా ఇంజినీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీ(TELCO)గా ఆవిర్భ‌వించింది. ప్ర‌స్తుతం టాటా మోటార్స్ టాటా గ్రూప్‌లో ఒక ప్ర‌ధాన సంస్థ‌గా ఉంది.

Read more about: tata motors november cars
English summary

అమ్మ‌కాల్లో పురోగ‌తి క‌న‌బ‌రిచిన టాటా మోటార్స్ -న‌వంబ‌రులో 22% వృద్ది | Tata Motors global sales up 22% in November

Tata Motors today reported a 22 per cent increase in its total global sales at 1,12,473 units for November
Story first published: Friday, December 8, 2017, 16:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X