For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఐదింటికి డిసెంబ‌రు 31 లోపు ఆధార్ అనుసంధానం చేయ‌క‌పోతే ఇక అంతే సంగ‌తి

ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌భుత్వం సూచించిన చోట ఆధార్ అనుసంధానం చేయ‌క‌పోతే ఈ క‌థ‌నాన్ని చ‌దివి ఏయే వాటికి ఆధార్ సంఖ్య‌ను స‌మ‌ర్పించాల్సిన‌, అనుసంధానించాల్సిన గ‌డువుల‌ను స‌మ‌గ్రంగా తెలుసుకోండి

|

ప్రస్తుతం కేంద్ర ప్ర‌భుత్వం సాధ్య‌మైన‌న్ని ఎక్కువ చోట్ల ఆధార్ అనుసంధానాన్ని ప్రోత్స‌హిస్తోంది. వివిధ సేవ‌లు పొందేందుకు ప్ర‌జ‌లు త‌ప్ప‌నిస‌రిగా ఆధార్ ప‌త్రాలు ఇవ్వ‌డ‌మో, ఆధార్ నంబ‌రు ఇవ్వ‌డ‌మో చేయాలి. వీటికి సంబంధించిన తుది గ‌డువులు స‌మీపిస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌భుత్వం సూచించిన చోట ఆధార్ అనుసంధానం చేయ‌క‌పోతే ఈ క‌థ‌నాన్ని చ‌దివి ఏయే వాటికి ఆధార్ సంఖ్య‌ను స‌మ‌ర్పించాల్సిన‌, అనుసంధానించాల్సిన గ‌డువుల‌ను స‌మ‌గ్రంగా తెలుసుకోండి

1. పాన్ కార్డుకు-ఆధార్ అనుసంధానం

1. పాన్ కార్డుకు-ఆధార్ అనుసంధానం

ఆదాయపు ప‌న్ను వెబ్‌సైట్ ప్ర‌కారం ఆధార్, పాన్ అనుసంధానాన్ని డిసెంబ‌రు 31,2017లోగా పూర్తిచేయాలి.

ఒక‌వేళ గ‌డువు లోపు అనుసంధానం జ‌ర‌గ‌క‌పోతే ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల ప్రాసెస్ ఆగిపోతుంది.

2. బ్యాంకు ఖాతాకు - ఆధార్ అనుసంధానం

2. బ్యాంకు ఖాతాకు - ఆధార్ అనుసంధానం

మీ బ్యాంకు ఖాతాతో ఆధార్ సంఖ్య‌ను అనుసంధానించేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. మీరు బ్యాంకు శాఖ‌కు వెళ్లి కానీ, ఇంట‌ర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ విధానాల ద్వారా బ్యాంకు ఖాతాకు ఆధార్ సంఖ్య‌ను అనుసంధానించ‌వ‌చ్చు. ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్‌లో లాగిన్ అయిన త‌ర్వాత సేవ‌ల్లో అప్‌డేట్ ఆధార్ లింక్ క్లిక్ చేసి త‌దుప‌రి ప్ర‌క్రియ పూర్తిచేయ‌వ‌చ్చు. ఇందుకోసం మీ రిజిస్ట‌ర్ మొబైల్ మీ వ‌ద్ద ఉండాలి.

బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానించ‌డానికి తుది గ‌డువు డిసెంబ‌రు 31,2017

3. మ్యూచువ‌ల్ ఫండ్ పోర్ట్ ఫోలియో

3. మ్యూచువ‌ల్ ఫండ్ పోర్ట్ ఫోలియో

ఇప్ప‌టికే మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మ‌దుపు చేసిన వారు https://www.camsonline.com/ ద‌్వారా మ్యూచువ‌ల్ ఫండ్ ఖాతాకు ఆధార్ సంఖ్య‌ను అనుసంధానించే స‌దుపాయం ఉంది. అయితే ఈ సౌల‌భ్యాన్ని వాడుకునేందుకు మొబైల్ నంబ‌రు ఆధార్ వెబ్‌సైట్లో ఇదివ‌ర‌కే రిజిస్ట‌ర్ అయి ఉండి దానికి ఓటీపీ రావాలి.

మ్యూచువ‌ల్ ఫండ్ ఫోలియోల‌లో ఆధార్ అప్‌డేట్ చేసేందుకు తుది గ‌డువు డిసెంబ‌రు 31, 2017

 4. బీమా పాల‌సీలు

4. బీమా పాల‌సీలు

బీమా నియంత్ర‌ణ సంస్థ ఆదేశాల ప్ర‌కారం బీమా పాల‌సీల‌తో సైతం ఆధార్ అనుసంధానాన్ని త‌ప్ప‌నిస‌రిగా చేయాల్సిందే. లేక‌పోతే పాల‌సీలు తాత్కాలికంగా ప‌నిచేయ‌కుండా చేస్తారు. బీమా కంపెనీ వెబ్‌సైట్లో లాగిన్ అయి ఆధార్ సంఖ్య‌ను మీ పాల‌సీతో అనుసంధానం చేయ‌వ‌చ్చు. ఇందుకోసం పాల‌సీ నంబ‌రు, మీ పుట్టిన రోజు వివ‌రాలు న‌మోదు చేయ‌గ‌లిగితే చాలు.

మీరు ఆన్‌లైన్ మార్గంలో చేయ‌లేక‌పోతే బీమా కంపెనీకి ఫోన్ చేసి సైతం ఆధార్ సంఖ్య‌ను అనుసంధానించ‌వ‌చ్చు.

ఇప్ప‌టివ‌ర‌కూ ఎల్ఐసీ, ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు మాత్రం ఆన్‌లైన్ మార్గం ద్వారా ఆధార్ లింకింగ్ సేవ‌ల‌ను అందుబాటులో ఉంచాయి.

బీమా పాల‌సీల‌కు ఆధార్ సంఖ్య‌ను అనుసంధానం చేసేందుకు తుది గ‌డువు డిసెంబ‌రు 31, 2017

 5. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు

5. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు

వివిధ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల ప్ర‌యోజ‌నాలు పొందేందుకు సైతం ఆధార్ సంఖ్య‌ను త‌ప్ప‌నిస‌రి చేశారు. డిసెంబ‌రు 31లోగా చాలా సంక్షేమ ప‌థ‌కాల‌కు ఆధార్ సంఖ్య‌ను ఇవ్వాల్సిందే. ఉచిత గ్యాస్ స‌బ్సిడీ, కిరోసిన్, ఎరువుల స‌బ్సిడీలు, ఉచిత రేష‌న్, ఉచిత ధాన్యాలు, ఆహార పదార్థాలు పొందేందుకు, మ‌హాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం ల‌బ్దిదారుల‌కు సైతం ఆధార్ అనుసంధానాన్ని త‌ప్ప‌నిస‌రి చేసిన సంగ‌తి తెలిసిందే.

6. పోస్టాఫీసు పొదుపు ప‌థ‌కాలు

6. పోస్టాఫీసు పొదుపు ప‌థ‌కాలు

పోస్టాఫీసు పొదుపు ఖాతా తెరిచేందుకు లేదా చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలైన జాతీయ పొదుపు ప‌త్రాలు, పీపీఎఫ్ వంటి వాటిల్లో పెట్టుబ‌డి పెట్టేందుకు ఆధార్ అనుసంధానాన్ని కేంద్రం త‌ప్ప‌నిస‌రి చేసింది. ఇందుకోసం ఇండియా పోస్ట్ వెబ్‌సైట్లో ఆధార్ లింక్ ఫారంను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దాన్ని స‌మీపంలో ఉన్న పోస్టాఫీసులో స‌మ‌ర్పించాలి.

 7. మొబైల్ నంబ‌రు

7. మొబైల్ నంబ‌రు

మొబైల్ నంబ‌రును ఆధార్ సంఖ్య‌తో అనుసంధానించేందుకు తుది గ‌డువు ఫిబ్ర‌వ‌రి 6,2018

మీకు ద‌గ్గ‌ర్లోని మొబైల్ స‌ర్వీసు ప్రొవైడ‌ర్ కార్యాల‌యానికి వెళ్లి కానీ లేదా క‌స్ట‌మ‌ర్ కేర్‌కు కాల్ చేసి కానీ ఆధార్ అనుసంధానం చేయ‌వ‌చ్చు.

బ్యాంకు డిపాజిట్ల కంటే ఎక్కువ రాబ‌డి వ‌చ్చే పోస్టాఫీసు పొదుపు ప‌థ‌కాలు

బ్యాంకు డిపాజిట్ల కంటే ఎక్కువ రాబ‌డి వ‌చ్చే పోస్టాఫీసు పొదుపు ప‌థ‌కాలు

 8 సుర‌క్షిత పోస్టాఫీసు పొదుపు ప‌థ‌కాలు 8 సుర‌క్షిత పోస్టాఫీసు పొదుపు ప‌థ‌కాలు

 మంచి రాబ‌డి కోసం 10 ఉత్త‌మ పెట్టుబ‌డి మార్గాలు

మంచి రాబ‌డి కోసం 10 ఉత్త‌మ పెట్టుబ‌డి మార్గాలు

దేశంలో మంచి రాబ‌డినిచ్చే 10 ఉత్త‌మ పెట్టుబ‌డి మార్గాలుదేశంలో మంచి రాబ‌డినిచ్చే 10 ఉత్త‌మ పెట్టుబ‌డి మార్గాలు

దేశంలో టాప్ 10 టెలికాం కంపెనీలు

దేశంలో టాప్ 10 టెలికాం కంపెనీలు

దేశంలో టాప్ 10 టెలికాం కంపెనీలుదేశంలో టాప్ 10 టెలికాం కంపెనీలు

Read more about: aadhaar uidai pan bank account banking
English summary

ఈ ఐదింటికి డిసెంబ‌రు 31 లోపు ఆధార్ అనుసంధానం చేయ‌క‌పోతే ఇక అంతే సంగ‌తి | Be careful To Link Aadhaar To These 5 Services Before December 31

The last date for obtaining Aadhaar to availing schemes launched by both central and state government is December 31. Schemes including the free cooking gas (LPG) to poor women, kerosene and fertilizer subsidy, targeted public distribution system (PDS), food grain supply and MGNREGA are included.|
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X