For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవంబ‌రులో 10 కోట్లు దాటిన యూపీఐ లావాదేవీలు

న‌వంబ‌రులో ఈ వ్య‌వ‌స్థ ద్వారా జ‌రిపిన లావాదేవీల సంఖ్య 10 కోట్ల‌ను దాటింది. ఆగ‌స్టు నెల‌లో ఈ వ్య‌వ‌స్థ ద్వారా 1.66 కోట్ల లావాదేవీలు, సెప్టెంబ‌రులో 3 కోట్లు, అక్టోబ‌ర్లో 7.67 కోట్లు జ‌రిగాయి. ఇప్పుడు

|

ఎన్‌పీసీఐ(భార‌త జాతీయ చెల్లింపుల కార్పొరేష‌న్) ప్ర‌వేశ‌పెట్టిన యూపీఐ లావాదేవీల్లో మంచి పురోగ‌తి క‌నిపిస్తోంది. న‌వంబ‌రులో ఈ వ్య‌వ‌స్థ ద్వారా జ‌రిపిన లావాదేవీల సంఖ్య 10 కోట్ల‌ను దాటింది. ఆగ‌స్టు నెల‌లో ఈ వ్య‌వ‌స్థ ద్వారా 1.66 కోట్ల లావాదేవీలు, సెప్టెంబ‌రులో 3 కోట్లు, అక్టోబ‌ర్లో 7.67 కోట్లు జ‌రిగాయి. ఇప్పుడు ఏకంగా 10 కోట్ల మార్కును దాట‌డం విశేషం.

 న‌వంబ‌రులో పెరిగిన యూపీఐ లావాదేవీలు

ఆగ‌స్టు 25,2016లో ప్రారంభ‌మైన యూపీఐ (సొమ్ము బ‌దిలీ విధానం) స్మార్ట్ ఫోన్ల ద్వారా డ‌బ్బును వేగంగా పంపించేందుకు ఆస్కారం క‌ల్పిస్తోంది. మ‌నం మెసేజ్, మెయిల్ పంపినంత సులువుగా ఈ విధానంలో డ‌బ్బును అవ‌త‌లి వ్య‌క్తికి పంప‌వ‌చ్చు. ఎన్‌పీసీఐ వెల్ల‌డించిన గ‌ణాంకాల ప్ర‌కారం న‌వంబ‌రు నెల‌లో 10.50 కోట్ల లావాదేవీల ద్వారా రూ.9769 కోట్ల సొమ్మును యూపీఐ ఉప‌యోగించి బ్యాంకు ఖాతాల మ‌ధ్య బ‌దిలీ చేశారు. భీమ్ యాప్ ఉప‌యోగించి జ‌రిపిన లావాదేవీల సంఖ్య త‌క్కువ‌గానే 8% వ‌ద్ద ఉంది. అయితే భీమ్ యాప్ ద్వారా యూపీఐ విధానంలో పంపిన సొమ్ము విలువ మొత్తం యూపీఐ ఆధారిత న‌గ‌దు బ‌దిలీ విధానంలో 26%గా ఉండ‌టం శుభ‌సూచ‌కం. ఎందుకంటే ప్ర‌భుత్వ యాప్ ద్వారా ప్ర‌జ‌లు డ‌బ్బు పంప‌డానికి ఆస‌క్తి చూపుతున్నారు. న‌వంబ‌రు నెల‌లో భీమ్ యాప్ వాడ‌కం చెప్పుకోద‌గ్గ విధంగా పెరిగింది. అక్టోబ‌ర్ నెల‌లో 76.32 ల‌క్ష‌ల లావాదేవీలు భీమ్ ఆధారంగా జ‌ర‌గ్గా, న‌వంబ‌రు నెల‌కు వ‌చ్చే స‌రికి అవి 82.13 ల‌క్ష‌ల‌కు పెరిగాయి. అదే డ‌బ్బు విలువ ప‌రంగా చూస్తే అక్టోబ‌ర్ నెల‌లో రూ.2348 కోట్లుగా ఉండ‌గా న‌వంబ‌రు నెల‌కు రూ.2533 కోట్ల‌కు పెరిగింది.

Read more about: upi money transfer
English summary

నవంబ‌రులో 10 కోట్లు దాటిన యూపీఐ లావాదేవీలు | UPI crossed 10 crore transactions in November

The number of transactions on the Unified Payment Interface (UPI), the mobile-only digital payment mechanism from the National Payments Corporation of India (NPCI), has grown substantially in a span of three months, with November seeing more than 10 crore transactions.
Story first published: Saturday, December 2, 2017, 15:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X