For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప‌ల్లెల‌కు, పారిశ్రామిక వాడల‌కు ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న విస్త‌ర‌ణ‌

ప్ర‌స్తుతం ప‌ట్ట‌ణ అభివృద్ది సంస్థ‌ల‌కే అవ‌కాశ‌మిస్తున్న ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న ప‌థ‌కం కింద మ‌రింత మందిని తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

|

ప్ర‌స్తుతం ప‌ట్ట‌ణ అభివృద్ది సంస్థ‌ల‌కే అవ‌కాశ‌మిస్తున్న ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న ప‌థ‌కం కింద మ‌రింత మందిని తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. గ్రామాలు, పారిశ్రామిక వాడ‌లు(ప‌ట్ట‌ణాలు), ప్ర‌త్యేక అభివృద్ది ప్రాంతాల ప‌రిధిలో ఉండే అభివృద్ది సంస్థ‌ల కింద ఉండే ఆస్తులు, ఇళ్ల‌ను కూడా ప‌థ‌కంలో ల‌బ్దిదారులుగా ఉండేందుకు సంబంధించి నిబంధ‌న‌ల మార్పు జ‌రుగుతోంద‌ని స‌మాచారం. ఈ వార్త‌ను టైమ్స్ ఆఫ్ ఇండియా ప్ర‌చురించింది. కోస్తా ప్రాంతాల్లో పోర్ట్ డెవ‌ల‌ప్ మెంట్ సంస్థ‌ల కింద ఉండే ఏరియాల‌ను కూడా ఇందులో క‌వ‌ర్ చేసేందుకు నిబంధ‌న‌లు స‌హ‌క‌రిస్తాయి. మొద‌టిసారి ఇళ్లు కొనేవారికి ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఈ పీఎం ఆవాస్ యోజ‌న ప‌థ‌కం ద్వారా గ‌రిష్టంగా రూ.2.6 లక్ష‌ల వ‌ర‌కూ వ‌డ్డీ రాయితీ ల‌భిస్తుంది.

 ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న

నోయిడాతో ప‌టు 100 న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో ప‌ట్ట‌ణం బ‌య‌ట పారిశ్రామిక వాడ‌లు, శివారు గ్రామాల ద‌ర‌ఖాస్తుల‌ను ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న ద‌ర‌ఖాస్తు కింద కొన్ని ప్రైవేటు బ్యాంకుల అధికారులు తిర‌స్క‌రిస్తున్నారు. అలాంటి హౌసింగ్ ప్రాజెక్టుల‌కు అనుమ‌తి ఎవ‌రిస్తున్నార‌ని కొంత మంది బ్యాంక‌ర్లు స్పందిస్తున్న ఉదంతాలు ఉన్నాయి. ఈ ప‌థ‌కాన్ని ఎక్కువ మందికి అందుబాటులో ఉంచేందుకు ఇప్పుడు నిబంధ‌న‌లు మారుస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్లుగా నిబంధ‌న‌లు మారుస్తూ ఎక్కువ మందికి ప్ర‌యోజ‌నం క‌ల్పించేలా, ఇంకా ప‌థ‌కం సంబంధించి ఎక్కువ మంది స్ప‌ష్ట‌త‌నిచ్చే ప్ర‌య‌త్నాలు ప్ర‌భుత్వం నుంచి మొద‌ల‌య్యాయి. అయితే ప్ర‌భుత్వ సంస్థ‌ల నుంచి అనుమ‌తులు వ‌చ్చిన ప్రాజెక్టుల‌కే బ్యాంకు స‌బ్సిడీ కింద అర్హ‌త ఉంటుంది అని ఒక ప్ర‌భుత్వ అధికారి వెల్ల‌డించారు.
ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న కింద వార్షికంగా రూ.6 ల‌క్ష‌ల నుంచి రూ.12 ల‌క్ష‌ల లోపు సంపాద‌న క‌లిగిన మొత్తం రుణంలో మొద‌టిసారి 4% వ‌ర‌కూ వ‌డ్డీ రాయితీని పొందుతారు. అయితే ఇందు కోసం తీసుకునే రుణం రూ.9 ల‌క్ష‌ల లోపు ఉండాలి.
అదే విధంగా రూ.12 ల‌క్ష‌ల నుంచి రూ.18 ల‌క్ష‌ల మ‌ధ్య సంపాద‌న క‌లిగిన వారు 3% వ‌డ్డీ రాయితీ పొందేందుకు అర్హులు. అయితే తీసుకునే రుణం మొత్తం విలువ రూ.12 ల‌క్ష‌ల‌కు మించ‌కూడ‌దు.

Read more about: pmay home loan
English summary

ప‌ల్లెల‌కు, పారిశ్రామిక వాడల‌కు ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న విస్త‌ర‌ణ‌ | PM awas yojana soon to cover homes under villages and Industrial units

Sources said the guidelines will be modified to bring properties falling under any part of all development authorities including villages, industrial belts and even special development authorities to be eligible for interest subsidy. This news was reported by Times of India
Story first published: Saturday, December 2, 2017, 12:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X