For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆధార్ వివ‌రాల‌ను ఎస్ఎంఎస్ ద్వారా పంప‌క్క‌ర్లేద‌న్న ఎల్ఐసీ

పాల‌సీదారులు త‌మ ఆధార్ సంఖ్య‌ను ఎస్ఎంఎస్ ద్వారా అనుసంధానం చేసుకోవాలంటూ త‌మ లోగోతో వ‌స్తున్న సందేశాల‌ను ప‌ట్టించుకోన‌క్క‌ర్లేద‌ని జీవిత బీమా సంస్థ‌(ఎల్ఐసీ) స్ప‌ష్టం చేసింది. ఇలాంటి సందేశాల‌ను న‌మ్మ‌వ‌

|

పాల‌సీదారులు త‌మ ఆధార్ సంఖ్య‌ను ఎస్ఎంఎస్ ద్వారా అనుసంధానం చేసుకోవాలంటూ త‌మ లోగోతో వ‌స్తున్న సందేశాల‌ను ప‌ట్టించుకోన‌క్క‌ర్లేద‌ని జీవిత బీమా సంస్థ‌(ఎల్ఐసీ) స్ప‌ష్టం చేసింది. ఇలాంటి సందేశాల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని ప్ర‌జ‌ల‌ను కోరింది.
" కొన్ని సామాజిక మాధ్య‌మాల్లో ఎల్ఐసీ ఎంబ్ల‌మ్, లోగోతో పాటుగా అనుమానప్ప‌ద సందేశాలు ప్ర‌చారం అవుతున్నాయి. ఇందులో పాల‌సీదారుల‌ను ఆధార్ నంబ‌రుతో పాల‌సీని అనుసంధానించాల్సిందిగా కోరుతున్నారు. ఇదంతా అన‌ధికారికంగా జ‌రుగుతోంది.'' అని ఎల్ఐసీ ప‌బ్లిక్ నోటీసులో ప్ర‌క‌టించింది.

ఎల్ఐసీ పాల‌సీదారులు త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన 10 విష‌యాలుఎల్ఐసీ పాల‌సీదారులు త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన 10 విష‌యాలు

ఎల్ఐసీ

అలాంటి సందేశాన్ని తాము అధికారికంగా ఎక్క‌డ కూడా పంప‌లేద‌ని జీవిత బీమా సంస్థ స్ప‌ష్టం చేసింది. అంతే కాకుండా ఎల్ఐసీ వ‌ద్ద సంక్షిప్త సందేశం ద్వారా పాల‌సీని, ఆధార్ సంఖ్య‌తో అనుసంధానించే విధానం అందుబాటులో లేద‌ని వివ‌రించింది. ఎప్పుడైనా ఈ ర‌క‌మైన స‌దుపాయాన్ని ప్రారంభిస్తే ఎల్ఐసీ త‌మ వెబ్‌సైట్లో అప్‌డేట్ చేస్తుంద‌ని జీవిత బీమా సంస్థ పేర్కొంది. అయితే పాల‌సీదారులంతా త‌మ పాల‌సీల‌ను ఆధార్ సంఖ్య‌తో అనుసంధానించ‌డాన్ని బీమా నియంత్ర‌ణ‌, అభివృద్ది ప్రాధికార సంస్థ‌(ఐఆర్డీఏ) ఆదేశించిన సంగ‌తి తెలిసిందే.

Read more about: lic ఎల్ఐసీ
English summary

ఆధార్ వివ‌రాల‌ను ఎస్ఎంఎస్ ద్వారా పంప‌క్క‌ర్లేద‌న్న ఎల్ఐసీ | Do not share aadhaar details via sms said LIC

State-owned LIC has cautioned policyholders against sharing their Aadhaar number through SMS, saying it has not operationalized any such facility to link the unique identification number with policies.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X