For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీఎఫ్ చందాదారుల ఖాతాల్లోకి ఈటీఎఫ్ యూనిట్ల జ‌మ

భ‌విష్య‌నిధి(పీఎఫ్‌) చందాదారుల‌కు శుభ‌వార్త‌. పీఎఫ్ ఖాతాల్లో ఉద్యోగులు జ‌మ చేసే డ‌బ్బును ఎక్స్చేంజ్ ట్రేడేడ్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులుగా పెట్టాల‌ని ఉద్యోగ భ‌విష్య‌నిధి సంస్థ నిర్ణ‌యించింది.

|

భ‌విష్య‌నిధి(పీఎఫ్‌) చందాదారుల‌కు శుభ‌వార్త‌. పీఎఫ్ ఖాతాల్లో ఉద్యోగులు జ‌మ చేసే డ‌బ్బును ఎక్స్చేంజ్ ట్రేడేడ్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులుగా పెట్టాల‌ని ఉద్యోగ భ‌విష్య‌నిధి సంస్థ నిర్ణ‌యించింది. వ‌చ్చే ఏడాది మార్చి నాటికి 4.5 కోట్ల మంది పీఎఫ్ చందాదారులు త‌మ ఖాతాల‌కు ఎన్ని ETF యూనిట్లు వ‌చ్చాయో చూసుకోగ‌ల వీలుంటుంద‌ని భ‌విష్య‌నిధి సంస్థ తెలిపింది. కాగ్ చేసిన ప‌రిశీల‌ను కూడా ఈ గ‌ణాంక విధానంలో చేర్చిన‌ట్లు భ‌విష్య నిధి ధ‌ర్మ‌క‌ర్త స‌భ్యులు వెల్ల‌డించారు. దీంతో పాటు కేంద్రీకృత చెల్లింపు వ్య‌వ‌స్థ‌ను కూడా ఆమోదించామ‌ని పీఎఫ్ నియంత్ర‌ణ సంస్థ పేర్కొంది. పీఎఫ్ ఖాతా ఉండ‌టం వ‌ల్ల క‌లిగే 10 ప్ర‌యోజ‌నాలు

పీఎఫ్ చందాదారుల‌కు మార్కెట్ పెట్టుబ‌డుల ద్వారా రాబ‌డుల ప్ర‌యోజ‌నాలు

ఫీఎఫ్ సొమ్మును మార్కెట్ ట్రేడింగ్‌లో పాల్గొనే కంపెనీల షేర్ల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా మార్కెట్ ధ‌ర‌లో స‌బ్‌స్క్రైబ‌ర్లు వాటా రూపంలో రిడీమ్ చేసుకునేందుకు వీలు క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం ప‌చ్చ‌జెండా ఊపింది. ఈ విధంగా మార్కెట్ షేర్ ధ‌ర‌లో ఎంత వ‌స్తే అంత తీసుకునేలా చందాదారులు ప్ర‌యోజ‌నం పొందేందుకు సంబంధించిన ప్ర‌తిపాద‌న గ‌తంలో పీఎఫ్ నియంత్ర‌ణ సంస్థ చేసింది.
ఈ మేర‌కు గురువారం భేటీ అయిన భ‌విష్య నిధి సంస్థ సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ట్ర‌స్టీలు(పీఎఫ్ ధర్మ‌క‌ర్త‌ల మండ‌లి) ఈక్విటీ అనుసంధాన పెట్టుబ‌డుల‌కు కొత్త పాల‌సీని తీసుకొచ్చారు. ఈ కొత్త విధానం పీఎఫ్ చందాదారుల‌కు ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంద‌ని కార్మిక శాఖ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Read more about: pf epf
English summary

పీఎఫ్ చందాదారుల ఖాతాల్లోకి ఈటీఎఫ్ యూనిట్ల జ‌మ | EPFO to credit ETF units to PF accounts of subscribers

The Employees’ Provident Fund Organisation (EPFO) on Thursday decided to credit units of exchanged traded funds (ETF) to the provident fund (PF) accounts of its over 45 million subscribers, giving them a window to monetize the fund’s equity exposure.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X