For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్మార్ట్ ఫోన్ల‌కు యాక్సిడెంట‌ల్ ఇన్సూరెన్స్ సదుపాయం క‌ల్పిస్తున్న పేటీఎమ్ మాల్‌

స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదార్లకు మొబైల్ చోరీలు, మొబైల్ డ్యామేజీల వ‌ల్ల క‌లిగే న‌ష్టాల నుంచి ర‌క్ష‌ణ‌ అందించనున్నట్లు పేటీఎం మాల్‌ ప్రకటించింది. ప్రమాదవశాత్తు జరిగే నష్టాల నుంచి స్మార్ట్‌ఫోన్‌లకు రక్షణ ల

|

స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదార్లకు మొబైల్ చోరీలు, మొబైల్ డ్యామేజీల వ‌ల్ల క‌లిగే న‌ష్టాల నుంచి ర‌క్ష‌ణ‌ అందించనున్నట్లు పేటీఎం మాల్‌ ప్రకటించింది. ప్రమాదవశాత్తు జరిగే నష్టాల నుంచి స్మార్ట్‌ఫోన్‌లకు రక్షణ లభిస్తుందని వాలెట్ దిగ్గ‌జం పేటీఎమ్ ప్ర‌క‌టించింది. ఈ పథకంలో భాగంగా ఫోన్‌ తెరకు ఏర్పడే నష్టం, లిక్విడ్‌ నష్టం, చోరీ సహా వివిధ ప్రమాదాల నుంచి సంభ‌వించే న‌ష్టాల‌కు న‌ష్ట‌ప‌రిహారాన్ని బీమా పాల‌సీ చెల్లిస్తుంది. ఈ ఇన్సూరెన్స్ కాల‌ప‌రిమితి ఏడాది పాటు బీమా ఉంటుందని ఈ-కామ‌ర్స్ సంస్థ‌ వెల్లడించింది.ఈ సేవ‌లు పొంద‌డానికి ఫోన్ మొత్తం ధ‌రలో 5 శాతం మేర ఖ‌ర్చ‌వుతుందని పేటీఎం మాల్‌ వివరించింది. యాపిల్‌, షియామీ, మోటరోలా, వివో, ఓపోతో పాటు వివిధ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్లకు ఈ ఆఫర్‌ లభించనుంది.

స్మార్ట్ ఫోన్ల‌కు ప్ర‌మాద బీమా

''ప్ర‌స్తుతం మ‌న జీవితంలో మొబైల్ ఫోన్లు ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. కొత్త స్మార్ట్ ఫోన్లు కొనేందుకు మ‌నం ఎంతో వెచ్చిస్తున్నాం. ప్ర‌మాద‌వ‌శాత్తూ అది ఏమైనా అయినా, లేదా చోరీకి గురైనా మ‌నం ఆర్ఘికంగా చాలా న‌ష్ట‌పోతాం. మ‌ళ్లీ కొత్త ఫోన్ కొనుగోలు కోసం ఎంతో ఖ‌ర్చ‌వుతుంద‌''ని పేటీఎమ్ సీవోవో అమిత్ సిన్హా అన్నారు.

Read more about: paytm insurance smart phones
English summary

స్మార్ట్ ఫోన్ల‌కు యాక్సిడెంట‌ల్ ఇన్సూరెన్స్ సదుపాయం క‌ల్పిస్తున్న పేటీఎమ్ మాల్‌ | Paytm mall to offer accidental damage cover to smartphones

Paytm Mall today said it will offer smartphone buyers 'Mobile Protection Plan' to safeguard their devices against accidental damages.This plan will offer year-long coverage against accidental damage including screen damage, liquid damage and theft, Paytm Mall said in a statement.
Story first published: Tuesday, November 21, 2017, 11:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X