For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆసియా అత్యంత సంప‌న్నులుగా అంబానీ సోద‌రులు

గతేడాది రూ. 1.2 లక్షల కోట్లుగా ఉన్న‌అంబానీ కుటుంబం ఆస్తుల విలువ ఈ ఏడాదికి రూ. 2.96 లక్షల కోట్లకు పెరిగింది. మరోవైపు ఈ జాబితాలోని 50 కుటుంబాల ఆస్తులన్నీ కూడా సుమారు నాలుగు రెట్లు పెరగడం విశేషం. వారి

|

అంబానీలు మ‌రోసారి స‌త్తా చాటారు. శ్యామ్‌సంగ్ లీని దాటి సంప‌ద‌లో ఆసియా ఖండంలోనే మొద‌టి స్థానంలో అంబానీ సోద‌రులు నిలిచారు. 2016 నుంచి అంబానీ ఆదాయం అమాంతం పెరిగి నట్లు తాజా నివేదిక స్పష్టం చేసింది. రిలయన్స్ చ‌మురుశుద్ధి సంస్థ ఉత్పత్తి పెరగడం, తక్కువ సమయంలో 14 కోట్ల మంది వినియోగదా రులను సంపాదించుకున్న టెలికమ్‌ సంస్థ 'రిలయన్స్‌ జియో' లాభాలు పండించడంతో ఆ కుటుంబ ఆస్తులు భారీగా పెరిగాయి. ఈ విధంగా అంబానీ స‌మీప భ‌విష్య‌త్తులో మ‌రే భార‌తీయ బిలియ‌నీరు చేరుకోలేనంత ఎత్తుకు ఎదిగారు. ఈ విధంగా ఆసియాలో సంప‌న్నులుగా నిలిచిన భార‌తీయుల విశేషాల గురించి తెలుసుకుందాం.

అంబానీ ఆస్తుల విలువ ఆదాపు రెట్టింపు

అంబానీ ఆస్తుల విలువ ఆదాపు రెట్టింపు

గతేడాది రూ. 1.2 లక్షల కోట్లుగా ఉన్న‌అంబానీ కుటుంబం ఆస్తుల విలువ ఈ ఏడాదికి రూ. 2.96 లక్షల కోట్లకు పెరిగింది. మరోవైపు ఈ జాబితాలోని 50 కుటుంబాల ఆస్తులన్నీ కూడా సుమారు నాలుగు రెట్లు పెరగడం విశేషం. వారి ఆస్తుల మొత్తం గతేడాది రూ. 13 లక్షల కోట్లు కాగా, ఈ ఏడాది రూ. 45.6 లక్షల కోట్లకు పెరిగాయి.

లెక్కింపు ఇలా...

లెక్కింపు ఇలా...

నవంబర్‌ 3 వరకూ నిర్వహించిన మార్కెట్‌ విలువ, విదేశీ మారక రేటు, ద్రవ్య విలువ, స్టాక్‌ ధరలు, ప్రయివేటు సంస్థల ఫైనాన్సియల్‌ నిష్పత్తి, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఆస్తులు విలువ లెక్కించి ఈ జాబితాను రూపొందించినట్లు ఫోర్బ్స్‌ వివరించింది. గతేడాది కనీసం రూ. 10 వేల కోట్ల ఆస్తులు వున్న కుటుంబాలకే ఈ జాబితాలో స్థానం లభించింది. కానీ ఈ ఏడాది కనిష్ట ఆస్తి విలువ రూ. 32.62 వేల కోట్లకు పెరిగింది.

పిల్ల‌ల కోసం ఆరు ఉత్త‌మ పొదుపు ఖాతాలుపిల్ల‌ల కోసం ఆరు ఉత్త‌మ పొదుపు ఖాతాలు

భారతీయ కుటుంబాలు..

భారతీయ కుటుంబాలు..

తాజా జాబితాలో 18 భారతీయ కుటుంబాలు స్థానం సంపాదించాయి. అజీజ్‌ ప్రేమ్‌జీ కుటుంబం 11వ స్థానంలో, హిందూజా(12), మిట్టల్స్‌(14), మిస్త్రీ(16), బిర్లా(19), గోద్రేజ్‌(20), బజాజ్‌(26), జిందాల్‌(32), బర్మన్స్‌(35), ఐచర్‌ మోటార్స్‌ లాల్‌(36), శ్రీ సిమెంట్స్‌ బంగూర్‌(37), సుమీ సిస్టమ్స్‌ సెహగల్‌(41), వడియా(42), డిఎల్‌ఎఫ్‌ కుషాల్‌ పాల్‌ సింగ్‌(44), కడిలా సంస్థను నిర్వహిస్తున్న పటేల్‌(45), పిరమాల్స్‌(47), ముంజాల్‌ కుటుంబం 48వ స్థానంలో నిలిచాయి.

భార‌త‌దేశంలోని 30 మంది అప‌ర కుబేరులుభార‌త‌దేశంలోని 30 మంది అప‌ర కుబేరులు

రెండు జాబితాల్లోనూ వారే...

రెండు జాబితాల్లోనూ వారే...

కొన్ని రోజుల కిందట విడుదలైన ఆసియా ధనవంతుల జాబితాలో వున్న వారికి చెందిన కుటుంబాలే చాలా వరకు తాజా జాబితాలో కనిపించడం విశేషం. ఆసియాలో అత్యంత విలువైన రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ను నిర్వహిస్తున్న హాంగ్‌కాంగ్‌కు చెందిన క్వాక్‌ కుటుంబం రూ. 2.63 లక్షల కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. సున్‌ హుంగ్‌ కై ప్రాపర్టీస్‌ పేరుతో ఈ కుటుంబం వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. థారులాండ్‌కు చెందిన చీరావనోంట్‌ కుటుంబం రూ. 2.38 లక్షల కోట్లతో నాలుగో స్థానంలో నిలవడం విశేషం. పర్యాటకానికి పేరుగాంచిన థారులాండ్‌లో చెరోయిన్‌ పోక్‌ఫండ్‌ గ్రూప్‌ పేరుతో ఈ సంస్థ వ్యాపారం నిర్వహిస్తోంది. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఈ 10 మార్గాల్లో పెట్టుబ‌డి పెడితే సంప‌న్నుల‌వ్వ‌డం ఖాయం

Read more about: mukesh ambani forbes anil ambani
English summary

ఆసియా అత్యంత సంప‌న్నులుగా అంబానీ సోద‌రులు | ambanis wealthiest in Asia region Forbes listed out

The Ambani family, led by brothers Mukesh Ambani and Anil Ambani, has claimed the top slot in Forbes list of 50 richest Asian families with a net worth of $44.8 billion, up $19 billion from the previous year. India enjoys the biggest presence on the list, with 18 families among the region's top 50.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X