For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్టోబ‌ర్ నెల‌లో త‌గ్గిన ప్యాసెంజ‌ర్ వాహ‌న విక్ర‌యాలు

ప్యాసెంజర్ వాహనాల కంపెనీలకు అక్టోబ‌ర్ నెల పెద్దగా కలిసిరాలేదు. గతేడాది అక్టోబర్‌తో 2,89,677 వాహనాల విక్రయాలతో పోలిస్తే.. ఈసారి అక్టోబర్‌లో అమ్మకాలు స్పల్పంగా క్షీణించి 2,79,837కి పరిమితమయ్యాయి.

|

ప్యాసెంజర్ వాహనాల కంపెనీలకు అక్టోబ‌ర్ నెల పెద్దగా కలిసిరాలేదు. గతేడాది అక్టోబర్‌తో 2,89,677 వాహనాల విక్రయాలతో పోలిస్తే.. ఈసారి అక్టోబర్‌లో అమ్మకాలు స్పల్పంగా క్షీణించి 2,79,837కి పరిమితమయ్యాయి. కంపెనీలన్నీ ఉన్న‌వాటిని పూర్తిగా అమ్మ‌కాలు చేసి, కొత్త‌గా ఉత్పత్తి ప్ర‌ణాళిక‌ల‌కు సిద్దం అవుతుండ‌టమే ఇందుకు కార‌ణం. అక్టోబ‌ర్ నెల‌లో కార్ల అమ్మ‌కాల వివ‌రాలు ఇక్క‌డ తెలుసుకుందాం.

సియామ్ వెల్ల‌డించిన గ‌ణాంకాలు

సియామ్ వెల్ల‌డించిన గ‌ణాంకాలు

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫాక్చరర్స్ (సియామ్) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కార్ల అమ్మకాలు గత అక్టోబర్‌లో 1,95,036 యూనిట్లతో పోలిస్తే ఈసారి 5.32 శాతం క్షీణించి 1,84,666 యూనిట్లకే పరిమితమయ్యాయి. ఈ ఏడాది జూన్‌లో నమోదైన 11.24 శాతం తగ్గుదల అనంతరం.. మళ్లీ క్షీణత నమోదు కావడం నాలుగు నెలల తర్వాత ఇదే తొలిసారి.

తాత్కాలిక త‌గ్గుద‌ల మాత్ర‌మే

తాత్కాలిక త‌గ్గుద‌ల మాత్ర‌మే

"పండుగ సీజన్ ఇంకా కాస్త మెరుగ్గా ఉండేదేమో.. అయితే ప్రస్తుత పరిస్థితి మార్కెట్ సెంటిమెంటును ప్రతిబింబిస్తుందని అనుకోవడానికి లేదు. ఇది తాత్కాలికమైన తగ్గుదల మాత్రమే. తయారీ సంస్థలు తమ దగ్గరున్న నిల్వ‌ల‌ను సర్దుబాటు చేసుకుంటూ ఉండటమే అమ్మకాలు తగ్గడానికి కారణం" అని సియామ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాథుర్ చెప్పారు.

 డీల‌ర్ల వద్ద‌కు ముందే వ‌చ్చిన స్టాక్

డీల‌ర్ల వద్ద‌కు ముందే వ‌చ్చిన స్టాక్

జులై నుంచి సెప్టెంబర్ దాకా పండుగల సీజన్ కోసం తయారీ కంపెనీలు.. డీలర్ల దగ్గర స్టాకును గణనీయ స్థాయిలో ఉంచిన నేపథ్యంలో అక్టోబర్‌లో డీలర్లకు వాహనాల డిస్పాచ్‌ను తగ్గించాయని ఆయన వివరించారు.

తగ్గిన మొత్తం విక్రయాలు..

తగ్గిన మొత్తం విక్రయాలు..

మిగతా కేటగిరీల్లో సైతం అమ్మకాలు తగ్గడంతో మొత్తం విక్రయాలు 22,01,489 యూనిట్ల నుంచి 21,62,164 యూనిట్లకు పడిపోయింది. ఇది 1.79 శాతం క్షీణత. ఈ ఏడాది జనవరి తర్వాత అన్ని వాహనాల అమ్మకాలు క్షీణించడం ఇదే ప్రథమం. అక్టోబర్‌లో మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 3.5 శాతం క్షీణించి 11,44,512 నుంచి 11,04,498కి తగ్గాయి. వాణిజ్య వాహనాల మొత్తం అమ్మకాలు మాత్రం 6 శాతం పెరిగి 69,793 యూనిట్లుగా నమోదయ్యాయి.

Read more about: vehicles sales
English summary

అక్టోబ‌ర్ నెల‌లో త‌గ్గిన ప్యాసెంజ‌ర్ వాహ‌న విక్ర‌యాలు | No festive advantage for passenger vehicle sales in october

passenger vehicle sales reduce in october despite festival season is there
Story first published: Saturday, November 11, 2017, 13:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X