For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిల‌య‌న్స్ క‌మ్యూనికేష‌న్ యూజ‌ర్లు డిసెంబ‌రు 31లోపు పోర్టింగ్ అవ్వాలి

త‌మ వినియోగ‌దారులంతా ఈ ఏడాది డిసెంబ‌రు 1 నుంచి 31 లోగా వేరే నెట్వ‌ర్క్‌ల‌కు పోర్ట్ అవ్వాల్సిందిగా ఒక స‌మాచార ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఇక‌పై రిల‌యన్స్ క‌మ్యూనికేష‌న్ కేవ‌లం 4జీ సేవ‌ల‌ను మాత్ర‌మే అందించ‌

|

జియో రాక‌తో స‌క్ర‌మంగా న‌డిచేందుకు స‌త‌మ‌త‌మైన రిల‌య‌న్స్ క‌మ్యూనికేష‌న్(ఆర్‌కామ్‌) త‌న వాయిస్ కాల్ సేవ‌ల‌ను డిసెంబ‌రు 1 నుంచి నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. త‌మ వినియోగ‌దారులంతా ఈ ఏడాది డిసెంబ‌రు 1 నుంచి 31 లోగా వేరే నెట్వ‌ర్క్‌ల‌కు పోర్ట్ అవ్వాల్సిందిగా ఒక స‌మాచార ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఇక‌పై రిల‌యన్స్ క‌మ్యూనికేష‌న్ కేవ‌లం 4జీ సేవ‌ల‌ను మాత్ర‌మే అందించ‌నుంద‌ని, త‌న చందాదార్ల‌కు ప్ర‌స్తుతం అందిస్తున్న వాయిస్ సేవ‌ల‌ను నిలిపివేస్తున్న‌ట్లుగా ట్రాయ్ అన్ని టెలికాం కంపెనీల‌కు తెలియ‌ప‌రిచింది.

 న‌వంబ‌రు 30 త‌ర్వాత ఆర్‌కామ్ సేవ‌ల నిలిపివేత‌

ఆర్‌కామ్ ట్రాయ్‌కు చెప్పిన దాని ప్ర‌కారం 8 టెలికాం సర్కిళ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, హ‌ర్యానా, మ‌హారాష్ట్ర, యూపీ ఈస్ట్‌, యూపీ వెస్ట్, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, కేర‌ళ స‌ర్కిళ్ల‌లో 2జీ, 4జీ సేవ‌ల‌ను అందిస్తోంది. అనిల్ అంబానీ నేతృత్వంలోని ఈ సంస్థ ట్రాయ్‌కు చెప్పిన‌దాన్ని బ‌ట్టి కంపెనీ సిస్ట‌మా శ్యామ్ టెలిస‌ర్వీసెస్‌కు చెందిన‌ సీడీఎంఏ సేవ‌ల‌ను అప్‌గ్రేడ్ చేస్తున్న‌ది. సిస్ట‌మా శ్యామ్ టెలి స‌ర్వీసెస్‌కు ఢిల్లీ, రాజ‌స్థాన్‌, యూపీ వెస్ట్, త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, వెస్ట్ బెంగాల్‌, గుజ‌రాత్‌, కోల్‌క‌త ప్రాంతాల్లో స‌ర్వీసుల‌ను న‌డిపే అనుమ‌తి ఉండింది. ఇక త‌మ చందాదారుల‌కు సంబంధించి వారు చేసే ఏ పోర్టింగ్ అభ్య‌ర్థ‌న‌నైనా ఆర్‌కామ్ నిరాక‌రించ‌కూడ‌ద‌ని ట్రాయ్ ఆర్‌కామ్‌ను ఆదేశించింది. వాయిస్ స‌ర్వీసుల‌ను మూసివేయాల‌ని నిర్ణ‌యించిన ఈ సంస్థ రూ.46 వేల కోట్ల మేర అప్పుల‌తో కునారిల్లుతోంది. ఎయిర్సెల్ విలీన ఒప్పందం సైతం త‌న‌కేమాత్రం లాభించ‌క‌పోవ‌డంతో మొత్తానికి వాయిస్ సేవ‌ల‌ను నిలిపివేసేందుకు రిల‌య‌న్స్ క‌మ్యూనికేష‌న్ నిర్ణ‌యించింది.

English summary

రిల‌య‌న్స్ క‌మ్యూనికేష‌న్ యూజ‌ర్లు డిసెంబ‌రు 31లోపు పోర్టింగ్ అవ్వాలి | RCom to shut voice calls from Dec 1 so users have to port from thereon

Reliance (RCOM) is permanently closing 2g, 3g and dth services form dec 1
Story first published: Saturday, November 4, 2017, 16:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X