For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్ర‌పంచంలోనే శ‌క్తిమంత‌మైన మ‌హిళ‌ల్లో భార‌త్ నుంచి ఈ ఐదుగురు

జాబితాలో ఐసిఐసిఐ సిఇఓ చందా కొచ్చర్, నటి ప్రియాంక చోప్రా, హెచ్‌సిఎల్ సిఇఓ రోష్నీ మల్హోత్రా, బయోకాన్ సంస్థాపకురాలు కిరణ్ మజుందార్ ఉన్నారు. వారిలో ఒక్క‌క్క‌రి గురించి తెలుసుకుందాం.

|

శ‌క్తిమంత‌మైన మ‌హిళ‌లుగా మ‌న భారతీయ మహిళలుఈ ఏటా వారి హ‌వా కొన‌సాగించారు. ఫోర్బ్స్ మ్యాగ‌జైన్ ప్రపంచ వ్యాప్తంగా భిన్న రంగాలకు చెందిన వంద మందిని ఎంచుకోగా అత్యంత ప్రభావం చూపే మహిళలల్లో ఐదుగురు భారతీయ నారీమణులకు స్థానం దక్కింది. వీరిలో ఐసిఐసిఐ సిఇఓ చందా కొచ్చర్, నటి ప్రియాంక చోప్రా, హెచ్‌సిఎల్ సిఇఓ రోష్నీ మల్హోత్రా, బయోకాన్ సంస్థాపకురాలు కిరణ్ మజుందార్ ఉన్నారు. వారిలో ఒక్క‌క్క‌రి గురించి తెలుసుకుందాం.

 జాబితాలో మ‌న దేశం నుంచి 5 మంది మ‌హిళ‌లు

జాబితాలో మ‌న దేశం నుంచి 5 మంది మ‌హిళ‌లు

ఫోర్బ్స్ మ్యాగ‌జైన్ రూపొందించిన ప్ర‌పంచంలోనే శ‌క్తిమంత‌మైన నారీమ‌ణుల జాబితాలో భార‌త్ నుంచి 5 మంది మ‌హిళ‌లు చోటు ద‌క్కించుకున్నారు. చందా కొచ్చ‌ర్ జాబితాలో భారత్ నుంచి ప్ర‌థ‌మ స్థానాన్ని అల‌రించ‌గా, ఇంకా న‌లుగురు ఒక‌రు టెక్ దిగ్గ‌జం, మ‌రొక‌ర్ బ‌యోటెక్ దిగ్గ‌జం, బాలీవుడ్ సినీ న‌టి మ‌రొక‌రు ఉన్నారు. ఒక‌రు మీడియా నుంచి సైతం ఉండ‌టం విశేషం.

చందా కొచ్చర్

చందా కొచ్చర్

దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు, ప్రపంచంలోనే ప్రైవేటు బ్యాంకుల్లో త‌న‌కంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈవోగా వ్య‌వ‌హ‌రిస్తున్న చందా కొచ్చ‌ర్ జాబితాలో 32వ స్థానంలో నిలిచారు.

రోషిణి మల్హోత్రా

రోషిణి మల్హోత్రా

రోషిణి నాడ‌ర్ మ‌ల్హోత్రా(35) హెచ్‌సీఎల్ సీఈవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈమె హెచ్‌సీఎల్ వ్య‌వ‌స్థాకులైన శివ్ నాడ‌ర్ ఏకైక త‌న‌య‌. ఫోర్బ్స్ జాబితాలో శ‌క్తిమంత‌మైన మ‌హిళ‌ల్లో 57వ స్థానాన్ని ద‌క్కించుకోవ‌డం ఈ ఏడాది విశేషం.

కిరణ్ మజుందార్ షా

కిరణ్ మజుందార్ షా

ఎప్ప‌టిలాగే దేశం నుంచి శ‌క్తిమంత‌మైన మ‌హిళల జాబితా ఎప్పుడు త‌యారుచేసినా వినిపించే పేరిది. దేశంలోనే శ‌క్తిమంతమైన బ‌యోటెక్ కంపెనీని నిర్మించిన బ‌యోకాన్ ఎండీ కిర‌ణ్ మ‌జుందార్ షా 64 వ స్థానంలో నిలిచారు.

 శోభనా భార్తియా

శోభనా భార్తియా

1957లో జ‌న్మించిన శోభ‌నా భ‌ర్తియా హిందుస్థాన్ టైమ్స్ మీడియా గ్రూప్‌కు ఎడిటోరియ‌ల్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ మ‌ధ్యే బిట్స్ పిలానీ ప్రొ చాన్స‌ల‌ర్ బాధ్య‌త‌ల‌ను సైతం తీసుకున్నారు. 2006 నుంచి 2012 వ‌ర‌కూ రాజ్య‌స‌భ స‌భ్యురాలిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. శోభ‌నా భార్తియా 92వ స్థానంలో ఉన్నారు.

ప్రియాంకా చోప్రా

ప్రియాంకా చోప్రా

ప్రియాంకా చోప్రా అనే పేరు తెలియ‌ని యువ‌త భార‌త్‌లో ఉండ‌దేమో అంటే అతిశ‌యోక్తి కాదు. త‌న న‌ట‌న ద్వారా అంత ప్రభావాన్ని చూపారు. ఒక‌ప్పుడు బాలీవుడ్‌లోనే కాదు.. ప్ర‌స్తుతం హాలీవుడ్లో సైతం ఈమె విజ‌యవంతంగా దూసుకెళుతున్న‌ది.

2003లో బాలీవుడ్లోకి అడుగుడిన ఆమె మొత్తం 50 సినిమాల వ‌ర‌కూ చేసి ఉంటారు. త‌న‌లో ఉన్న సేవా దృక్ప‌థంతో యునిసెఫ్‌తో చేయి క‌లిపి పిల్ల‌ల హ‌క్కుల కోసం పోరాటం చేస్తోంది. యూఎస్ ఫౌండేష‌న్‌కు చెందిన గ‌ర్ల్ అప్ ప్ర‌చారం కార్య‌క్ర‌మంలో పాల్గొంటూ బాలిక‌ల ఉన్న‌తికి పాటుప‌డుతోంది. 100 మందిలో ప్రియాంక 97వ శ‌క్తిమంత‌మైన మ‌హిళ‌గా చోటు ద‌క్కించుకున్నారు.

Read more about: forbes powerful women
English summary

ప్ర‌పంచంలోనే శ‌క్తిమంత‌మైన మ‌హిళ‌ల్లో భార‌త్ నుంచి ఈ ఐదుగురు | Forbes 5 Indian women in the worlds list 2017 of powerful women

Five Indian women have found their way to the 2017 edition of The World’s Most Powerful Women List, brought out by Forbes.
Story first published: Saturday, November 4, 2017, 11:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X