For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎన్నారైగా మారితే పీపీఎఫ్ ఖాతా మూసివేత‌

పీపీఎఫ్‌, ఎన్ఎస్‌సీ(జాతీయ పొదుపు ప‌త్రాలు) వంటి చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. ఖాతాదారులు తమ వ్యక్తిగత హోదాను ఎన్నారైలుగా మార్చుకున్న పక్షంలో.. మెచ్యురిటీ తీరకముందే వ

|

పీపీఎఫ్‌, ఎన్ఎస్‌సీ(జాతీయ పొదుపు ప‌త్రాలు) వంటి చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. ఖాతాదారులు తమ వ్యక్తిగత హోదాను ఎన్నారైలుగా మార్చుకున్న పక్షంలో.. మెచ్యురిటీ తీరకముందే వారి ఖాతాలు మూసివేయనున్నట్టు కేంద్ర వెల్లడించింది. ఈ నెల మొదట్లోనే దీనిపై గెజిట్ నోటిఫికేషన్‌ వెలువడింది. 1968 పీపీఎఫ్ పథకానికి చేపట్టిన సవరణ ప్రకారం.. ''ఈ పథకం కింద ఖాతా తెరిచిన పౌరులు, మెచ్యూరిటీ సమయానికి ముందు నాన్ రెసిడెంట్లుగా మారితే, ఎన్నరైలుగా మారిన రోజే వారి ఖాతాలు కూడా మూసివేయడం జరుగుతుంది..'' అని పేర్కొన్నారు. మూసివేసిన సదరు ఖాతాలకు కూడా ఆ రోజు దాకా మాత్రమే వడ్డీ చెల్లించడం జరుగుతుందని పేర్కొన్నారు.

 ఎన్నారైగా మారితే పీపీఎఫ్ ఖాతా మూసివేత‌

పోస్టల్ శాఖ అందిస్తున్న ఎన్ఎస్‌సీ, పీపీఎఫ్, నెలవారీ ఆదాయ పథకం సహా పలు డిపాజిట్లు, పథకాల్లో ఎన్నారైలకు అవకాశం లేదు. దీనిపై కొందరు మీడియా ప్రతినిధులు సంబంధిత అధికారులను ప్రశ్నించగా... తపాలా శాఖ పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారైలను ఎందుకు అనుమతించడంలేదో తమకు స్పష్టత లేదని పేర్కొనడం గమనార్హం.

Read more about: ppf small saving schemes
English summary

ఎన్నారైగా మారితే పీపీఎఫ్ ఖాతా మూసివేత‌ | PPF Account To Be Closed If Account Holder Becomes NRI

Amending rules on small savings schemes like National Savings Certificates (NSC) and Public Provident Fund (PPF), the government has notified that such accounts would be closed prior to maturity in case of holders changing their personal status to become non-resident Indians (NRIs)
Story first published: Tuesday, October 31, 2017, 10:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X