For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోట్ల విలువ చేసే ప‌తంజ‌లి వెనుక ఒకే ఒక్క‌డు.. ఆయ‌న స‌క్సెస్ ఫార్ములా ఏంటో..

ఆచార్య బాల‌కృష్ణ‌కు ప‌తంజ‌లిలో 98.6శాతం వాటా ఉంది.బాబా రాందేవ్,బాల‌కృష్ణ‌ వీళ్లిద్ద‌రూ క‌లిసి ఇంత పెద్ద ప‌రిశ్ర‌మ‌ను ఎలా నెల‌కొల్పారో దాని వెనుక వారి కృషి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

చాలా మందికి ప‌తంజ‌లి అన‌గానే బాబా రాందేవ్ గుర్తుకొస్తారు. కానీ ఈ సంస్థ‌ను న‌డిపించేది మాత్రం ఆచార్య బాల‌కృష్ణ‌. బాబా రాందేవ్‌తో క‌లిసి ఆయ‌న 2006లో ప‌తంజ‌లిని స్థాపించారు. భార‌త్‌లో ప్ర‌ఖ్యాత ఎఫ్ఎంసీజీ సంస్థ అయిన పతంజ‌లి ఆయుర్వేదకు మేనేజింగ్ డైరెక్ట‌ర్, ప్రాథ‌మిక షేర్‌హోల్డ‌ర్ గా ఆచార్య బాల‌కృష్ణ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆచార్య బాల‌కృష్ణ‌కు ప‌తంజ‌లిలో 98.6శాతం వాటా ఉంది. వీళ్లిద్ద‌రూ క‌లిసి ఇంత పెద్ద ప‌రిశ్ర‌మ‌ను ఎలా నెల‌కొల్పారో దాని వెనుక వారి కృషి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బిలియ‌నీర్ బాబా

బిలియ‌నీర్ బాబా

యోగా ఎలా చేయాలో నేర్పించ‌డం ద్వారా కోటానుకోట్లు సంపాదించ‌డం సాధ్యం కాదు అనుకునేవారికి ఆచార్య బాల‌కృష్ణ పేరే స‌మాధానం. హురున్ ఇండియా అనే సంస్థ 2017 సంవ‌త్స‌రానికిగాను సంప‌న్నుల జాబితాను త‌యారుచేసింది. ఇందులో ప‌తంజ‌లి సీఈఓ అయిన ఆచార్య బాల‌కృష్ణ ఏకంగా 8వ స్థానంలో నిలిచారు. గ‌తేడాది ఆయ‌న 25వ ర్యాంకులో ఉండ‌డం గ‌మ‌నించాల్సిన విష‌యం. ఈ సంవ‌త్స‌రం సంస్థ లాభం 173శాతం పెరిగి ఏకంగా రూ.70వేల కోట్ల‌కు చేరుకుందంటే నిజంగా విశేష‌మే.

ప‌తంజ‌లి ప్ర‌స్థానం పైపైకే

ప‌తంజ‌లి ప్ర‌స్థానం పైపైకే

44 ఏళ్ల వ‌య‌సులో ఉన్న ఆచార్య బాల‌కృష్ణ ఈ ఏడాదిలో మార్చి నెల‌లో ఫోర్బ్స్ జాబితాలో చేరారు. ప్ర‌పంచ బిలియ‌నీర్ల జాబితాలో ఆయ‌న 814వ స్థానాన్ని ద‌క్కించుకున్నారు. ఈ నివేదిక‌లో మొత్తం 2,043 సంప‌న్నుల పేర్లను పేర్కొన్నారు. గ‌తేడాది ఫోర్బ్స్ విడుద‌ల చేసిన‌ భార‌త్‌లో తొలి 100 మంది సంప‌న్నుల జాబితాలో బాల‌కృష్ణ 48వ స్థానాన్ని ఆక్ర‌మించుకున్నారు. అప్పుడు సంస్థ నిక‌ర విలువ 2.5 బిలియ‌న్ డాల‌ర్లు.

 ఎఫ్ఎంసీజీ రంగానికి వ‌నుకు పుట్టిస్తోంది

ఎఫ్ఎంసీజీ రంగానికి వ‌నుకు పుట్టిస్తోంది

2017 ఆర్థిక సంవ‌త్స‌రంలో ప‌తంజ‌లి ట‌ర్నోవ‌ర్ రూ.10,561కోట్ల‌కు చేరుకుంది. ప్రపంచ దిగ్గ‌జ బ్రాండ్ల‌తో ప‌తంజ‌లి పోటీకి సై అంటోంది. ఎఫ్ఎంసీజీ రంగంలో హిందుస్తాన్ యునీలివ‌ర్ (హెచ్‌యూఎల్‌) త‌ర్వాతి స్థానంలో ఉన్న‌ది ప‌తంజ‌లి కావ‌డం విశేషం. హెచ్‌యూఎల్ ట‌ర్నోవ‌ర్ రూ.30,783కోట్లు. క‌న్జూమ‌ర్ గూడ్స్ విభాగంలో ట‌ర్నోవ‌ర్‌ను రెండింత‌లు చేసే ల‌క్ష్యంతో ప‌తంజ‌లి వ‌డి వ‌డి అడుగులు వేస్తుంది.

విజయం చేజిక్కించుకునేందుకే పుట్టాడు...

విజయం చేజిక్కించుకునేందుకే పుట్టాడు...

ప‌తంజ‌లి ఒక వేళ త‌న ట‌ర్నోవ‌ర్‌ను రెండింత‌లు చేసుకోగ‌లిగితే .. హెచ్‌యూఎల్‌కు కాస్త దూరంలోనే ఉంటుంది. అది ఎలా సాధించాలో బాగా తెలిసిన వ్య‌క్తి ఆచార్య బాల‌కృష్ణ‌. ఏ కార‌ణం లేకుండా ఆయ‌న ఈ స్థాయికి ఎద‌గ‌లేదు. ఆయ‌న జీవన శైలిని గ‌మ‌నిస్తే బ‌ల‌మైన ప‌నిచేసే గుణాన్ని చూడొచ్చు. విజ‌యాన్ని చేజిక్కించుకునేందుకే ఆయ‌న పుట్టాడ‌ని మీరు ఒప్పుకుంటారు.

ఆయ‌న జీత‌మెంతంటే..

ఆయ‌న జీత‌మెంతంటే..

కోటానుకోట్ల వ్యాపారం చేతుల్లో ఉంది. ఆచార్య బాల‌కృష్ణ ఎంత జీతం తీసుకుంటాడో ఊహించ‌గ‌ల‌రా? ప‌తంజ‌లి ఆయుర్వేద‌లో ఆయ‌న వాటా 94శాతం. అయినా కూడా ఆయ‌న ఎలాంటి వేత‌నం తీసుకోడు. రోజుకు 15 గంట‌లు క‌ష్ట‌ప‌డి పనిచేస్తారు. ఆదివారాలు, సెల‌వు రోజుల‌ని కాకుండా సంవ‌త్స‌రం పొడ‌వునా ఆయ‌న క‌ష్ట‌ప‌డుతూనే ఉంటారు.

 వ్యాపార ప్ర‌స్థాన‌మిలా...

వ్యాపార ప్ర‌స్థాన‌మిలా...

ఆచార్య నేపాల్‌లో పుట్టారు. రామ్‌దేవ్‌తో క‌లిసి హ‌ర్యానాలోని గురుకులంలో చ‌దువుకున్నారు. 1995లో ఇద్ద‌రూ క‌లిసి దివ్వ ఫార్మ‌సీని స్థాపించారు. 2006లో ప‌తంజ‌లి ఆయుర్వేద‌న నెల‌కొల్పారు. ప‌దేళ్ల క్రితం ఆయ‌న ఈ వ్యాపారంలో అడుగు పెట్టిన‌ప్పుడు ఇంత‌గా ఎదుగుతాడ‌ని అనుకోలేదని చెప్పారు. ఇటీవ‌ల రూ.50-60కోట్ల వ్య‌క్తిగ‌త రుణం తీసుకోవాల్సి వ‌చ్చింది. చాలా ఏళ్ల క్రితం నాకు క‌నీసం వ్య‌క్తిగ‌త బ్యాంకు ఖాతా కూడా ఉండేది కాదు అని తాను ఎదిగిన వైనాన్ని ఆచార్య బాల‌కృష్ణ చెప్పుకొచ్చారు.

Trending articles on Telugu Goodreturns

ఈ ఐదూ పాటిస్తే మీ ఆర్థిక జీవితం బాగుంటుందిఈ ఐదూ పాటిస్తే మీ ఆర్థిక జీవితం బాగుంటుంది

దేశంలో అందుబాటులో ఉన్న 10 పెట్టుబ‌డి మార్గాల గురించి-స‌మ‌గ్రంగా దేశంలో అందుబాటులో ఉన్న 10 పెట్టుబ‌డి మార్గాల గురించి-స‌మ‌గ్రంగా

2017లో దేశంలో ధ‌నిక స్టార్ట‌ప్ వ్య‌వస్థాప‌కులు వీరే..2017లో దేశంలో ధ‌నిక స్టార్ట‌ప్ వ్య‌వస్థాప‌కులు వీరే..

స్థిర‌మైన‌ ఆకాంక్ష‌

స్థిర‌మైన‌ ఆకాంక్ష‌

ఆచార్య గ‌తంలో ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కొన‌ట్టుగా తెలుస్తోంది. 2011లో ఆయ‌న ఓ చీటింగ్ కేసులో సీబీఐ విచార‌ణ‌లో ప‌ట్టుబ‌డిన‌ట్టు స‌మాచారం. అయితే రెండేళ్ల త‌ర్వాత ఆయ‌న‌కు క్లీన్ చిట్ ఇవ్వ‌డం వేరే సంగ‌తి. అప్ప‌టి నుంచే ఆయ‌న ఎదుగుద‌ల ప్రారంభ‌మైంద‌ని చెబుతారు.

ఎఫ్ఎంసీజీ రంగంలో ప‌తంజ‌లిని నెంబ‌ర్ 1 చేయాల‌న్న‌దే ఆచార్య బాల‌కృష్ణ ల‌క్ష్యం. ఆయ‌న ముందున్న ల‌క్ష్యాల్లో భాగంగా ప‌తంజ‌లి వృద్ధికి చేస్తున్న‌దేమిటంటే.. పంపిణీదారుల సంఖ్య‌ను రెండింత‌లు చేసి 12వేల‌కు చేర్చ‌డం, కొత్త ప్లాంటుల ఏర్పాటుకు రూ.5వేల కోట్ల పెట్టుబ‌డులు వెచ్చించ‌డం, అయిదేళ్ల‌లో 5రెట్ల వినియోగాన్ని పెంచ‌డం, కొత్త రెస్టారెంట్ స‌ముదాయాన్ని స్థాపించ‌డం . ఇవ‌న్నీ ఆయ‌న భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌లు.

Read more about: patanjali acharya balakrishna
English summary

కోట్ల విలువ చేసే ప‌తంజ‌లి వెనుక ఒకే ఒక్క‌డు.. ఆయ‌న స‌క్సెస్ ఫార్ములా ఏంటో.. | How Acharya Balkrishna built a multi-crore company patanjali

Acharya Balkrishna is the managing director and primary stakeholder of Patanjali Ayurved, an Indian FMCG company. He is a close aide of yoga guru, Baba Ramdev, with whom he founded the company in 2006.Acharya Balkrishna derives his fortune from fast-growing consumer goods giant Patanjali Ayurved. many think patanjali means ramdev baba it is not true.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X