For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2017లో వీరే మనదేశ ధనిక స్టార్టప్ స్థాపకులు

భారతదేశంలో 2017 సంవత్సర మేటి ధనిక టెక్ వ్యాపారసంస్థల పేర్లు ఇంకా పెద్దవి, తెలిసినవే ఉన్నా,కొన్ని ఆ స్థానాల నుంచి పడిపోయాయి- స్నాప్ డీల్ కునాల్ బాల్ మరియు ఓలాకి చెందిన భావిష్ అగర్వాల్ మేటి 15 వ్యాపారవే

|

ఈ ఏడాది స్టార్టప్స్ కి ఇప్పటివరకూ అంతబాగాలేదు- గత రెండేళ్ళ నుంచి నిధులను సమీకరించటం సులభంగా ఏమీ లేదు, పెద్ద పెద్ద సంస్థలు కూడా కష్టపడ్డాయి. కానీ భారతదేశంలో పెద్ద వ్యాపారసంస్థలు విజయవంతమైన స్టార్టప్స్ ను నిర్మించి,చేయూతనిచ్చి లాభాలు కొనసాగించాయి. భారతదేశంలో 2017 సంవత్సర మేటి ధనిక టెక్ వ్యాపారసంస్థల పేర్లు ఇంకా పెద్దవి, తెలిసినవే ఉన్నా,కొన్ని ఆ స్థానాల నుంచి పడిపోయాయి- స్నాప్ డీల్ కునాల్ బాల్ మరియు ఓలాకి చెందిన భావిష్ అగర్వాల్ మేటి 15 వ్యాపారవేత్తల జాబితాలో ఇకలేరు.
చాలా లోతుగా అధ్య‌యనం చేసిన త‌ర్వాత ఏర్ప‌డిన భారతదేశంలో మేటి ధనిక వ్యాపారవేత్తల పూర్తి జాబితాను ఇక్క‌డ‌ చూడండి.

1. భవిన్ తురాఖియా, డైరెక్టి/మీడియా.నెట్ ; రూ.11,500 కోట్లు

1. భవిన్ తురాఖియా, డైరెక్టి/మీడియా.నెట్ ; రూ.11,500 కోట్లు

2017లో సంపద నాలుగురెట్లు పెరగడంతో భావిన్ తురాఖియా మొదటిస్థానానికి చేరుకున్నారు.2016 చివర్లో తురాఖియా తన సోదరుడు దివ్యాంక్ తుఖాఖియాతో కలిసి మీడియా.నెట్ బిజినెస్ ను $900మిలియన్లకి ఒక చైనీస్ సంస్థకి అమ్మేసారు.మీడియా.నెట్ ఇప్పుడు పూర్తిగా ఎదిగి ఇద్దరు సోదరులు బిలియనీర్లు అయ్యారు. రూ.11500 కోట్లతో భావిన్ తురాఖియా దేశంలోనే ధనిక టెక్ వ్యాపారవేత్తగా నిలిచారు.

2. విజయ్ శేఖర్ శర్మ,పేటీఎమ్‌ ; రూ.9000 కోట్లు

2. విజయ్ శేఖర్ శర్మ,పేటీఎమ్‌ ; రూ.9000 కోట్లు

పేటీఎమ్‌ విజయ్ శేఖర్ శర్మకి అత్యద్భుతంగా కలిసొచ్చిన కాలం. 2016 చివర్న నగదు రద్దుతో మొదలైన వారి జైత్రయాత్ర, 2017లో కూడా వేగం తగ్గించకుండా పేమెంట్'స్ బ్యాంక్ ను కూడా తెరిచేలా చేసింది. ఈ సంస్థ సాఫ్ట్ బ్యాంక్ నుంచి $1.4బిలియన్ల నిధితో మొత్తం $8బిలియన్ల విలువకి చేరుకుంది. 38ఏళ్ళ శర్మ ఇప్పుడు 9000 కోట్ల రూపాయలకు అధిపతి.

3.సచిన్ బన్సాల్/బిన్నీ బన్సాల్, ఫ్లిప్ కార్ట్ ; రూ. 5400 కోట్లు

3.సచిన్ బన్సాల్/బిన్నీ బన్సాల్, ఫ్లిప్ కార్ట్ ; రూ. 5400 కోట్లు

ఫ్లిప్ కార్ట్ స్థాపకులు ఇద్దరూ భారతీయ ధనిక వ్యాపారవేత్తల లిస్టులో 3వస్థానం పొందారు.గత రెండేళ్ళ నుంచి వీరు తమ సంపద తగ్గటం చూసారు.2015లో ఇద్దరి సంపద విలువ రూ.9010 కోట్లు కాగా, ఫ్లిప్ కార్ట్ తరపున ఇద్దరూ చెరో 5400 కోట్ల రూపాయల ఆస్తిపరులుగా ఉన్నారు.

4. గణేష్ కృష్ణన్, పోర్టియా మెడికల్ ; రూ. 5100 కోట్లు

4. గణేష్ కృష్ణన్, పోర్టియా మెడికల్ ; రూ. 5100 కోట్లు

వరుస వ్యాపారవేత్త గణేష్ కృష్ణన్ లిస్టులో 4వ స్థానంలో రూ. 5100 కోట్లతో నిలిచివున్నారు. కృష్ణన్ పోర్టియా మెడికల్, ట్యూటర్ విస్టా స్థాపకులు మరియు బిగ్ బాస్కెట్, బ్లూస్టోన్.కాం మరియు హోంలేన్.కాం కి ప్రచారకర్త.

5. సంజీవ్ బిఖ్చందాని, ఇన్ఫో ఎడ్జ్ ; రూ. 4800 కోట్లు

5. సంజీవ్ బిఖ్చందాని, ఇన్ఫో ఎడ్జ్ ; రూ. 4800 కోట్లు

ఇన్ఫో ఎడ్జ్ దేశంలోనే పాపులర్ ఇంటర్నెట్ వ్యాపారసంస్థల్లో ఒకటి. ప్రసిద్ధ వెబ్ సైట్లయిన నౌకరి.కాం,జీవనసాథి.కాం మరియు 99ఏకర్స్.కాం వంటివి ఈ సంస్థకి చెందినవే. జొమాటోలో వీరికి పెద్ద భాగస్వామ్యం కూడా ఉంది. 1997లో నౌకరి.కాంను స్థాపించిన సంజీవ్ బిఖ్చందాని ఇప్పుడు 4800 కోట్ల రూపాయలకి యజమాని.

6.విశాల్ మెహతా, ఇన్ఫీబీం.కాం ; రూ.3500 కోట్లు

6.విశాల్ మెహతా, ఇన్ఫీబీం.కాం ; రూ.3500 కోట్లు

ఈ ఏడాది పెద్ద పెద్ద ఈ కామర్స్ సంస్థలు అమెజాన్ ధాటికి తట్టుకోలేకపోతే, ఇన్ఫీబీమ్ మాత్రం లాభం నుంచి లాభానికే పయనించింది. సంస్థ ఇప్పుడు లాభదాయకంగా ఉంది, గత సంవత్సరం పబ్లిక్ అయినప్పటి నుంచి స్టాకుధర గణనీయంగా పెరుగుతూనే వచ్చింది. స్థాపకుడు విశాల్ మెహతా సంపద రూ.3500 కోట్లకి చేరింది.

7. ధీరజ్ రాజారామ్/అంబిగా సుబ్రమణ్యన్, మ్యుసిగ్మా రూ.2500 కోట్లు

7. ధీరజ్ రాజారామ్/అంబిగా సుబ్రమణ్యన్, మ్యుసిగ్మా రూ.2500 కోట్లు

ధీరజ్ రాజారామ్ 2015లో దేశంలోనే అత్యంత ధనిక టెక్ వ్యాపారవేత్తగా రూ.17800 కోట్లతో విరాజిల్లారు.కానీ అప్పటి నుంచి వారు పతనంలోనే ఉన్నారు. భార్య, సహస్థాపకురాలు అంబిగా సుబ్రమణ్యన్ తో విడాకుల వలన ఆమె భాగాన్ని విడగొట్టేసి సంస్థను ఇప్పుడు మళ్ళీ దారిలో పెట్టడానికి రాజారామ్ ప్రయత్నిస్తున్నారు.ఈ మాజీ భార్యాభర్తలు చెరో రూ.2500 కోట్లతో లిస్టులో 7వ స్థానంలో ఉన్నారు.

Trending articles on Telugu Goodreturns

మంచి మ్యూచువ‌ల్‌ఫండ్ ఎంపిక‌కు ఈ 10 కంపెనీల ఫండ్ల‌ను ప‌రిశీలించ‌వ‌చ్చుమంచి మ్యూచువ‌ల్‌ఫండ్ ఎంపిక‌కు ఈ 10 కంపెనీల ఫండ్ల‌ను ప‌రిశీలించ‌వ‌చ్చు

ఇంట‌ర్నెట్ ద్వారా డ‌బ్బు సంపాద‌న‌కు 10 ఉత్త‌మ మార్గాలుఇంట‌ర్నెట్ ద్వారా డ‌బ్బు సంపాద‌న‌కు 10 ఉత్త‌మ మార్గాలు

ఆర్థిక జీవితం బాగుండేందుకు 5 సూచ‌న‌లుఆర్థిక జీవితం బాగుండేందుకు 5 సూచ‌న‌లు

8.రాహూల్ శర్మ/సుమీత్ కుమార్/వికాస్ జైన్/రాజేష్ అగర్వాల్, మైక్రోమ్యాక్స్ ;రూ. 1400 కోట్లు

8.రాహూల్ శర్మ/సుమీత్ కుమార్/వికాస్ జైన్/రాజేష్ అగర్వాల్, మైక్రోమ్యాక్స్ ;రూ. 1400 కోట్లు

చైనీస్ సంస్థలైన ఒప్పో,వివోల పోటీతో మైక్రోమాక్స్ కి పోటీ పెరిగింది.కానీ దేశీయ మార్కెట్లో ఇంకా తన స్థానం నిలబెట్టుకునే ఉంది. దాని నలుగురు స్థాపకులు- రాహూల్ శర్మ,సుమీత్ కుమార్, వికాస్ జైన్ మరియు రాజేష్ అగర్వాల్- తలా 1400 కోట్ల రూపాయలకి యజమానులు.

9.విఎస్ ఎస్ మణి, జస్ట్ డయల్ ;రూ. 1100 కోట్లు

9.విఎస్ ఎస్ మణి, జస్ట్ డయల్ ;రూ. 1100 కోట్లు

జస్ట్ డయల్ తన 21 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో అనేక మార్పులు పొందింది. కానీ ఇంకా తన వ్యాపారాన్ని అదే స్థాయిలో,కొత్త పోటీదారులు వచ్చినా కొనసాగిస్తోంది. దాని స్టాకు 2017 మొదట్లో మేటి టెక్ స్టాక్ గా నిలిచింది మరియు స్థాపకుడు విఎస్ ఎస్ మణి ఆస్తి ఈ సంవత్సరం 1100 కోట్లకి చేరింది.

10.బిజు రవీంద్రన్, బిజుస్ ;రూ.1000 కోట్లు

10.బిజు రవీంద్రన్, బిజుస్ ;రూ.1000 కోట్లు

బిజు తన పెరుగుదల లక్ష్యాలను, ఛాన్ జకర్ బర్గ్ ఇన్షియేటివ్ వంటి పెద్ద పెట్టుబడిదారుల భాగస్వామ్యంతో అప్పుడే స్పష్టీకరించింది. ఈ సంవత్సరం అంతర్జాతీయ విస్తరణకై చూస్తున్న బిజు తన ఎడ్ -టెక్ మోడల్ ఈ ఏడాది 400కోట్ల అమ్మకాలు జరుగుతాయని అంచనా. స్థాపకుడు బిజు రవీంద్రన్ ఇప్పుడు 1000కోట్ల రూపాయల కోటీశ్వరుడు.

Read more about: startup richest
English summary

2017లో వీరే మనదేశ ధనిక స్టార్టప్ స్థాపకులు | These Are Richest Startup Founders In 2017 in India

But India’s top entrepreneurs have continued to reap the benefits of having built successful startups, and are still worth some very impressive sums of money. India’s list of richest tech entrepreneurs in 2017 still contains many familiar names, but some have slipped off — Snapdeal’s Kunal Bahl and Ola’s Bhavish Aggarwal are no longer in the top 15 richest entrepreneurs.Here is the list of Richest entrepreneurs in India
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X