For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ కార్డుందా? అయితే దీపావ‌ళికి ఈ ఆఫ‌ర్లు...

ఈ మూడు బ్యాంకులు క్యాష్ బ్యాక్ వంటి వాటితో మొద‌లుకొని నో కాస్ట్ ఈఎంఐ వ‌ర‌కూ వివిధ ర‌కాల నేరుగా రాయితీలు ఇస్తున్నారు. వీటి గురించి మ‌రింత తెలుసుకుందాం.

|

ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ కార్డుదారుల‌కు ఆయా బ్యాంకులు బంప‌ర్ ఆఫ‌ర్‌నిచ్చాయి. దీపావ‌ళి సంద‌ర్భంగా వివిధ ర‌కాల ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించాయి. వివిధ బ్రాండ్ల‌పై త‌మ వినియోగ‌దారుల‌కు ఆక‌ట్టుకునే ఆఫ‌ర్లు ఇస్తున్నాయి ఈ మూడు బ్యాంకులు. క్యాష్ బ్యాక్ వంటి వాటితో మొద‌లుకొని నో కాస్ట్ ఈఎంఐ వ‌ర‌కూ వివిధ ర‌కాల నేరుగా రాయితీలు ఇస్తున్నారు. వీటి గురించి మ‌రింత తెలుసుకుందాం.

ఆఫ‌ర్ల కేట‌గిరీలేంటి?

ఆఫ‌ర్ల కేట‌గిరీలేంటి?

ఆఫ‌ర్ల‌న్నీ ముఖ్యంగా ట్రావెల్‌, ఫ్యాష‌న్‌, హోం ఫ‌ర్నిషింగ్ వంటి వాటి మీద ఉన్నాయి.

పాల్గొంటున్న బ్రాండ్లు: యాత్రా, గ్రోఫ‌ర్స్‌, బిగ్‌బాస్కెట్.కామ్‌, అర్బ‌న్ క్లాప్‌, ఇండిగో, నియ‌ర్‌బై(nearbuy), షాప‌ర్స్ స్టాప్‌, పాంట‌లూన్స్, ఎమిరేట్స్‌, డ‌బ్లు అండ్ గ్రాబాన్(Grabon)

అన్ని కొనుగోళ్ల‌పై, కార్డు ర‌కాల‌పై క‌నీస లావాదేవీ ప‌రిమితి ఉంద‌ని ఆయా కార్డు వెబ్‌సైట్లు పేర్కొన్నాయి.

కాబ‌ట్టి కొనుగోళ్లు జ‌రిపే ముందే అన్నీ తెలుసుకుంటే మంచిది. ఆఫ‌ర్ల తేదీలు జాగ్ర‌త్త‌గా చూడండి. ఇంకెందుకు ఆల‌స్యం ఏ కార్డు మీద ఏయే ఆఫ‌ర్లు ఉన్నాయో, ఎంత ఆదా చేసుకోవ‌చ్చో తెలుసుకోండి మ‌రి.

 ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు దారుల‌కు 5% నుంచి 10% వ‌ర‌కూ

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు దారుల‌కు 5% నుంచి 10% వ‌ర‌కూ

ఉదాహ‌ర‌ణ‌కు మీరు అర్బ‌న్ ల్యాడ‌ర్, హోం టౌన్‌ ద్వారా కొనుగోళ్లు జ‌ర‌పాల‌నుకుంటే ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డు దారుల‌కు 5% క్యాష్ బ్యాక్ రాయితీ ఉంది. అదే బిగ్ బాస్కెట్ వెబ్‌సైట్లో ఎస్బీఐ క్రెడిట్ కార్డు క‌లిగిన వారికి 10% క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్ ఉంది.

మీరు ఒప్పో కొనాలనుకుంటే లేదా పండ‌క్కి కొత్త ఫోన్ కొనాల‌నే ప్ర‌ణాళిక‌లో ఉంటే ఎస్‌బీఐ కార్డు ఉంటే 5% క్యాష్ బ్యాక్

ప్ర‌యాణాల‌కు సంబంధించి

ప్ర‌యాణాల‌కు సంబంధించి

మీకు ప్ర‌యాణాలు ఇష్ట‌మైతే ఇది మీ కోస‌మే. యాత్రా బుకింగ్‌ల‌పై విమాన ప్ర‌యాణాల‌కు సంబంధించి రూ.600 వ‌ర‌కూ ఆదా చేసుకోవ‌చ్చు. ఫ్లాట్ 15% రాయితీలు మీరు పొంద‌వ‌చ్చు. Airbnb ద్వారా భార‌త‌దేశం వెలుప‌ల బ‌స చేసేందుకు బుక్ చేస్తున్న‌ట్ల‌యితే 15% రాయితీ మీ సొంతం ఎస్‌బీఐ కార్డు ద్వారా. అయితే ఈ బుకింగ్‌లన్నీ డిసెంబ‌రు 31 లోపు చేయాలి. స్పైస్ జెట్ ద్వారా ప్ర‌యాణం చేసే వారికి ఆ సంస్థ ఉచిత మీల్స్ ఇస్తున్న‌ది. అయితే ఆ ఆఫ‌ర్ డిసెంబ‌రు 14 వ‌ర‌కూ అందుబాటులో ఉంటుంది.

వివిధ స్టోర్లు, బ్రాండ్ల‌పై ఆఫ‌ర్లు ఇలా...

వివిధ స్టోర్లు, బ్రాండ్ల‌పై ఆఫ‌ర్లు ఇలా...

బోస్, లెనోవో, నికాన్, క్రోమా, శ్యామ్‌సంగ్ వంటి స్టోర్ల‌లో కొనుగోళ్ల‌పై ఫ్లెక్సీ ఈఎంఐ స‌దుపాయం ఉంది. ప్ర‌స్తుతం హెచ్‌పీ, హిటాచీ, సోని సైతం ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డు దారుల‌కు ఈఎంఐకి మార్చుకునేందుకు అవ‌కాశం ఇస్తోంది. ఈఎంఐ ఆప్ష‌న్లు 3,6,12 నెల‌ల కాల‌ప‌రిమితిలో అందుబాటులో ఉన్నాయి. ఎస్‌బీఐ కార్డ్స్ వెబ్‌సైట్లో ఉన్న‌దాని ప్ర‌కారం ఇలాంటి కొనుగోళ్ల‌కు సంబంధించి, ఈఎంఐకి మార్చుకునేందుకు ఎటువంటి డాక్యుమెంటేష‌న్‌, ప్రాసెసింగ్ రుసుముల్లేవు. అంతే కాకుండా కొన్ని ఉత్ప‌త్తుల‌ను ఈఎంఐల ద్వారా కొన్న‌ట్ల‌యితే వ్యాపారులు ఇచ్చే రాయితీలు అద‌నంగా ఉన్నాయని ఎస్‌బీఐ కార్డ్స్ వెబ్‌సైట్ పేర్కొంది.

ఐసీఐసీఐ కార్డు దారులారా ఇది మీ కోస‌మే...

ఐసీఐసీఐ కార్డు దారులారా ఇది మీ కోస‌మే...

ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుదారులు సైతం ఆకట్ట‌కునే రాయితీలు, క్యాష్ బ్యాక్‌లు పొంద‌వ‌చ్చు. ఐసీఐసీఐ SOTC ట్రావెల్‌తో జ‌ట్టుక‌ట్టి రూ.3000 రాయితీని అందిస్తోంది. అయితే ఇది అంత‌ర్జాతీయ ప్ర‌యాణ బుకింగ్‌ల‌కు మాత్ర‌మే. దేశీయ ప్ర‌యాణికుల‌కు యాత్రా (www.yatra.com)బుకింగ్‌ల ద్వారా 5% క్యాష్ బ్యాక్ అందుతుంది. ఇంకా యాపిల్ ఉత్ప‌త్తులైన మ్యాక్ బుక్‌, ఐపాడ్ వంటి వ‌స్తువుల‌పై ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డు ద్వారా క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్ ఉంది.

ఈ-కామ‌ర్స్ ఉత్ప‌త్తుల‌పై హెచ్‌డీఎఫ్‌సీ కార్డు ద్వారా ఆదా

ఈ-కామ‌ర్స్ ఉత్ప‌త్తుల‌పై హెచ్‌డీఎఫ్‌సీ కార్డు ద్వారా ఆదా

అమెజాన్, స్నాప్‌డీల్‌, మైంత్రా, పేజాప్, జెట్ ఎయిర్‌వేస్ ద్వారా న‌గ‌దు రాయితీల‌ను, రివార్డు పాయింట్లను హెచ్డీఎఫ్‌సీ బ్యాంకు అందిస్తోంది. త‌నిష్క్, మియా, గోల్డ్ ప్ల‌స్ స్టోర్ల‌లో హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోళ్లు జ‌రిపితే 5% రాయితీ వ‌స్తుంది. జెట్ ఎయిర్‌వేస్ ఎకాన‌మీ, ప్రీమియం క్లాస్ ప్ర‌యాణికులు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ఉప‌యోగించి మొత్తం టికెట్ ధ‌ర మీద 10 నుంచి 15% వ‌ర‌కూ రాయితీ పొంద‌వ‌చ్చు. ఈ దీపావ‌ళికి ఫ్లిప్ కార్ట్ వెబ్‌సైట్, యాప్ కొనుగోళ్ల‌కు హెచ్‌డీఎఫ్‌సీ కార్డు వాడ‌టం ద్వారా చెప్పుకోద‌గ్గ మొత్తాన్ని ఆదా చేసుకోవ‌చ్చు.

English summary

ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ కార్డుందా? అయితే దీపావ‌ళికి ఈ ఆఫ‌ర్లు... | sbi ICICI HDFC card holders be ready with your cards For Diwali offers

It is a good time for State Bank of India (SBI), ICICI and HDFC credit card and debit card users. The banks have tied up with different brands to provide various offers to its customers. These range from straight discount to cash back to EMI.
Story first published: Saturday, October 14, 2017, 16:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X