For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దూసుకెళ్లిన దేశీయ మార్కెట్లు

రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల రేసులో దూసుకెళ్లాయి. అటు ఇన్వెస్టర్లు, ఇటు ట్రేడర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. నిఫ్టీ ఇంట్రాడేలో 10,179ను అధిగమించడం ద్వ

|

రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల రేసులో దూసుకెళ్లాయి. అటు ఇన్వెస్టర్లు, ఇటు ట్రేడర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. నిఫ్టీ ఇంట్రాడేలో 10,179ను అధిగమించడం ద్వారా 10,192 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. అంతేకాకుండా 71 పాయింట్లు పుంజుకోవడం ద్వారా 10,167 వద్ద ముగియడం ద్వారా కూడా కొత్త రికార్డును నమోదు చేసింది. మరో సూచీ సెన్సెక్స్‌ సైతం 250 పాయింట్లు జంప్‌చేసి 32,433 వద్ద ముగిసింది. తద్వారా కొత్త రికార్డ్‌ గరిష్టం 125 పాయింట్ల దూరంలో నిలిచింది. దీంతో స్టాక్‌ మార్కెట్లలో ముందుగానే దీపావళి సంద‌డి ముందే వ‌చ్చింది.

 సెన్సెక్స్‌

బ్యాంక్‌ నిఫ్టీ అండ
ఎన్‌ఎస్ఈలో బ్యాంక్‌ నిఫ్టీ 1.4 శాతం జంప్‌చేయడం ద్వారా మార్కెట్లకు ప్రోత్సాహాన్నివ్వగా.. మెటల్‌ ఇండెక్స్‌ సైతం 1.2 శాతం ఎగసింది. నిఫ్టీ దిగ్గజాలలో ఎయిర్‌టెల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, టాటా స్టీల్‌, బాష్‌, అల్ట్రాటెక్‌, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ 8-1.5 శాతం మధ్య దూసుకెళ్లాయి. మరోపక్క గెయిల్‌, బీపీసీఎల్‌, జీ, సన్‌ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎంఅండ్‌ఎం, యూపీఎల్‌, విప్రో, అరబిందో, ఎల్‌అండ్‌టీ 2-0.5 శాతం మధ్య నీరసించాయి.

 సెన్సెక్స్‌

ఎఫ్‌పీఐల అమ్మకాలు
సెప్టెంబర్‌ మొదలు దేశీ స్టాక్స్‌ నుంచి పెట్టుబడుల ఉపసంహరణకే ప్రాధాన్యమిస్తూ వస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) గురువారం రూ. 668 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. నగదు విభాగంలో గత 9 రోజుల్లో ఎఫ్‌పీఐలు రూ. 11,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఎఫ్‌పీఐలకు ధీటుగా గత 9 రోజుల్లో రూ. 11,600 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన దేశీ ఫండ్స్ (డీఐఐలు) గురువారం రూ. 872 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి!
బీఎస్ఈ సెన్సెక్స్‌లో షేర్లు ఇలా...
సెన్సెక్స్ సూచీలో లాభ‌ప‌డిన వాటిలో భార‌తీ ఎయిర్‌టెల్(7.66%), భార‌తీ ఇన్‌ఫ్రాటెల్(4.16%), టాటా స్టీల్‌(2.78%), కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్(2.34%), అల్ట్రాటెక్ సిమెంట్(2.17%) ఉండ‌గా మ‌రో వైపు గెయిల్ ఇండియా(1.89%), జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌(1.45%), డాక్ట‌ర్ రెడ్డీస్‌(1.07%), మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా(0.96%), స‌న్ ఫార్మా(0.9%) న‌ష్ట‌పోయిన వాటిలో ముందు ఉన్నాయి.

English summary

దూసుకెళ్లిన దేశీయ మార్కెట్లు | market created new records in today trading

nifty record high closing
Story first published: Friday, October 13, 2017, 16:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X