For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిజిట‌ల్ లావాదేవీల‌ను దౌడు తీయిస్తున్న ఐఎంపీఎస్‌, కార్డులు

పెద్దనోట్ల రద్దు తర్వాత డిజిటల్‌ లావాదేవీలపై ప్ర‌జ‌ల్లో అవగాహన బాగా పెరిగింది. దీనికి తోడు ఆన్‌లైన్‌ వినియోగం కూడా పెరగడంతో బ్యాంకుల నుంచి బ్యాంకులకు నగదు బదిలీతో పాటు, ఆన్‌లైన్‌ కొనుగోళ్లు, పేటీఎం, క

|

* ఆగ‌స్టు నెల‌లో గ‌ణ‌నీయంగా పెరిగిన డిజిట‌ల్ చెల్లింపులు
పెద్దనోట్ల రద్దు తర్వాత డిజిటల్‌ లావాదేవీలపై ప్ర‌జ‌ల్లో అవగాహన బాగా పెరిగింది. దీనికి తోడు ఆన్‌లైన్‌ వినియోగం కూడా పెరగడంతో బ్యాంకుల నుంచి బ్యాంకులకు నగదు బదిలీతో పాటు, ఆన్‌లైన్‌ కొనుగోళ్లు, పేటీఎం, క్రెడిట్‌, డెబిట్‌ కార్డు చెల్లింపులు బాగా ఎక్కువయ్యాయి. దీంతో న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌కు మొగ్గుచూపేవారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. గత ఆగస్టులో దేశవ్యాప్తంగా 7.56కోట్ల డిజిటల్‌ లావాదేవీలు జరిగాయట. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన డేటాలో ఈ విషయం వెల్లడైంది.

డిజిట‌ల్ చెల్లింపులు

ఆన్‌లైన్‌ డేటా లావాదేవీలపై ఆర్‌బీఐ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం.. ఆగస్టులో 7.56కోట్ల డిజిటల్‌ లావాదేవీలు జరిగాయి. అంతకు ముందు జులైలో 6.9కోట్లు, జూన్‌లో 6.58కోట్ల ఆన్‌లైన్‌ లావాదేవీలు జరిగాయి. నెలనెలకు బ్యాంకు నుంచి బ్యాంకు బదిలీలు, డెబిట్‌ కార్డు పేమెంట్స్‌ వరుసగా 9.5శాతం, 3.5శాతం వృద్ధి చెందుతున్నట్లు ఆర్‌బీఐ నివేదికలో పేర్కొంది.

డిజిట‌ల్ చెల్లింపులు

అయితే బ్యాంక్‌ ఖాతాల ద్వారా డిజిటల్‌ చెల్లింపులు పెరగగా.. మొబైల్‌ వ్యాలెట్‌ పేమెంట్స్‌ మాత్రం కాస్త తగ్గిపోయాయి. జులైలో 23.54కోట్ల మొబైల్‌ వ్యాలెట్‌ చెల్లింపులు జరగగా.. ఆగస్టులో ఆ సంఖ్య 22.54కోట్లకు మాత్రమే పరిమితమైంది. కాగా.. ఆగస్టులో వినాయకచవితి, రాఖీ పౌర్ణమి, స్వాత్రంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్లలో ఆఫర్లు అదరగొట్టిన విషయం తెలిసిందే. వీటివల్లే డిజిటల్‌ లావాదేవీలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబర్‌, అక్టోబర్‌లోనూ ఈ లావాదేవీలు మరింత పెరుగుతాయన్నారు.

Read more about: digital online card payments imps
English summary

డిజిట‌ల్ లావాదేవీల‌ను దౌడు తీయిస్తున్న ఐఎంపీఎస్‌, కార్డులు | imps and debit cards drive digital payments

Bank-to-bank transfers and debit card payments at point of sales terminals significantly drove digital payments for August, showing a 9.5% and 3.5% month-on-month growth, respectively.
Story first published: Wednesday, October 11, 2017, 15:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X