For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విశాఖ ప‌ట్నం న‌గ‌దు ర‌హితంగా

Aiming to cover 90 per cent of this coastal city's 2 million citizens in a year, the Andhra Pradesh government today launched a campaign to reduce the cash dependence with a cashless payment option ca

|

ఆంధ్రుల ఆర్థిక ప‌ట్ట‌ణం విశాఖను న‌గ‌దు ర‌హితంగా తీర్చిదిద్దేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. దాదాపు వైజాగ్‌లోని 20 ల‌క్ష‌ల మందిని న‌గ‌దు మీద ఆధార‌ప‌డటం త‌గ్గించి న‌గ‌దు ర‌హిత చెల్లింపుల వైపు మ‌ళ్లేలా ప్రోత్స‌హించేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌చారాన్ని చేప‌ట్టింది. "న‌గ‌రంలో న‌గ‌దుపై ఆధార‌ప‌డ‌టం త‌గ్గించాలి. ఇందుకోసం ప్ర‌చారం మొద‌లుపెట్టాం" అని ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ విలేక‌రులతో చెప్పారు.

 ఆన్‌లైన్ చెల్లింపులు

ఈ పోర్టు న‌గ‌రంలో న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌కు అవ‌స‌ర‌మైన మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించామ‌ని, ప్ర‌భుత్వం న‌డిపే బ‌స్సుల్లో సైతం డిజిటల్ చెల్లింపుల‌కు వీలు క‌ల్పించామ‌ని ప్ర‌జ‌లు దీన్ని ఉప‌యోగించుకోవాల్సిందిగా లోకేష్ కోరారు. బస్సుల్లో సెన్సార్ ఆధారిత "ట్యాప్ అండ్ పే" విధానం ద్వారా చెల్లింపులను ప్రారంభించారు. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌లు తీసుకొచ్చి, వ్యాపారుల‌ను త‌మ దుకాణాల వ‌ద్ద డిజిట‌ల్ చెల్లింపులు జ‌రిపే విధంగా పేమెంట్ కోడ్‌ల‌ను, బోర్డుల‌ను ఏర్పరిచే విధంగా చేస్తామ‌ని మంత్రి చెప్పారు.
పైల‌ట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించిన ఈ సౌల‌భ్యాన్ని అంద‌రూ వాడుకోవాల‌ని వీసా భార‌తదేశ వ్య‌వ‌హారాల మేనేజ‌ర్ టీ ఆర్ రామ‌చంద్ర‌న్ చెప్పారు. కార్డుల‌ను ఉప‌యోగించి నేరుగా మెషీన్‌లో చెల్లింపులు చేయ‌వ‌చ్చు. ఈ విధంగా చేయ‌డాన్ని అమ‌లు చేసేందుకు మ‌రిన్ని కంపెనీల‌తో జ‌ట్టుక‌డుతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ప్ర‌స్తుతం తాము చేప‌డుతున్న ప్రాజెక్టుల ద్వారా న‌గ‌ర జ‌నాభాలో 90% జ‌నాభాకు చేరే విధంగా చేస్తున్నామ‌ని అన్నారు. మొద‌ట 18 లక్ష‌ల మందిని చేరే ల‌క్ష్యంతో ఆన్‌లైన్ చెల్లింపుల ప్రోత్సాహానికి వీసా కంపెనీ ముందుకు వెళుతోంది.

Read more about: vizag visakhapatnam digital online
English summary

విశాఖ ప‌ట్నం న‌గ‌దు ర‌హితంగా | Visakhapatnam To Go Almost Fully Cashless In A Year

Aiming to cover 90 per cent of this coastal city's 2 million citizens in a year, the Andhra Pradesh government today launched a campaign to reduce the cash dependence with a cashless payment option campaign.
Story first published: Tuesday, October 10, 2017, 11:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X