For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫోర్బ్స్ జాబితాలో ముకేశ్ 1వ స్థానంలో, అనిల్ అంబానీ 45 వ స్థానంలో

ఈ ఏడాదికి దేశంలో ధ‌న‌వంతుల జాబితాను ఫోర్బ్స్ ప్ర‌క‌టించింది. రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధిప‌తి ముకేశ్ అంబానీ దేశంలో అత్య‌ధిక ధ‌న‌వంతుడిగా నిలిచారు.

|

ఈ ఏడాదికి దేశంలో ధ‌న‌వంతుల జాబితాను ఫోర్బ్స్ ప్ర‌క‌టించింది. రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధిప‌తి ముకేశ్ అంబానీ దేశంలో అత్య‌ధిక ధ‌న‌వంతుడిగా నిలిచారు. ఆయ‌న సంప‌ద 38 బిలియ‌న్ డాల‌ర్లు(రూ.2.5 ల‌క్ష‌ల కోట్లు).మరో వైపు ముకేశ్‌కు ద‌రిదాపుల్లో లేకుండా విప్రో అజిమ్ ప్రేమ్‌జీ 19 బిలియ‌న్ డాల‌ర్ల‌తో రెండో స్థానంలో నిలిచారు. అదే స‌న్‌ఫార్మా దిలీప్ సంఘ్వీ(12.1బిలియ‌న్ డాల‌ర్లు) ఇంత‌కుముందున్న రెండో స్థానం నుంచి 9వ స్థానానికి దిగ‌జారారు. 30 ఏళ్ల లోపు ఫోర్బ్స్ అచీవ‌ర్స్
ప్ర‌ధాన‌మంత్రి మోదీ చేప‌ట్టిన ఆర్థిక దిద్దుబాటు చ‌ర్య‌లు దేశంలో బిలియ‌నీర్ల‌ను ఏమంత ప్ర‌భావితం చేయ‌లేద‌ని ఫోర్బ్స్ ప‌త్రిక చెప్పింది. అయితే ఇదే స‌మ‌యంలో మిగిలిన వాళ్ల క‌న్నా చ‌మురు,స‌హ‌జ వాయువు వ్యాపార దిగ్గ‌జం ముకేశ్ అంబానీ మాత్రం ద‌శాబ్ద కాలం నుంచి అదే స్థానంలో కొన‌సాగుతున్నారు. గ‌తేడాది క‌న్నా ప్రస్తుతం ఉన్న ఆయ‌న సంప‌ద 15.3 బిలియ‌న్ డాల‌ర్లు(67%) పెర‌గ‌డం గ‌మ‌నార్హం. దీంతో ముకేశ్ అంబానీ ఆసియాలో టాప్‌-5 ధ‌న‌వంతుల్లోకి సైతం వెళ్ల‌గ‌లిగారు. ఆయ‌న త‌మ్ముడు అనిల్ అంబానీ మాత్రం 2015లో 29, 2016లో 32 స్థానం నుంచి ఈసారి దిగ‌జారి 45వ స్థానంలో నిలిచారు. గ‌తేడాది 3.4 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద ఉండ‌గా ఈ ఏడాది అది 3.15 బిలియ‌న్ డాల‌ర్ల‌కు త‌గ్గిపోయింది.

 అంబానీ సోద‌రులు-ఫోర్బ్స్ జాబితాలో

హిందూజా సోద‌రులు మాత్రం 18.4 బిలియ‌న్ డాల‌ర్ల‌తో మూడో స్థానంలో, ల‌క్ష్మీ మిట్ట‌ల్ 4వ స్థానంలో(16.5 బిలియ‌న్ డాల‌ర్లు), నిర్మాణ రంగం దిగ్గజం ప‌ల్లోంజీ మిస్త్రీ 16 బిలియ‌న్ డాల‌ర్ల‌తో 5వ స్థానంలో ఉన్నారు. ఇక పతంజ‌లి ఆయుర్వేద్ అధినేత ఆచార్య బాల‌క్రిష్ణ 48వ స్థానంలో నుంచి ఈ సారి దాదాపు స‌గం కంటే ఎక్కువ‌గా మెరుగ‌యి 19వ స్థానాన్ని ద‌క్కించుకున్నారు. ఫోర్బ్స్ ఈ జాబితాను త‌యారుచేసేందుకు వివిధ వ్య‌క్తులు,ఆయా కుటుంబాలు, స్టాక్ ఎక్స్చేంజీలు, విశ్లేష‌కులు, నియంత్ర‌ణ సంస్థ‌ల నుంచి సమాచారాన్ని సేక‌రించిందని వెల్ల‌డించింది.

Read more about: forbes richest
English summary

ఫోర్బ్స్ జాబితాలో ముకేశ్ 1వ స్థానంలో, అనిల్ అంబానీ 45 వ స్థానంలో | Mukesh Ambani emerged the richest for the 10th straight year

Reliance Industries Chief Mukesh Ambani on Thursday emerged as India’s wealthiest for the 10th straight year as his net worth swelled to $38 billion (nearly ₹2.5 lakh crore), while the wealth of the 100 richest rose by 26 per cent despite economic hiccups.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X