For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

30 ఏళ్ల‌లోపు ఫోర్బ్స్ అచీవ‌ర్స్‌

ఫోర్బ్స్ 2017 సంవ‌త్స‌రంలో సూప‌ర్ అచీవ‌ర్స్ జాబితాల భాగంగా 30 ఏళ్ల లోపే స‌రికొత్త‌గా ఆలోచించిన 30 సృజ‌నాత్మ‌క వ్య‌క్తుల జాబితాను రూపొందించింది. వీరంతా త‌మ ఆలోచ‌న‌ల ద్వారా ప్ర‌పంచాన్ని కొత్త దారిలో తీస

|

ఫోర్బ్స్ 2017 సంవ‌త్స‌రంలో సూప‌ర్ అచీవ‌ర్స్ జాబితాల భాగంగా 30 ఏళ్ల లోపే స‌రికొత్త‌గా ఆలోచించిన 30 సృజ‌నాత్మ‌క వ్య‌క్తుల జాబితాను రూపొందించింది. వీరంతా త‌మ ఆలోచ‌న‌ల ద్వారా ప్ర‌పంచాన్ని కొత్త దారిలో తీసుకెళ్లారు. అవెరియా హెల్త్ సొల్యూష‌న్స్ పేరిట 17 ఏళ్ల‌కే వ్యాపారం ప్రారంభించిన యువ‌కుడూ ఇందులో ఉన్నారు. అలాంటి కొంత మంది అచీవ‌ర్స్ జాబితా మీ కోసం...

1. వివేక్ కొప్పార్థి

1. వివేక్ కొప్పార్థి

27 ఏళ్ల వివేక్ కొప్పార్థి నియోలైట్ అనే సంస్థ‌కు స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు. ఈ సంస్థ కామెర్లు వ‌చ్చిన‌ప్పుడు ఉప‌యోగించే ఫోటోథెర‌పీ డివైస్‌ను త‌యారుచేసింది. దీని ప్ర‌త్యేక‌త ఏంటంటే దీని కోసం హాస్పిట‌ల్‌కు వెళ్ల‌కుండా ఇంటిద‌గ్గ‌రే ఉప‌యోగించ‌వచ్చు. అంతే కాకుండా హైపోథెర్మియాకు సంబంధించి మ‌రో ప‌రిక‌రాన్ని తయారుచేసేందుకు సైతం ఇది కృషి చేస్తోంది.

2. ప్రార్థ‌నా దేశాయ్

2. ప్రార్థ‌నా దేశాయ్

ఒక కొత్త ఆవిష్క‌ర‌ణ కోసం 27 ఏళ్ల‌కే ప్రార్థ‌నా దేశాయ్ హార్వ‌ర్డ్ గ్రాడ్యుయేట్ చ‌దువును మ‌ధ్య‌లో ఆపేసింది. అభివృద్ది చెందుతున్న ప్ర‌పంచంలో మెడికేష‌న్ కోసం డ్రోన్లు ఉప‌యోగించే ఘ‌న‌త‌ను సాధించింది. జిప్‌లైన్ కంపెనీలో నిర్వ‌హ‌ణా విధులు చూసుకుంటున్న ఈమె మందుల‌ను వేగ‌వంతంగా అవ‌స‌ర‌మైన చోట‌కు చేర్చే దానిలో నిమగ్న‌మైంది. డ్రోన్ల సాయంతో మెడిసిన్ల‌ను డెలివ‌రీ చేస్తోంది.

3. షౌన్ ప‌టేల్

3. షౌన్ ప‌టేల్

హార్వ‌ర్డ్ మెడిక‌ల్ స్కూల్‌లో షౌన్ ప‌టేల్ ఆర్ధోపెడిక్ స‌ర్జ‌రీ విభాగంలో చీఫ్ రెసిడెంట్‌గా ప‌నిచేస్తున్నారు. వివిధ స‌ర్జరీ జ‌ర్న‌ళ్ల‌లో డ‌జ‌న్ల కొద్దీ శాస్త్రీయ ర‌చ‌న‌లు చేశారు. ఆర్థోనింజా అనే యాప్ ఈయ‌న ఆలోచ‌న నుంచే పుట్టింది. దీని ద్వారా డాక్ట‌ర్లు ఒక‌రికొక‌రు సంప్ర‌దించుకోవ‌డం మొబైల్‌లోనే సులువుగా జ‌రిగేందుకు వీల‌వుతుంది.

4.రోహ‌న్ సూరీ

4.రోహ‌న్ సూరీ

17 ఏళ్ల‌ రోహ‌న్ సూరీ అవెరియా హెల్త్ సొల్యూష‌న్స్ వ్య‌వ‌స్థాప‌కుడు. అత‌డు వైద్య ప‌రీక్ష‌లు త‌క్కువ కాలంలో ప్ర‌భావ‌వంతంగా జ‌రిగేలా త‌న సంస్థ‌లో సాంకేతిక‌త‌ను అభివృద్దిప‌రిచాడు.

5. వ‌రుణ్ శివ‌రామ్

5. వ‌రుణ్ శివ‌రామ్

విదేశీ సంబంధాల మండ‌లి అనేది అంత‌ర్జాతీయంగా ఎన్నో ప‌ర్యావ‌ర‌ణ అంశాల‌కు సంబంధించి కృషి చేస్తోంది. 27 ఏళ్ల వ‌రుణ్ శివ‌రామ్ ఆ సంస్థ‌లో ఇంధ‌న భ‌ద్ర‌త‌, ప‌ర్యావ‌ర‌ణ మార్పుల విభాగానికి సంబంధించి డైరెక్ట‌రుగా ప‌నిచేస్తున్నారు. ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో పీహెచ్‌డీ పూర్తిచేసిన శివ‌రామ్, స్టాన్‌ఫోర్డ్ ఎన‌ర్జీ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్లో అడ్వైజ‌రీ బోర్డులో ఉన్నారు. జార్జ్ టౌన్ యూనివ‌ర్సిటీలో క్లీన్ ఎనర్జీ ఇన్నొవేష‌న్ అనే అంశంపై ప్ర‌త్యేకంగా త‌ర‌గతులు చెబుతుంటారు. ఇంత‌కుముందు హిల్లరీ క్లింట‌న్ ప్ర‌చారంలో ఎన‌ర్జీ పాల‌సీకి స‌ల‌హాదారుడిగా ప‌నిచేశారు.

6. నేహా గుప్తా

6. నేహా గుప్తా

యాపిల్ సంస్థ‌కు అవ‌స‌ర‌మైన కొన్ని విడిభాగాల‌ను త‌యారుచేసే సంస్థ‌(DAQRI)లో నేహా గుప్తా సేల్స్ హెడ్‌గా ఉంది. అక్క‌డ త‌యారీ నుంచి స‌ప్లై చైన్ వంటివ‌న్నీ ఆమె ఆధ్వ‌ర్యంలో న‌డుస్తాయి. దీంతో ఆగ్మెంటెడ్ రియాల్టీ హెడ్‌సెట్ల‌ను తీసుకువ‌చ్చే దానిలో స‌ఫ‌లీకృతుల‌య్యారు. ఇవి పరిశ్ర‌మ‌ల్లో కార్మికుల‌కు భ‌ద్ర‌త‌ను చేకూర్చ‌డంలో వారి ప‌నిత‌నం పెంచ‌డంలో తోడ్ప‌డ్డాయి.

7. ఆదిత్య అగ‌ర్వాల్లా

7. ఆదిత్య అగ‌ర్వాల్లా

సామాజిక వ్యాపార‌వేత్త‌లో ఇత‌డు చోటు సాధించాడు. 23 ఏళ్ల ఆదిత్య కిసాన్ నెట్‌వ‌ర్క్ అనే సంస్థ‌కు స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు. కిసాన్ నెట్‌వ‌ర్క్ కోసం ప్రిన్స్‌ట‌న్ యూనివ‌ర్సిటీలో చ‌దువును వ‌దిలేసుకుని వ‌చ్చాడు. ఈ సంస్థ చిన్న స్థాయి రైతుల‌కు ఆన్‌లైన్ మార్కెట్ స‌దుపాయాల క‌ల్ప‌న‌లో ఉప‌యోగ‌ప‌డుతుంది.

8.అక్ష‌య్ ఖ‌న్నా

8.అక్ష‌య్ ఖ‌న్నా

క్రీడా విభాగంలో 29 ఏళ్ల అక్ష‌య్ ఖ‌న్నా ఫోర్బ్స్‌లో చోటు సంపాదించాడు. అమెరిక‌న్ ఫుట్ బాల్ జ‌ట్టు ఫిల‌డెల్పియా 76ersకు వ్యూహాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో వైస్‌ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

9. అన‌ర్ఘ్య వ‌ర్ధ‌న‌

9. అన‌ర్ఘ్య వ‌ర్ధ‌న‌

వెంచ‌ర్ క్యాపిట‌లిస్ట్లో పురుషుల ఆధిపత్యాన్ని కాద‌ని అందులోకి ఈమె అడుగుపెట్టారు. మొద‌ట ఏడాది కాలం పాటు రోథెన్‌బ‌ర్గ్ వెంర్స్‌లో ప‌నిచేసిన త‌ర్వాత మావెర‌న్ అనే వెంచ‌ర్ క్యాపిట‌లిస్ట్ సంస్థ‌లో అడుగుపెట్టి కీల‌క స్థానంలో ఉన్నారు. అక్క‌డ వ‌ర్చువ‌ల్ రియాల్టీకి సంబంధించి ప్ర‌త్యేక ప్రోత్సాహ‌క విభాగాన్ని ప్రారంభించారు. త‌ద్వారా 12 స్టార్ట‌ప్‌ల‌కు నిధులివ్వ‌డం మొద‌లుపెట్టి వ‌ర్చువ‌ల్ రియాల్టీ స్పేస్లో నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు తావిచ్చారు.

10.అక్ష‌య్ గోయ‌ల్(28)

10.అక్ష‌య్ గోయ‌ల్(28)

స్టార్‌వుడ్ క్యాపిట‌ల్ సంస్థ‌కు అక్ష‌య్ గోయెల్ వైస్ ప్రెసిడెంట్‌. 26 ఏళ్ల‌కు ప్ర‌మోష‌న్ సాధించిన అక్ష‌య్ సంస్థ చ‌రిత్ర‌లోనే అతిచిన్న వ‌య‌సులో వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. గోయెల్ హోట‌ళ్ల స్వాధీనంలో దృష్టిపెట్టాడు. త‌ద్వారా 7 బిలియ‌న్ డాల‌ర్ల స‌మాన‌మైన ఒప్పందాలు పూర్తిచేశాడు. ఇటీవ‌లే అమెరికాలో 240 హోట‌ళ్ల‌ను 2 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చైనా లైఫ్‌కు అమ్మ‌డంలో స‌ఫ‌లీకృతుడ‌య్యాడు.

11. అజయ్ యాద‌వ్

11. అజయ్ యాద‌వ్

క‌న్సూమ‌ర్ టెక్నాల‌జీలో 29 ఏళ్ల అజ‌య్ యాద‌వ్ చోటు ద‌క్కించుకున్నారు. రూమీ అనే స్టార్ట‌ప్ యాప్ ఆధారిత సంస్థ‌ను స్థాపించారు. అద్దె గ‌దుల‌కు సంబంధించి రూమ్ మేట్‌ను వెదుక్కొనేందుకు ఈ యాప్ సాయ‌ప‌డుతుంది. ఆన్‌లైన్‌లోనే గ‌దుల‌ను చూపించ‌డం, తాత్కాలిక నివాసం కోసం వెతుక్కునే వారు ఒక‌రితో ఒక‌రు చాట్ చేసుకునేలా చేయ‌డం, అపార్ట్‌మెంట్ వెదుకులాట‌, అద్దె చెల్లింపు వంటి ప‌నుల‌ను ఈ యాప్ నుంచే పూర్తిచేయ‌వ‌చ్చు. న్యూయార్క్ కేంద్రంగా ప‌నిచేస్తున్న ఈ యాప్ ఇప్ప‌టిదాకా 7 మిలియ‌న్ డాల‌ర్ల‌ను సేక‌రించింది.

Read more about: forbes startup
English summary

30 ఏళ్ల‌లోపు ఫోర్బ్స్ అచీవ‌ర్స్‌ | Forbes 2017 class of 30 under 30 these are the achievers

There are 20 categories with 30 honorees. The categories are Art & Style, Consumer Tech, Education, Energy, Enterprise Tech, Finance, Food & Drink, Games, Healthcare, Hollywood & Entertainment, Law & Policy, Manufacturing & Industry, Marketing & Advertising, Media, Music, Retail & E-commerce, Science, Social Entrepreneurs, Sports and Venture Capital.
Story first published: Monday, September 11, 2017, 11:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X