For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

5 నెల‌ల గ‌రిష్టానికి ఆగ‌స్టు ద్ర‌వ్యోల్బ‌ణం

అధిక ఆహార ధ‌ర‌ల‌తో ఆగ‌స్ట్ నెల రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం 5 నెల‌ల గ‌రిష్టానికి వెళ్ల‌నుంద‌ని రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ పోల్ వెల్ల‌డించింది. దీంతో కేంద్ర బ్యాంక్ మీద ఒత్తిడి త‌గ్గి వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించొచ

|

అధిక ఆహార ధ‌ర‌ల‌తో ఆగ‌స్ట్ నెల రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం 5 నెల‌ల గ‌రిష్టానికి వెళ్ల‌నుంద‌ని రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ పోల్ వెల్ల‌డించింది. దీంతో కేంద్ర బ్యాంక్ మీద ఒత్తిడి త‌గ్గి వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించొచ్చ‌ని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జులై నెల‌లో 2.36%, గ‌తేడాది ఆగ‌స్టులో ఉన్న దాని కంటే ప్ర‌స్తుతం ఆగ‌స్టు నెల‌ల వినియోగ‌దారు ధ‌ర‌లు 3.20%గా ఉన్నాయ‌ని ఇవి పెరుగుద‌ల‌ను న‌మోదు చేశాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. సెప్టెంబ‌రు 5 నుంచి 8 మ‌ధ్య 40 మంది ఆర్థిక‌వేత్త‌ల‌ను అడిగి తెలుసుకున్న స‌మాచారం ఆధారంగా ఈ లెక్క‌లు వేశారు.

ఆగ‌స్టు ద్ర‌వ్యోల్బ‌ణం

అయితే ప్ర‌భుత్వం అధికారికంగా విడుద‌ల చేయ‌బోతున్న లెక్క‌ల‌తో ఈ ద్ర‌వ్యోల్బ‌ణ శాతం దాదాపుగా స‌మానంగా ఉన్న‌ప్పటికీ, అయితే ఆర్బీఐ ల‌క్ష్యంగా నిర్దేశించుకున్న 4% కంటే ఇది ఎక్కువే కాగ‌ల‌దు. వినియోగ‌దారు వ‌స్తువుల్లో దాదాపు 50% ఉండే ఫుడ్‌, బేవ‌రేజెస్ వంటి ధ‌ర‌లు పెరిగితే అది మొత్తం వాటిపై ప్రభావం ప‌డి ఆగ‌స్టు రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం అంత‌కు ముందు 3 నెల‌ల‌తో పోలిస్తే ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంది. అంతే కాకుండా ఈ ఏడాది వ‌ర్షాకాలంలో ప‌డిన అధిక వ‌ర్షాల కార‌ణంగా కొన్ని చోట్ల పంట‌లు దెబ్బ‌తిని పాడ‌యిపోయే ఆహార వ‌స్తువుల మీద ప్ర‌తికూల ప్ర‌భావంతో పాటు, వ‌స్తు స‌ర‌ఫ‌రాకు ఆటంకం క‌ల‌గ‌డం సైతం ఆందోళ‌న క‌లిగించే అంశంగా ఉంది.

Read more about: inflation reuters food
English summary

5 నెల‌ల గ‌రిష్టానికి ఆగ‌స్టు ద్ర‌వ్యోల్బ‌ణం | august retail inflation will be of 5 months high

Retail inflation is expected to have picked up to a five-month high in August, largely driven by higher food costs, a Reuters poll showed, easing pressure on the central bank to cut interest rates again after poor growth data.
Story first published: Monday, September 11, 2017, 17:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X