For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెప్టెంబ‌రు 6 నుంచే 169 మెక్‌డొనాల్డ్ స్టోర్ల మూసివేత‌

|

ఈ మ‌ధ్య కొన్ని రోజుల నుంచి మెక్ డొనాల్డ్ స్టోర్ల వివాదం న‌డుస్తోంది. మామూలుగా ఇలాంటి పెద్ద పెద్ద సంస్థ‌లు నెల‌వారీ కొంత డ‌బ్బు తీసుకుని వేరేవరో త‌మ పేరు మీద ఆయా స్టోర్ల‌ను న‌డిపేందుకు అనుమ‌తిస్తాయి. దేశంలోని చాలా ప్ర‌దేశాల్లో సీపీఆర్ఎల్ సంస్థ‌కు ఈ విధంగా అనుమ‌తి ఇచ్చింది. ఇటీవ‌ల సెప్టెంబ‌రు 6 నుంచి ఆ సంస్థ‌తో ఒప్పందం ర‌ద్దు చేసుకుని, అప్ప‌టి నుంచి 169 స్టోర్ల‌ను న‌డుపుకునేందుకు వీల్లేద‌ని మెక్‌డొనాల్డ్ స్ప‌ష్టం చేసింది. దీనికి సంబంధించి మ‌రిన్ని ముఖ్య విష‌యాలు లేదా ప‌రిణామాలు...

1. 169 స్టోర్లు మూత‌ప‌డ‌తాయా?

1. 169 స్టోర్లు మూత‌ప‌డ‌తాయా?

క‌న్నాట్ ప్లాజా రెస్టారెంట్ లిమిటెడ్‌(సీపీఆర్‌ఎల్)తో త‌మ అనుబంధాన్ని తెంచుకుని త‌మ మెక్‌డీ బ్రాండ్ పేరును ఇక‌పై ఉప‌యోగించ‌కూడ‌ద‌ని మెక్‌డొనాల్డ్ ఇదివ‌ర‌కే ఆ కంపెనీకి స‌మాచారం అందించింది. దీంతో బ‌ర్గ‌ర్‌, ఫ్రైలు త‌యారుచేసి అమ్ముకునే 169 స్టోర్లు మూత‌ప‌డాల్సి వ‌స్తోంది. ఇవి ఎక్కువ‌గా ఉత్త‌ర భార‌త‌దేశం, తూర్పు భార‌త‌దేశం ప్రాంతంలో ఉన్నాయి.

 2. మెక్‌డొనాల్డ్ చెప్పింది అయితే ఇదే...

2. మెక్‌డొనాల్డ్ చెప్పింది అయితే ఇదే...

ఎక‌న‌మిక్ టైమ్స్ అడిగిన ప్ర‌శ్న‌కు మెక్డొనాల్డ్ భార‌త అధికార ప్ర‌తినిధి ఈ విధంగా స్పందించారు. సెప్టెంబ‌రు 5తో వారికి ఇచ్చిన నోటీసు పీరియ‌డ్ ముగిసింది. కాబ‌ట్టి మెక్‌డొనాల్డ్ వ్య‌వ‌స్థ‌ను కానీ, దాని పేరు లేదా బ్రాండ్‌ను కానీ సీపీఆర్ఎల్ వాడుకోవ‌డానికి లేదు. అంతే కాకుండా ట్రేడ్‌మార్క్‌లు, కంపెనీ డిజైన్లు, నిర్వ‌హ‌ణ‌, మార్కెటింగ్ విధానాలు, ఆహారం కొన్ని ప్ర‌త్యేక‌మైన ప‌ద్ద‌తుల‌ను ఇక‌పై ముగించాలి. న్యాయ‌, ఒప్పంద హ‌క్కుల‌కు సంబంధించి విధి విధానాల‌తో ముందుకెళుతున్న‌ట్లు ప్ర‌తినిధి వెల్ల‌డించారు.

3. సీపీఆర్ఎల్ కంపెనీ లా ట్రిబ్యున‌ల్‌ను ఆశ్ర‌యించ‌గా

3. సీపీఆర్ఎల్ కంపెనీ లా ట్రిబ్యున‌ల్‌ను ఆశ్ర‌యించ‌గా

సీపీఆర్‌ఎల్ అనేది ఉమ్మ‌డి భాగ‌స్వామ్యంతో ఏర్ప‌రిచిన సంస్థ‌. ఇందులో మెక్‌డొనాల్డ్‌కు, విక్ర‌మ్ బ‌క్షికి స‌మాన వాటాలు ఉన్నాయి. అయితే వివాదం న‌డుస్తుండ‌టంతో విక్ర‌మ్ బ‌క్షి కంపెనీ లాట్రిబ్యున‌ల్‌ను ఆశ్ర‌యించారు. అయితే మంగ‌ళ‌వారం సీపీఆర్ఎల్ ఎండీ విక్ర‌మ్ బ‌క్షి వేసిన పిటీష‌న్‌ను ట్రైబ్యున‌ల్ తోసిపుచ్చింది. దాంతో ఫ్రాంచైజీ ఒప్పందం ర‌ద్ద‌యిన‌ట్లైంది.

 4. ప్ర‌త్యక్ష‌, ప‌రోక్ష ఉపాధిపై స్టోర్ల మూసివేత ప్ర‌భావం

4. ప్ర‌త్యక్ష‌, ప‌రోక్ష ఉపాధిపై స్టోర్ల మూసివేత ప్ర‌భావం

లా ట్రైబ్యున‌ల్‌ను ఆశ్ర‌యించే ముందు ఈటీ(ఎక‌న‌మిక్ టైమ్స్‌) బ‌క్షిని స్పందించాల్సిందిగా కోరింది. అయితే స్టోర్ల మూసివేత‌కు సంబంధించి క‌చ్చితంగా ఏ స‌మాధాన చెప్ప‌లేదు. అయితే స్టోర్ల‌ను మూసివేస్తే చాలా ఉద్యోగాలు, వ్యాపారాల‌పై ప్ర‌భావముంటుంద‌ని అన్నారు. ప్ర‌త్యక్షంగా, ప‌రోక్షంగా 10 వేల మంది భార‌తీయుల‌పై కంపెనీ మూసివేత ప్ర‌భావం ఉంటుంద‌ని అన్నారు. ఆ వేల మందిలో స‌ర‌ఫ‌రాదారులు, బిజినెస్ అసోసియేట్లు సైతం ఉంటారు.

5. ఆగ‌స్టు 21 నుంచి

5. ఆగ‌స్టు 21 నుంచి

గ‌త కొన్నేళ్లుగా విక్ర‌మ్‌బ‌క్షి, మెక్ డొనాల్డ్ ఉమ్మ‌డిగా ఉమ్మ‌డి వెంచ‌ర్ నెలకొల్పి ఉత్త‌ర‌, ఈశాన్య భార‌తాల్లో స్టోర్ల‌ను న‌డుపుతున్నారు. ఆగ‌స్టు 21న అమెరికా సంస్థ సీపీఆర్ఎల్ ఒప్పందాన్ని ర‌ద్దు చేసుకునే ప్ర‌క్రియ‌ను ప్రారంభించింది. 15 రోజుల్లోగా త‌మ సంస్థ బ్రాండ్ పేరును వాడుకోవ‌ద్ద‌ని కోరింది.

6. స్టోర్ స్థ‌ల య‌జమానులు ఇలా...

6. స్టోర్ స్థ‌ల య‌జమానులు ఇలా...

స్టోర్ స్థ‌లం ఇచ్చిన య‌జ‌మానుల వ్య‌వ‌హారం మ‌రోలా ఉంది. మెక్‌డొనాల్డ్ స్టోర్ల‌ను సీపీఆర్ఎల్ ఎక్క‌డైతే నెలకొల్పిందో అక్క‌డ స్థిరాస్తి సంస్థ‌లు స్పందిస్తున్నాయి. డీఎల్ఎఫ్‌తో స‌హా స్థ‌ల య‌జ‌మానులు త‌మ త‌మ స్టోర్ల‌ను ఖాళీ చేసి స్థ‌లాన్ని అప్ప‌గించాల్సిందిగా కోరుతున్నాయి. అంతే కాకుండా కొత్త అద్దెదార్ల కోసం చూస్తున్న‌ట్లు చెప్పాయి. మెక్ డొనాల్డ్ బ్రాండ్ పేరు అక్క‌డ ఉప‌యోగించుకునేందుకు వీల్లేక‌పోతే తాము కొత్త వారి కోసం వెత‌కాల్సిందేన‌ని డీఎల్ఎఫ్ సీనియ‌ర్ అధికారి ఒక‌రు చెప్పారు.

7. ఎవ‌రిపై ప్ర‌భావం

7. ఎవ‌రిపై ప్ర‌భావం

169 స్టోర్ల‌లో అన్ని బ‌క్షి సొంత సంస్థ‌లుగా న‌డ‌వ‌డం లేదు. వివిధ సొంత దార్లు లీజుకు తీసుకుని న‌డుపుతున్నారు. స్థానిక అధికారుల నుంచి ఆహార ప‌దార్థాల‌కు సంబంధించి దుకాణ అనుమ‌తులు రెన్యువ‌ల్ కాక వీటిల్లో గ‌త రెండు నెలల్లో 43 మూత ప‌డ్డాయి. చాలా మంది స‌ర‌ఫ‌రాదారులు అయోమయంలో ప‌డ్డారు. 7వేల మంది ఉద్యోగులు, విస్తా ప్రాసెస్డ్ ఫుడ్స్‌, స్క్రైబ‌ర్ డైన‌మిక్స్ డైరీస్, వివిధ స్టోర్ల య‌జమానులు వంటి వారిపై స్టోర్ల మూసివేత ప్ర‌భావం ఉంటుంది.

 8. నేష‌న‌ల్ కంపెనీ లా ట్రిబ్యున‌ల్‌

8. నేష‌న‌ల్ కంపెనీ లా ట్రిబ్యున‌ల్‌

బ‌క్షి ఆ ఒప్పందం ర‌ద్దుకు సంబంధించి నేష‌న‌ల్ కంపెనీ లా ట్రిబ్యున‌ల్ వ‌ద్ద సాంత్వ‌న కోర‌గా అది ఆయ‌న‌కు వ్య‌తిరేకంగానే తీర్పిచ్చింది. అంతే కాకుండా అదే స‌మ‌యంలో అంత‌ర్జాతీయ స్టోర్ రెస్టారెంట్ చెయిన్ మెక్‌డొనాల్డ్ సంస్థ‌కు సైతం షోకాజ్ నోటీసిచ్చింది. ఫ్రాంచైజీ ఒప్పందంలో రాసుకున్న నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించ‌డం వ‌ల్లే ఒప్పంద ర‌ద్దుకు ముందుకు సాగిన‌ట్లు అంత‌ర్జాతీయ సంస్థ మెక్‌డీ వాదిస్తోంది.

Read more about: mcdonald companies nclt business
English summary

Fate of McDonald stores Thousands may loose jobs

The potential closure impacts the quick service restaurant industry’s largest brand, its over 7,000 employees, suppliers such as Vista Processed Foods and Schreiber Dynamix Dairies, besides multiple store owners.
Story first published: Wednesday, September 6, 2017, 12:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X