For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆగ‌స్టులో వాహ‌న అమ్మ‌కాలు బాగు

మారుతి సుజుకితో పాటు ప‌లు వాహ‌న కంపెనీల‌కు చెందిన ప్యాసెంజర్ వాహ‌నాల అమ్మ‌కాలు ఆగ‌స్ట్ నెల‌లో బాగా జ‌రిగాయి. ఇంకా పండుగ సీజ‌న్‌కు మునుపే ఇలా జ‌ర‌గ‌డం వాహ‌న త‌యారీదారుల‌కు ఆశాజ‌న‌క‌మైన విష‌యం. ఫోర్డ్‌,

|

మారుతి సుజుకితో పాటు ప‌లు వాహ‌న కంపెనీల‌కు చెందిన ప్యాసెంజర్ వాహ‌నాల అమ్మ‌కాలు ఆగ‌స్ట్ నెల‌లో బాగా జ‌రిగాయి. ఇంకా పండుగ సీజ‌న్‌కు మునుపే ఇలా జ‌ర‌గ‌డం వాహ‌న త‌యారీదారుల‌కు ఆశాజ‌న‌క‌మైన విష‌యం. ఫోర్డ్‌, ట‌యోటా త‌ప్ప మిగిలిన అన్నింటిలోనూ వృద్ది ఉంది. హుందాయ్ మోటార్స్ ఇండియా, టాటా మోటార్స్‌, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా, హోండా కంపెనీల అమ్మ‌కాలు గ‌తేడాది ఆగ‌స్టు నెల‌తో పోలిస్తే ఈ సారి బాగా పెరిగాయి. 26.7% పెరుగుద‌ల‌తో మారుతి సుజ‌కి 1,52,000 యూనిట్లను అమ్మ‌గ‌లిగింది. ఇది ముఖ్యంగా కాంపాక్ట్ విభాగంలో స్విఫ్ట్‌, ఎస్టిలో, డిజైర్ ,బాలెనో మోడ‌ళ్ల‌లో 62.4% వృద్ది వ‌ల్లే సాధ్య‌మైంది. గ‌తేడాది ఆగ‌స్ట్ నెల‌లో ఈ కంపెనీ అమ్మ‌కాలు 45,579 ఉంటే ఈ ఏడాది 74,012 యూనిట్ల వ‌ర‌కూ పుంజుకున్నాయి.

ఆగ‌స్ట్ వాహ‌న అమ్మ‌కాల్లో మంచి వృద్ది

మ‌రో వైపు యుటిలిటీ వాహ‌నాలైన జిప్సీ ,ఎర్టిగా, ఎస్‌-క్రాస్, కాంపాక్ట్ ఎస్‌యూవీ వితారా బ్రిజా 2016 ఆగ‌స్టు నెల అమ్మ‌కాలు 16,806 యూనిట్లు ఉంటే ఈసారి 27.6% వృద్దితో 21,442 యూనిట్లుగా ఉన్నాయి. అయితే మినీ విభాగంలో(ఆల్టో,వాగానార్‌) ఆగ‌స్టు 2016తో పోలిస్తే క్షీణ‌త క‌నిపించింది. అప్ప‌ట్లో అమ్మ‌కాలు 35,490 ఉంటే ఈసారి త‌గ్గుద‌ల సంభ‌వించి 35,428గా ఉన్న‌ట్లు మారుతి సుజుకి ఇండియా వెల్ల‌డించింది.
ప్ర‌ధాన పోటీదారు హ్యుందాయ్ మోటార్ ఇండియా సైతం దేశీయ వాహ‌న అమ్మ‌కాలు(9% వృద్దితో) 47,103గా న‌మోదు చేసింది. ఏడాది క్రితం ఆగ‌స్టు నెల అమ్మ‌కాలు 43,201గా ఉన్నాయి. కొత్త‌గా మార్కెట్లోకి ప్ర‌వేశ‌పెట్టిన వెర్నామోడ‌ల్‌కు 10 రోజుల్లోనే 7వేల బుకింగ్‌లు రావ‌డం ఆగ‌స్ట్ నెల అమ్మ‌కాలు పెరిగేందుకు దోహ‌ద‌పడింద‌న హుందాయ్ ఇండియా డైరెక్ట‌ర్(సేల్స్‌,మార్కెటింగ్) రాకేశ్ శ్రీ‌వాత్స‌వ చెప్పారు. మ‌రో దేశీయ కంపెనీ మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా ఆగ‌స్ట్ 2016 అమ్మ‌కాలు 36,944 నుంచి 7% వృద్దితో 39,534 యూనిట్ల అమ్మ‌కాల‌ను చేప‌ట్టింది. మ‌రో కంపెనీ టాటా మోటార్స్ పాసెంజ‌ర్ అమ్మ‌కాల దేశీయ మార్కెట్ వృద్ది 10.29% గా ఉంది.

Read more about: vehicles cars
English summary

ఆగ‌స్టులో వాహ‌న అమ్మ‌కాలు బాగు | Automobiles show robust sales in consumer segment

Automobile manufacturers led by Maruti Suzuki posted robust passenger vehicles (PV) sales growth in August riding on strong consumer sentiment ahead of the festive season.
Story first published: Saturday, September 2, 2017, 13:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X