For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్థిరాస్తి రంగంపై రెండు రోజుల జాతీయ స‌ద‌స్సు

ఈనెల 28, 29 తేదీల్లో దిల్లీలో నారెడ్కో 14వ జాతీయ సదస్సు జరుగుతున్న సందర్భంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో రేరా చట్టం నోటిఫై అయిందని.. 15 రోజుల్లో అథారిటీ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించే వీలుందని

|

ఆగ‌స్టు 28 నుంచి ఢిల్లీలో రెండు రోజుల పాటు జాతీయ స్థిరాస్తి అభివృద్ది మండ‌లి స‌మావేశం జ‌ర‌గ‌నుంది. దీనికి సంబంధించి వివ‌రాల‌ను వెల్ల‌డిస్తూ "వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ), స్థిరాస్తి (నియంత్రణ అండ్‌ అభివృద్ధి) చట్టం 2016 వంటి పరిణామాలు స్థిరాస్తి రంగానికి కొత్త వూపును ఇవ్వనున్నా"యని జాతీయ స్థిరాస్తి అభివృద్ధి మండలి (నారెడ్కో) దక్షిణ ప్రాంత ఉపాధ్యక్షుడు ఆర్‌. చలపతిరావు తెలిపారు.

 ఢిల్లీలో రెండు రోజుల పాటు జాతీయ స్థిరాస్తి అభివృద్ది మండ‌లి స‌మావేశం

జీఎస్‌టీ అమలు నేపథ్యంలో 12 శాతం పన్ను విధింపు, దానిపై వచ్చే ఇన్‌పుట్‌ క్రెడిట్‌పై స్పష్టత లభించిందని నారెడ్కో ఆంధ్రప్రదేశ్‌ చాప్టర్‌ అధ్యక్షుడు జి.హరి బాబు, తెలంగాణ స్థిరాస్తి డెవలపర్ల సంఘం (ట్రెడా) అధ్యక్షుడు రవీంద్రరావు పేర్కొన్నారు. ఈనెల 28, 29 తేదీల్లో దిల్లీలో నారెడ్కో 14వ జాతీయ సదస్సు జరుగుతున్న సందర్భంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో రేరా చట్టం నోటిఫై అయిందని.. 15 రోజుల్లో అథారిటీ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించే వీలుందని హరి బాబు చెప్పారు. లే అవుట్లు, కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి 10 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, అమరావతి పరిధిలో స్థిరాస్తి కార్యకలాపాలు పుంజుకునే వీలుందన్నారు. జాతీయ స్థాయి స‌మావేశం సంద‌ర్భంగా కొత్త స్థిరాస్తి ప్రాజెక్టులు, ఉత్ప‌త్తులు, వివిధ వ‌స్తువులు వంటివి ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచ‌నున్నారు.

English summary

స్థిరాస్తి రంగంపై రెండు రోజుల జాతీయ స‌ద‌స్సు | Naredco convention from August 28

National real estate development council is organizing a two day national convention in New Delhi from august 28
Story first published: Saturday, August 19, 2017, 16:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X