For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర ప్ర‌తి నెలా రూ.4 పెంపు

వంట గ్యాస్‌పై ప్ర‌భుత్వం మోస్తున్న భారాన్ని త‌గ్గించుకునేందుకు కేంద్రం దాన్ని సామాన్య‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌పై మోప‌నుంది. వ‌చ్చే ఏడాది మార్చిలోగా స‌బ్సిడీల భారాన్ని త‌ప్పించుకునేందుకు ప్ర‌తి నెలా ర

|

వంట గ్యాస్‌పై ప్ర‌భుత్వం మోస్తున్న భారాన్ని త‌గ్గించుకునేందుకు కేంద్రం దాన్ని సామాన్య‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌పై మోప‌నుంది. వ‌చ్చే ఏడాది మార్చిలోగా స‌బ్సిడీల భారాన్ని త‌ప్పించుకునేందుకు ప్ర‌తి నెలా రూ.4 మేర గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర పెంచాల్సిందిగా కేంద్రం ప్ర‌భుత్వ రంగ చ‌మురు సంస్థ‌ల‌ను ఆదేశించింది. ఇదివ‌ర‌కే ప్ర‌భుత్వం ఐవోసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్ సంస్థ‌ల‌ను 14.2 కేజీల సిలిండ‌ర్ ధ‌ర‌ల‌ను నెల‌కోసారి రూ.2 పెంచాల్సిందిగా చెప్పిన సంగ‌తి తెలిసిందే.

గ్యాస్ స‌బ్సిడీ ఎత్తివేత‌

అయితే మార్కెట్ ధ‌ర‌ను, వినియోగ‌దారులు చెల్లించే ధ‌ర‌ను వేగంగా స‌మానం చేసే దిశ‌గా కేంద్రం కొత్త నిర్ణ‌యం తీసుకుంది. ఇంత‌కుముందు నెల‌కు రూ.2 పెంచే దాన్ని ఇప్పుడు రూ.4 చేశారు. లోక్‌స‌భ‌లో ఒక ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చ‌మురు, స‌హ‌జ వాయు శాఖా మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ ఈ విష‌యాల‌ను వెల్ల‌డించారు. వ‌చ్చే ఏడాది మార్చి నాటికి వంట గ్యాస్ స‌బ్సిడీని పూర్తిగా తొల‌గించాల‌ని భావిస్తున్న‌ట్లు ధర్మేంద్ర ఫ్ర‌ధాన్ చెప్పారు.

Read more about: gas lpg
English summary

గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర ప్ర‌తి నెలా రూ.4 పెంపు | gas cylinder price to be hiked by 4 rupees every month

The government has ordered state-run oil companies to raise subsidised cooking gas (LPG) prices by Rs. 4 per cylinder every month to eliminate all the subsidies by March next year, Oil Minister Dharmendra Pradhan said today.
Story first published: Tuesday, August 1, 2017, 10:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X