For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏటీఎమ్ విత్‌డ్రాయ‌ల్స్‌లో మోసం: 10 ల‌క్ష‌ల డ‌బ్బు హుష్ కాకి

బెంగుళూరులో దాదాపు 200కి పైగా ప్ర‌జ‌లు త‌మ ప్ర‌మేయం లేని విత్‌డ్రాయ‌ల్స్ కార‌ణంగా రూ.10 ల‌క్ష‌ల డ‌బ్బును కోల్పోయారంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసుకోవ‌చ్చు. బెంగుళూరు ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి మ‌రిన

|

ప్ర‌భుత్వం పార‌ద‌ర్శ‌క‌త‌ను పెంచేందుకు, అవినీతిని త‌గ్గించేందుకు డిజిట‌ల్ లావాదేవీల‌ను ప్రోత్స‌హిస్తోంది. అయితే డిజిట‌ల్ లావాదేవీల్లో భ‌ద్ర‌త గురించి ఎవరూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇంట్లో డ‌బ్బులు పెట్టుకుంటే భ‌ద్ర‌త లేద‌ని బ్యాంకు, ఏటీఎమ్‌ల‌లో డ‌బ్బు దాచుకున్నా ప్ర‌యోజ‌నం ఉండ‌టం లేదు. బెంగుళూరులో దాదాపు 200కి పైగా ప్ర‌జ‌లు త‌మ ప్ర‌మేయం లేని విత్‌డ్రాయ‌ల్స్ కార‌ణంగా రూ.10 ల‌క్ష‌ల డ‌బ్బును కోల్పోయారంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసుకోవ‌చ్చు. బెంగుళూరు ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు...

రూ.30 వేలు డ్రా చేయ‌క‌పోయినా, చేసిన‌ట్లుగా

రూ.30 వేలు డ్రా చేయ‌క‌పోయినా, చేసిన‌ట్లుగా

పోలీసులు తెలిపిన దాని ప్ర‌కారం దాదాపు 200 మంది బెంగుళూరు వాసులు అక్ర‌మ విత్‌డ్రాయ‌ల్స్ కార‌ణంగా రూ.10 ల‌క్షల డ‌బ్బును త‌మ ప్ర‌మేయం లేకుండానే కోల్పోయారు. టైమ్స్ ఆఫ్ ఇండియా క‌థ‌నం ప్ర‌కారం అడ్వ‌ర్టైజింగ్ ప్రొఫెష‌న‌ల్ ర‌జిత్ ర‌వి ఫోన్‌కు సోమ‌వారం రాత్రి ఒక మెసేజ్ వ‌చ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ నుంచి రాత్రి 11.53గంట‌ల‌కు రూ.30 వేలు డ్రా చేసిన‌ట్లు దాని సారాంశం. విచిత్ర‌మేమిటంటే ఆ స‌మ‌యంలో అత‌ని డెబిట్ కార్డు వాలెట్లో ఉంది. అత‌డు మాత్రం తన ఏటీఎమ్, పిన్ లేకుండా డ‌బ్బు ఎలా తీశార‌ని ఆశ్చ‌ర్య‌పోతున్నాడు. దాంతో మంగ‌ళ‌వారం వెంట‌నే సైబ‌ర్ క్రైమ్ పోలీసుల వ‌ద్ద‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

మ‌రో ఘ‌ట‌న‌: బీటీఎమ్ లేఅవుట్‌లో

మ‌రో ఘ‌ట‌న‌: బీటీఎమ్ లేఅవుట్‌లో

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించిన మ‌రో ఘ‌ట‌న ఇది. కైలాస‌న‌హ‌ల్లికి చెందిన స‌ర్వేష్ ఆరాధ్య సౌత్ ఇండియ‌న్ బ్యాంక్ ఏటీఎమ్ నుంచి త‌న వేత‌నం రూ.19,500 మోస‌కారుల వల్ల పోగొట్టుకుంది.

రెండేళ్ల డ‌బ్బు ఒక్క రోజులో

రెండేళ్ల డ‌బ్బు ఒక్క రోజులో

ఎమ్ అజ్మ‌త్ అనే నిర్మాణ కార్మికుడు ఎల‌క్ట్రానిక్ సిటీలో ప‌నిచేస్తున్నాడు. రెండేళ్ల కాలంలో క‌ష్ట‌ప‌డి యాక్సిస్ బ్యాంకు ఖాతాలో రూ.60 వేలు దాచుకున్నాడు. ఆదివారం ఒక్క‌రోజు ఆ డ‌బ్బంతా కోల్పోయాడు. ఒక ప‌క్క త‌న డెబిట్ కార్డు త‌న వ‌ద్దే ఉన్నా, థానేలో ఉన్న ఏటీఎమ్‌లో డ‌బ్బు స్వైప్ చేసిన‌ట్లుగా మెసేజ్ వ‌చ్చింద‌ని ల‌బోదిబోమంటున్నాడు.

 సైబర్ క్రైమ్ పోలీసులు ఇలా

సైబర్ క్రైమ్ పోలీసులు ఇలా

దీంతో సైబ‌ర్ క్రైమ్ పోలీసులు దీనిపై ఆరా తీస్తున్నారు. న‌గ‌రంలో ఏటీఎమ్ విత్‌డ్రాయ‌ల్స్ నుంచి ఇలా డ‌బ్బు కోల్పోయిన వారి వివ‌రాలు తీసుకున్నారు. మంగ‌ళ‌వారం దాదాపు వివిధ వ్య‌క్తుల నుంచి ఫిర్యాదులు స్వీక‌రించి 35 కంప్ల‌యింట్ల‌ను రిజిస్ట‌ర్ చేశారు. బెంగుళూరులో ముఖ్యంగా బీటీఎమ్ లేఅవుట్‌, హెన్నూర్‌, గెడ్డ‌ల‌హ‌ల్లి, ఇందిరా న‌గ‌ర్‌, ఇంకా ముంబ‌యి, థానే ప్రాంతాల్లో ఏటీఎమ్‌ల నుంచి అక్ర‌మ విత్‌డ్రాయ‌ల్స్ జ‌రిగాయ‌ని సైబర్ క్రైమ్ పోలీసులు అంటున్నారు.

 ఒకే వ్య‌క్తి రూ.1.17 ల‌క్ష‌లు కోల్పోయారా!

ఒకే వ్య‌క్తి రూ.1.17 ల‌క్ష‌లు కోల్పోయారా!

సోమ‌వారం ఒక్క రోజే 30 కేసులు ఫైల్ అయ్యాయని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఒకే ఒక్క మ‌హిళ దాదాపు రూ.1.17 లక్ష‌లు ఈ విధంగా కోల్పోయిన‌ట్లు స‌మాచారం.

పోలీసుల అనుమానం ఇది

పోలీసుల అనుమానం ఇది

పోలీసులు దీన్ని పెద్ద సైబ‌ర్ నేరంగా భావిస్తున్నారు. ఏటీఎమ్ కార్డు పెట్టే మెషీన్‌లో స్కిమ్మ‌ర్ ప‌రిక‌రాలు పెట్టి, ఏటీఎమ్ ఉండే గ‌దిలో పిన్ రికార్డు కోసం అతి చిన్న కెమెరాల‌ను అమ‌ర్చి ఉండొచ్చ‌ని అనుమానిస్తున్నారు. ఈ స్కిమ్మ‌ర్ల ద్వారా ఏటీఎమ్ కార్డు మాగ్నెటిక్ స్ట్రిప్ లోంచి కావాల్సిన వివ‌రాల‌ను తీసుకుంటారు. ఏటీఎమ్ యంత్రం ఉంచిన గ‌దిలోంచి పిన్ వివ‌రాల‌ను తీసుకుంటారని టైమ్స్ ఆఫ ఇండియా వార్తా క‌థ‌నం సారాంశంగా ఉంది.

దేశంలో క్రెడిట్ కార్డు మోసాలు-జాగ్ర‌త్తలు

Read more about: bangalore atm debit card frauds
English summary

ఏటీఎమ్ విత్‌డ్రాయ‌ల్స్‌లో మోసం: 10 ల‌క్ష‌ల డ‌బ్బు హుష్ కాకి | Because of atm fraud people lost their hard earned money

Bengaluru has been hit by a new problem. The city police now suspect that nefarious gangs have installed advanced card skimmers in ATMs, which can read debit and credit card information while the card is being used.The police say, that in less than a week, 200 residents of Bengaluru have lost more than Rs 10 lakh through illegal withdrawals at ATMs.
Story first published: Wednesday, July 5, 2017, 10:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X