For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫండ్ కొనుగోలు ఫోన్ కొన్నంత సులువు కావాలి: అనిల్ అంబానీ

మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డులను, ప్ర‌క‌ట‌న నిబంధ‌న‌ల‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేయాల్సిందిగా వ్యాపార వేత్త అనిల్ అంబానీ సెబీని కోరారు. అసోసియేష‌న్ ఆఫ్ మ్యూచువ‌ల్ ఫండ్స్ ఇండియా(యాంఫీ) ఏర్పాటు చేసిన ఒక కార్య‌క

|

మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డులను, ప్ర‌క‌ట‌న నిబంధ‌న‌ల‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేయాల్సిందిగా వ్యాపార వేత్త అనిల్ అంబానీ సెబీని కోరారు. అసోసియేష‌న్ ఆఫ్ మ్యూచువ‌ల్ ఫండ్స్ ఇండియా(యాంఫీ) ఏర్పాటు చేసిన ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న త‌న అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు.

 ప్ర‌తి 25 మందిలో ఒక‌రు మాత్ర‌మే ఫండ్ల‌లో

ప్ర‌తి 25 మందిలో ఒక‌రు మాత్ర‌మే ఫండ్ల‌లో

దేశంలో ప్ర‌తి 25 మందిలో ఒక‌రు మాత్ర‌మే మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెడుతున్నారు. దీన్ని 10 రెట్లు చేసి వ‌చ్చే ఐదు సంవ‌త్స‌రాల్లో 60 కోట్ల‌కు చేర్చ‌వ‌చ్చు. బ్యాంకు ఖాతాల పెంపుకు జ‌న్ ధ‌న్ చేప‌ట్టిన‌ట్లే మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో జ‌న్ ధ‌న్ ఉద్య‌మం రావాల్సి ఉంద‌న్నారు. దేశంలో ప్ర‌తి 10 మందిలో 9 మందికి మొబైల్ క‌నెక్ష‌న్ ఉండ‌గా, ప్ర‌తి 10లో ముగ్గురికి స్మార్ట్ ఫోన్ ఉంటే కేవ‌లం ప్ర‌తి 25 మందిలో ఒక‌రికి మాత్ర‌మే మ్యూచువ‌ల్ ఫండ్స్‌తో ప‌రిచ‌యం ఉంద‌న్నారు.

 మ‌న ఫండ్ ప‌రిశ్ర‌మ య‌వ్వనాన్ని దాటింది

మ‌న ఫండ్ ప‌రిశ్ర‌మ య‌వ్వనాన్ని దాటింది

అంత‌ర్జాతీయంగా చూసినా మ్యూచువ‌ల్ ఫండ్ ప‌రిస్థితి అంత ఆశాజ‌న‌కంగా లేదు. ప్ర‌పంచంలో ఉన్న కేవ‌లం 58 అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు నిర్వ‌హించే ఆస్తి, మ‌న దేశంలో మ్యూచువ‌ల్ ఫండ్ ప‌రిశ్ర‌మ నిర్వ‌హించే డ‌బ్బు కంటే ఎక్కువ ఆస్తుల‌ను నిర్వ‌హిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో చూస్తే మ‌న మ్యూచువ‌ల్ ఫండ్ ప‌రిశ్ర‌మ చాలా కొత్త‌ద‌ని చెప్పాలి. ఒక ర‌కంగా చెప్పాలంటే అది త‌న య‌వ్వ‌నాన్ని దాటింద‌ని అనిల్ అన్నారు.

 క్యాపిట‌ల్ మార్కెట్ పితామ‌హుడు ధీరూబాయ్‌

క్యాపిట‌ల్ మార్కెట్ పితామ‌హుడు ధీరూబాయ్‌

1964లో యూటీఐ ప్రారంభ‌మైన‌ప్పుడు దేశంలో 30 ఏళ్ల వ‌ర‌కూ మ‌రో ప్రైవేటు మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌కు తావు లేదు. దేశంలో క్యాపిటల్ మార్కెట్ పితామ‌హుడు, ఈక్విటీ సంస్కృతికి ఆద్యుడు అయిన ధీరూబాయ్ అంబానీ కార‌ణంగానే దేశంలో ఈ విధ‌మైన పెట్టుబ‌డుల‌కు ఆస్కార‌ముంద‌ని తెలిసి వ‌చ్చింద‌ని పేర్కొన్నారు.

1995లో రిల‌య‌న్స్ మ్యూచువ‌ల్ ఫండ్ ప్రారంభం

1995లో రిల‌య‌న్స్ మ్యూచువ‌ల్ ఫండ్ ప్రారంభం

1993లో త‌మ బంధువుతో క‌లిసి కొఠారి ప‌య‌నీర్ మ్యూచువ‌ల్ ఫండ్‌ను, 1995లో రిల‌య‌న్స్ మ్యూచువ‌ల్ ఫండ్‌ను ప్రారంభించడం జ‌రిగింద‌ని చెప్పారు. 1995లో ఆస్తుల మొత్తం నిర్వ‌హ‌ణ రూ.60 కోట్ల నుంచి 2002 నాటికి రూ. 2200 కోట్ల‌కు చేరుకుంద‌న్నారు. ఆస్తుల ప‌రంగా చూస్తే 100 రెట్లు 2.25 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల స్థాయికి వ‌చ్చామ‌న్నారు. ఒక ఆస్తుల నిర్వ‌హ‌ణ కంపెనీగా ప్ర‌స్తుతం మొత్తం రూ.3.58 లక్ష‌ల కోట్ల వ్యాపారం జ‌రిపే ద‌శ‌లో ఉన్నామ‌ని చెప్పారు. ఇదే స‌మయ‌మంలో దేశ మ్యూచువ‌ల్ ఫండ్ పరిశ్ర‌మ 5.7 ల‌క్ష‌ల కోట్ల వ్య‌క్తిగ‌త ఖాతాల‌తో 20 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల ఆస్తుల‌ను క‌లిగి ఉంద‌ని వివ‌రించారు.

Read more about: mutual funds investments mf
English summary

ఫండ్ కొనుగోలు ఫోన్ కొన్నంత సులువు కావాలి: అనిల్ అంబానీ | our mutual fund industry has to change a lot anil ambani

"We at Reliance, together with my late brother-in-law, Shyam Kothari, shared the exclusive privilege of launching India's first-ever private sector mutual fund in 1993 - Kothari Pioneer Mutual Fund. Our own offering followed soon afterwards with the launch of Reliance Mutual Fund in 1995," anil ambani said.
Story first published: Saturday, July 1, 2017, 10:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X