For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్ర‌పంచంలో టాప్ 50 కంపెనీలివే

లింక్డ్ ఇన్ కంపెనీ విడుదల చేసిన టాప్ 50 కంపెనీల జాబితాలో మనకి తెలిసిన అమేజాన్, సేల్స్ ఫోర్స్, స్టార్ బక్స్ లాంటి కంపెనీలున్నాయి.ఈ 50 కంపెనీలు 21 రంగాలకి సంబంధించినవి, వీటిల్లో 33 లక్ష‌ల మంది ఉద్యోగు

|

* లింక్డ్ ఇన్ టాప్ 50 కంపెనీలు

లింక్డ్ ఇన్ కంపెనీ విడుదల చేసిన టాప్ 50 కంపెనీల జాబితాలో మనకి తెలిసిన అమేజాన్, సేల్స్ ఫోర్స్, స్టార్ బక్స్ లాంటి కంపెనీలున్నాయి.ఈ 50 కంపెనీలు 21 రంగాలకి సంబంధించినవి, వీటిల్లో 33 లక్ష‌ల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.ఈ కంపెనీలలోనే పని చెయ్యడానికి ప్రొఫెషనల్స్ ఉవ్విళ్లూరుతుంటారు. లింక్డ్ ఇన్ కి చెందిన 500 మిలియన్ సభ్యులను వివిధ రకాలుగా విశ్లేషించి ఏదైనా సంస్థకి మూడు స్తంభాలైన "కంపెనీలో పని చెయ్యడానికి ఉద్యోగార్ధులు చూపించే ఆసక్తి","కంపెనీ బ్రాండ్ మరియూ ఉద్యోగుల మీద ఆసక్తి","ఉద్యోగులని నిలుపుకోవడం" లని చూసి ఈ టాప్ 50 జాబితాని లింక్‌డ్ ఇన్ వారు తయారు చేశారు. ఈ ఏడాది టాప్ 50 కంపెనీలలో 15 కంపెనీల వివరాలు ఈ క్రింద చూడొచ్చు.

1.ఆల్ఫాబెట్

1.ఆల్ఫాబెట్

దీని మెయిన్ డివిజన్ అయిన గూగుల్ పేరు ద్వారా ఇది అంద‌రికీ సుప‌రిచితం. ఈ ఆఫీసు సంస్కృతి చాలా భిన్నం. ఆఫీసులో బైకులు,ఆహారం, ఫుట్‌బాల్ లాంటి సదుపాయాలుంటాయని మీరు ఈ పాటికి అనేక సార్లు విని ఉంటారు.కేవలం ఇవి మాత్రమే కంపెనీని అగ్ర స్థానంలో నిలబెట్టవు.మరి ఏమి నిలబెడతాయి?క్లిష్టమైన సమస్యలని చేధించడానికి ఉద్యోగులకి కల్పించే అవకాశాలు, వనరుల సాయంతో డ్రైవర్ రహిత కార్‌లని ఆవిష్కరించడం ఇలాంటివి ఉద్యోగులని ఆకర్షిస్తున్నాయి.

మొత్తం ఉద్యోగులు:72,000

ఈ సంస్థ సహ వ్యవస్థపాకుడు ల్యారీ పేజ్ మాటల్లోనే "విప్లవాత్మక ఆలోచనలే టెక్నాలజీ రంగం ముందుకెళ్ళడానికి కారణాలు.అందుకు కాస్త అసౌకర్యవంతంగా ఉన్నా పరిస్థితులకి అనుగుణంగా ఉండగలగాలి. "

పర్యావరణ సంరక్షణ:

2012 నుంచి కేవలం పునరుత్పాదక శక్తి వనరులని మాత్రమే ఉపయోగించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఇది లక్ష్య దిశలోనే పయనిస్తూ ఈ సంవత్సరాంతానికి లక్ష్యాన్ని చేరుకునే దిశగా పయనిస్తోంది.

2. అమెజాన్:

2. అమెజాన్:

గత 12 నెలలలో అమెజాన్ 3 ఆస్కార్‌లని గెలుచుకుంది.దీని ఖాతాదారులు పదుల మిలియన్ల సంఖ్యలో పెరిగిపోయారు, పైగా ఈ మధ్యే డ్రోన్ ద్వారా అమేజాన్ తమ మొదటి ప్యాకేజ్‌ని డెలివర్ చేసింది కూడా.ఇలాంటి వినూత్న ఆలోచనలే ఉద్యోగులు అమేజాన్‌లో ఉద్యోగం చెయ్యాలని ఉవ్విళ్ళూరేటట్లు చేస్తాయి.వచ్చే 18 నెలలలో అమెరికాలో 100,000 మంది ఫుల్ టైం, ఫుల్ బెనిఫిట్ ఉద్యోగాలకి అభ్యర్ధులని తీసుకోవాలని ప్రణాలికలున్నాయి.

మొత్తం ఉద్యోగులు:341,000

లీవ్ షేర్: దీని వల్ల ఆరు వారాల పెయిడ్ లీవ్‌ని తల్లి తండ్రులిద్దరూ పంచుకోవచ్చు.అమేజాన్ ఆఫీసు హెడ్ క్వార్టర్స్‌లో కేవలం కుక్కలని అనుమతించడమే కాదు దగ్గరలోనే ఒక డాగ్ పార్క్, ఉచిత తినుబండారాలు అందుబాటులో ఉంటాయి.

3. ఫేస్ బుక్:

3. ఫేస్ బుక్:

ప్రతీ నెలా ఫేస్‌బుక్ లో 1.9 బిలియన్ల యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. ఇంత భారీగా యూజర్లు ఉండటం వల్ల ఉద్యోగులు కనీ వినీ ఎరుగని రీతిలో ప్రయోగాలు చెయ్యడానికి అవకాశం వస్తుంది.ఈ సంస్థ పోటీ కంపెనీలయిన స్నాప్ చాట్ లేదా ట్విట్టర్(ప్రతీ నెలా 313 మిలియన్ల యాక్టివ్ యూజర్స్)కి అందనంత ఎత్తులో ఉంది ఇది.

ఈ కంపెనీ సీయీవో మార్క్ జూకర్ బర్గ్‌కి ఈ కంపెనీ గురించి ఉన్న విజన్ కూడా పెద్దదే.రాబోయే తరాలకి అవసరమైన సోషల్ ఇంఫ్రాస్ట్రక్చర్‌ని నిర్మించాలన్నది వారి కల.

మొత్తం ఉద్యోగుల సంఖ్య:17,000

సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్,ఇంఫ్రాస్ట్రక్చర్,మెషీన్ లెర్నింగ్,డాటా అనలిటిక్స్, మార్కెటింగ్ రంగంలో దీనిలో ఎక్కువ అవకాశాలున్నాయి.

ఉద్యొగార్ధులని ఇంటర్వ్యూ చేసేటప్పుడు వారి ప్రాముఖ్యతలని తెలుసుకోవడానికి మీ ఉద్యోగంలో బెస్ట్ డే అంటే ఎలా ఉంటుంది అని ప్రశ్నిస్తారు.

4.సేల్స్ ఫోర్స్:

4.సేల్స్ ఫోర్స్:

క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్ వేర్ కంపెనీ అయిన సేల్స్ ఫోర్స్ అధికారిక కార్యాలయం శాన్‌ఫ్రాన్సిస్కో డిజైన్‌లో బౌద్ధ సన్యాసుల సహకారం తీసుకున్నారు.ఈ ఆఫీసులో 61 వ అంతస్థు ప్రత్యేకించి ఉద్యోగుల కోసం కమ్యూనిటీ ఈవెంట్స్ కోసం కేటాయించబడింది.ఈ కంపెనీ నిత్యం ఉద్యోగుల జీతాలని సమీక్షిస్తూ లింగ వివక్ష,జాతి వివక్ష కి తావు లేకుండా చూస్తారు.ఇలా ఉన్న వివక్షని పూరించడానికే ఈ సంవత్సరం 3 మిలియన్ డాలర్లు వెచ్చించారు.

మొత్తం ఉద్యోగులు: 250,000

సంవత్సరంలో శలవలకి అదనంగా మరో 8 రోజులు ఉద్యోగులు తమకు నచ్చిన కార్యక్రమాలకి సమ‌యం వెచ్చించడానికి అవకాశం కలుగుతుంది.

ఇటీవలే అమెరికాలో పిల్లలని చూసుకునే తల్లి తండ్రులకి ఈ సంస్థ వారు ఆరు నెలల పేరెంటింగ్ లీవ్ కల్పించారు.

5.ఊబర్:

5.ఊబర్:

ఊబర్ ప్రారంభించినప్పటినుండీ ఏదో ఒక అడ్డంకులే.అయినా కూడా ఇవేమీ ఊబర్ ప్రస్థానాన్ని ఆపలేకపోయాయి.ఉద్యోగులు ఎక్కువగా ఇష్టపడే సంస్థగా ఊబర్ ఎదిగింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఉద్యోగార్ధులు రెండు రెట్లు పెరిగారని గణాంకాలు చెప్తున్నాయి కానీ ఆ తరువాత వచ్చిన డాటాని విశ్లేషిస్తే కొంచం తగ్గుదల కనిపిస్తుంది.ఊబర్ సంస్థ సంస్కృతి బాగోదనుకుంటే ప్రతిభావంతులు ఊబర్ లో ఉద్యోగం చెయ్యడానికి ఎందుకు ఉవ్విళూరతారు?అసలు ఉద్యోగులు అక్కడ ఎందుకు ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నారు? అక్క‌డ నిత్య‌నూత‌న‌త వ‌ల్లే.

మొత్తం ఉద్యోగుల సంఖ్య: 12,000

ఊబర్ కంపెనీ విలువ దాదాపు 69 బిలియన్ డాలర్లు.ఇది ప్రైవేట్ టెక్నాలజీ కంపెనీలలో అధిక విలువ కలిగినది.

కొత్త ఉద్యోగులందరూ 3 రోజులపాటు ఊబర్ వర్సిటీ కార్యక్రమానికి హాజరవుతారు.ఈ కార్యక్రమంలో వారు కంపెనీ లీడర్‌షిప్ టీంని కలుసుకోవచ్చు.

6. టెస్లా :

6. టెస్లా :

ఆటో మోబైల్ రంగంలో పని చెయ్యాలనుందా? లేదా టెక్నాలజీలో?లేదా భవిష్యత్ టెక్నాలజీలో? టెస్లా మీకు ఈ అవకాశాలన్నింటినీ కల్పిస్తుంది.ఎలాన్ ముస్క్ స్థాపించిన ఈ సంస్థ ఇటీవలే జీ్ఎం, ఫోర్డ్‌లని త్రోసిరాజని అమెరికాలో అతి పెద్ద ఆటో మేకర్ గా అవతరించింది.దీని మార్కెట్ విలువ 50 బిలియన్లు.ఈ సంస్థ ఇప్పుడు కేవలం వాహన తయారీదారు మాత్రమే కాదు.2 బిలియన్ డాలర్లు వెచ్చింది కొన్న సోలార్ సితీ కంపెనీ కొనుగోలు వివాదాస్పదమైంది.ఇది ప్రపంచమలోని ఏకైక సస్టెయినబుల్ ఎనర్జీ కంపెనీ.

మొత్తం ఉద్యోగులు:30,000

ఈ కంపెనీలొ ప్రపంచ వ్యాప్తంగా 2500 స్థానాలు ఖాళీగా ఉన్నాయి.వీటిలో ఎనర్జీ ఎడ్వైజర్,థెర్మల్ సిస్టంస్ ఏరో డైనమిస్ట్ తదితర ఉద్యోగాలు కూడా ఉన్నాయి.

ఆ తీరం నుండి ఈ తీరం వరకూ వీరు రూపొంచించిన ఆటో పైలట్ ఫీచర్ వల్ల సంవత్సరాంతానికి లాస్ ఏంజిలీస్ నుండి న్యూయార్క్ వరకూ డ్రైవర్ రహితంగా ప్రయాణించవచ్చని సీయీవో మస్క్ చెప్పారు.

7. ఆపిల్:

7. ఆపిల్:

క్యూపెర్టినో, కాలిఫోర్నియాలో ఆపిల్ సంస్థ ఉద్యోగులు తమ సామాగ్రిని ప్యాక్ చేసుకుంటున్నారు. ఎందుకంటే సరికొత్త ఆపిల్ ఆఫీసు వారి కోసం ఎదురుచూస్తోంది మరి. ఆపిల్ కంపెనీ యొక్క స్లీక్ డిజైన్ అన్న నినాదాన్ని అనుసరిస్తూ ఈ క్రొత్త ఆఫీసు రూపు దిద్దుకుంది. ఈ కొత్త ఆఫీసులో ప్రతీ చిన్న‌ విషయం మీద శ్రద్ధ తీసుకుని తీర్చిదిద్దారు. కిటికీలు, నీళ్ళు బయటకి వెళ్ళే ఇతర మార్గాల ప్రతిబింబాలు గ్లాసు కిటికీల మీద పడి ప్రస‌రించ‌కుండా, ప్రతీ ద్వారం దగ్గరా ఎత్తుగా లేకుండా ఫ్లోర్ ఎత్తుకి సరిపోను ఉండేటట్లు శ్రద్ధ తీసుకున్నారు. లేకపోతే ద్వారా దగ్గర ఎత్తుగా ఉంటే దాని మీద దృష్టి పడి ఉద్యోగుల ఏకాగ్రత దెబ్బ తింటుందని.

మొత్తం ఉద్యోగుల సంఖ్య:110,000

"మా సేవల పరిధిని వచ్చే నాలుగేళ్ళలో ద్విగుణీకృతం చెయ్యాలనుకుంటున్నట్లు సీయీవో టిం కుక్ చెప్పారు.సేవలు అంటే ఐ ట్యూన్స్, యాప్ స్టోర్, ఆపిల్ పే,లైసెన్సింగ్ తదితరాలు.

ఆపిల్ తమ ఉద్యోగులకి జీతంతో పాటు షేర్ల‌ను అందిస్తుంది.ఇది పార్ట్ టైం,రీటెయిల్ ఉద్యోగులకి కూడా వర్తిస్తుంది.ఆపిల్ రీటెయిల్ వైస్ ప్రెసిడెంట్ ఆంజెలా అహ్రెండ్ట్స్ ప్రకారం ఇది ఇండస్ట్రీలో మిగతా 80% తో పోల్చుకుంతే తమ రీటెయిల్ ఉద్యోగుల టర్న్ ఓవర్‌లో 10 శాతం కంటే కొంచం ఎక్కువ.

8. టైం వార్నర్:

8. టైం వార్నర్:

టైం వార్నర్ సంస్థ టర్నర్, వార్నర్ బ్రదర్స్, హెచ్ బీ ఓ తదితర సంస్థల యజమాని. ఈ సంస్థని ఏ టీ అండ్ టీ 85.4 బిలియన్లతో కొనుగోలు చేయడానికి రంగం సిద్ధమయ్యింది. దీనితో పాటు ఈ సంస్థ యొక్క 50 మిలియన్ కస్టమర్లని కూడా కొనుగోలుచేస్తోంది. ఈ సంస్థ యొక్క ముఖ్య వ్యాపారమే వినోద రంగం. ఆఫీసులో జరిగే సినిమా మరియూ టీవీ ప్రోగ్రాముల స్క్రీనింగులని మొదటే ఉద్యోగులు చూడవచ్చు.

మొత్తం ఉద్యోగుల సంఖ్య:25,000

హెఛ్‌బీఓ సీఈవో మరియూ చెయిర్‌మెన్ రిచర్డ్ ప్లీప్లర్ మాటల్లో చెప్పాలంటే "కెమెరా నలువైపులా పని చేయడానికి కావాల్సిన నైపుణ్యాలు బయట పడాలంటే వారిని స్వేచ్చగా ఉండనీయాలి.ఇది మర్కెటింగ్, పీ ఆర్, టాలెంట్ రిలేషన్స్ టీం, ఇలా అన్ని విభాగాలకీ ఇదే వర్తిస్తుంది".

టీమ్‌ వార్నర్ యొక్క ఫిట్ నేషన్ కార్యక్రమం వల్ల ఉద్యోగులు వివిధ రకాల వాక్స్, రన్స్ లో పాలు పంచుకునేటట్లు,ఇంటర్ కంపెనీ స్టెప్ చాలెంజ్, ట్రయథ్లాన్ ట్రెయినింగ్ లాంటి ఫిట్నెస్ ని పెంపొందించే కార్యక్రమాలుంటాయి.

9. వాల్ట్ డిస్నీ:

9. వాల్ట్ డిస్నీ:

ఈ భూమి మీద అత్యంత సంతొషదాయక ప్రదేశమైన డిస్నీ లాండ్ మాతృ సంస్థ ఇది. ఏబీసీ, ఈఎస్పీఎన్ లాంటి టెలివిజన్ సంస్థలు,మార్వెల్, పిక్సార్, లూకస్ లాంటి సంస్థలు కూడా వాల్ట్ డిస్నీ ఆధ్వర్యంలో నడిచేవే. వీటన్నింటికీ కావాల్సిన సృజనాత్మక ప్రతిభ అంతా ఎలుక చెవుల ఆకృతి కలిగిన ఒక కప్పు కింద ఉన్నట్లే.

ఈఎస్పీఎన్ కి వీక్షకుల సంఖ్య తగ్గినా సినిమా విభాగంలో డిస్నీ దీని హవా కొనసాగుతోంది.

మొత్తం ఉద్యోగులు:195,000.

సదుపాయాలు: డిస్నీ పార్కుకి తమకి తమ కుటుంబ సభ్యులకీ ఉచిత‌ పాస్ సదుపాయాలు ఉంటాయి.

సంవత్సరానికొకసారి సందర్శకులు రాక ముందే డిస్నీ ల్యాండ్ ఉద్యోగులు కేనోలలో టాం సాయర్ దీవులని చుడతారు.

10. కాంకాస్ట్:

10. కాంకాస్ట్:

కామ్‌కాస్ట్ ఎన్‌బీసీ యూనివర్సల్ నెట్ ఫ్లిక్స్ కి పోటీగా ఇంకొక సంస్థని తీసుకురాబోతొంది అన్న వ‌దంతులే కనుక నిజమైతే 25 మిలియన్ల హై స్పీడ్ ఇంటర్నెట్ కస్టమర్లు కలిగిన కామ్‌కాస్ట్ సంస్థ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుని పోటీలో దూసుకెళ్ళడానికి సిద్ధపడుతున్నట్లే. ఈ సంస్థ సీయీవో బ్రయాన్ రాబర్ట్స్ మాటల్లో చెప్పలంటే ఆఫీసులో సంస్కృతి బాగుంటే విజయం సాధించినట్లే. ఈ సంస్థ కామ్‌కాస్ట్ కేర్స్ లాంటి కార్యక్రమాల ద్వారా ఏటా వాలంటీరింగ్ డే ని నిర్వహిస్తూ ఒక క్రొత్త సంస్కృతికి జీవం పోస్తుంది.

మొత్తం ఉద్యోగులు:160,000.

2017 అంతానికల్లా 10,000 మంది మైనారిటీ కమ్యూనిటీకి చెందినవారిని నియ‌మించాల‌ని ఈ సంస్థ లక్ష్యం.ఈ సంస్థ 2011 నుండీ కేవలం స్త్రీలు, మైనారిటీ ప్రజలు అధిపతులుగా ఉన్న సంస్థలనుండి ఉత్పత్తుల కొనుగోలుకు 8 మిలియన్ డాలర్లు వెచ్చిందింది. ఇలా చేసిన మొట్ట మొదటి మీడియా మరియూ టెక్నాలజీ సంస్థ ఇది.

11.ఎయిర్ బీఎన్‌బీ:

11.ఎయిర్ బీఎన్‌బీ:

హోటల్ ఇండస్ట్రీ కి పోటీగా మారిన ఈ కంపెనీ విలువ $31 బిలియన్లు కానీ ఐపీఓని ఫాలో అయ్యేవారు కాస్త వేచి చూడాలి. ఈ సంస్థ సీఈవో తాము రాబోయే రెండు సంవత్సరాలలో పబ్లిక్ ఇష్యూకి వెళ్ళడానికి అణుగుణంగా పని చేస్తున్నాము అని మాత్రమే చెప్పారు కానీ అది ఎప్పటి నుండి ఎప్పటివరకు అని మాత్రం చెప్పలేదు. పేమెంట్లకి సంబంధించిన స్టార్టప్ టిల్ట్, రెస్టారెంట్ రిజర్వేషన్ యాప్ రెసీలో పెట్టుబడులతో ఈ సంస్థ వసతి కల్పన నుండి ఇతర రంగాలలో కూడా విస్తరిస్తోంది.

మొత్తం ఉద్యోగులు:3000

సదుపాయాలు:ప్రతీ నాలుగు నెలలకి ఒకసారి ఉద్యోగులు ఈ సంస్థలో నమోదు చేసుకోబడ్డ ఏ ప్రాంతానికైన వెళ్ళే ట్రావెల్ కూపన్లు ఇస్తారు.

హార్వర్డ్ అధ్యయనంలో బయట పడ్డ సంస్థలో వివక్షని సమీక్షించడానికి అమెరికా మాజీ అటార్నీ జనరల్ ఎరిక్ హోల్డర్ సహకారం తీసుకుంది.దీనివల్ల వివక్ష నివారణకి ఒక క్రొత్త ప్రోడక్ట్ టీమ్‌ నియమించబడింది.

12. నెట్ ఫ్లిక్స్:

12. నెట్ ఫ్లిక్స్:

మీరు లాస్ గతోస్, కాలిఫోర్నియా లో ఉన్న ఈ సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో అడుగుపెట్టగానే ఎదురుగా పాప్‌కార్న్ మేకర్ దాని పక్కనే వరుసగా ఉంచిన ఎమ్మీలు(అమెరికా లో యేటా అత్యుత్తమ టీవీ కార్యక్రమం లేదా పెర్ఫార్మర్‌కి ఇచ్చే అవార్డు)కనిపిస్తాయి. వాల్ స్ట్రీట్త్ సంస్థ తమ ఖాతాదారుల మీద ఎంత శ్రద్ధ కంబరుస్తుందో నెట్ ఫ్లిక్స్ కూడా వినోద రంగంలో అంత ఆసక్తి,శ్రద్ధ కనపరుస్తుంది.ఆరు బిలియన్ డాలర్లతో కార్యక్రమాలని నిర్మించి,1000 గంటల కార్యక్రమాలని తయారు చేయాలన్న ప్రణాళికతో నెట్ఫ్లిక్స్ దూసుకుపోతోంది.ఈ ప్రణాళికతోపాటు కొత్తగా లాస్ ఏంజెలీస్‌లో 800 మంది ఉద్యోగులతో కొత్త కార్యాలయాన్ని తెరిచింది.

మొత్తం ఉద్యోగుల సంఖ్య:3200

సంస్థలో పని చేయడం వల్ల కలిగే లాభమేమిటంటే ఈ సంస్థ సంవత్సరంపాటు జీతమిచ్చి ప్రసూతి సెలవునిస్తుంది.మీ సెలవులు కూడా అపరిమితం.

13. మెక్ కిన్సే అండ్ కో:

13. మెక్ కిన్సే అండ్ కో:

మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ అయిన మెక్ కిన్సే అండ్ కో తాము 22 విభాగాల్లో ప్రొఫెషనల్ స్పోర్ట్స్ లీగ్స్ నుండీ గవర్నమెంట్ లేబర్ డిపార్ట్మెంట్లవరకూ హై ప్రొఫైల్ క్లైంట్లకి సేవలు అందిస్తున్నా కానీ పెద్దగా ప్రచారం చేసుకోదు. తమ సంస్థలో ఉద్యోగాలకి ఈ సంస్థ బిజినెస్ స్కూళ్ళ వైపు చూసినా బయట నుండి కూడా ఇంజనీరింగ్,లా, సైన్స్, మెడిసిన్ రంగాలలో అధిక విద్యార్హతలున్న అభ్యర్ధులని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంది.ఈ సంస్థ యొక్క అలుమ్నీ కెరీర్ సర్వీసెస్ విభాగం 120 దేశాలలో విస్తరించిన తమ 30,000 మంది మాజీ ఉద్యోగుల సహకారం తీసుకుంటుంది.

మొత్తం ఉద్యోగుల సంఖ్య:25,000

సంస్థలో పని చేయడం వల్ల కలిగే లాభమేమిటంటే తమ ఉద్యోగులు ప్రాజెక్టు మధ్యలో 10 వారాలు విశ్రాంతి తీసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.

14. డెల్ టెక్నాలజీస్:

14. డెల్ టెక్నాలజీస్:

కంప్యూటింగ్ కేవలం డెస్క్‌ టాప్ నుండి డిస్ట్రిబ్యూటింగ్ కంప్యూటింగ్ గా మారినట్లే డెల్ కూడా రూపాంతరం చెందింది. తమకి నచ్చిన వేళల్లో పని చేసే సౌకర్యాన్ని ఈ సంస్థ కల్పిస్తోంది. ఇంటి నుండి పని చెయ్యాలనుకుంటున్నారా? లేదా మీకు నచ్చిన వేళల్లో పని చేద్దామనుకుంటున్నారా? లేకపోతే మీ పెంపుడు కుక్క ని ఆఫీసుకు తీసుకురావాలనుకుంటున్నారా?ఇవన్నీ అనుమతించబడతాయి.ఇదే కాకుండా మీరు ఎక్కడినుండైనా పని చేయవచ్చు.మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ గడపాలని డెల్ యోచన. కేవలం ఈ కంపెనీ మాత్రమే కాదు దాని అనుబంధ సంస్థలైన డెల్ ఈ ఎంసీ,ఆ రెస్ ఏ మరియూ వీఎమ్వేర్ ఆలోచన కూడా అదే. డెల్ సంస్థలో ఉద్యోగంలో చేరేవారిలో 40 శాతం మంది డెల్ ఉద్యోగులు సూచించిన వారేట. ఎలక్ట్రానిక్ వ్యర్ధాలని అభివృద్ధి చెందుతున్న దేశాలకి నిషేధించిన మొదటి సంస్థ డెల్. ఇంకా ఈ సంస్థ వినూత్నం గా ఆలోచించి పుట్టగొడుగులని ప్యాకేజింగుకి ఉపయోగించడమే కానుండా తమ వినియోగదారులకి ఉచితంగా రీసైక్లింగ్‌ని అందిస్తోంది.

మొత్తం ఉద్యోగుల సంఖ్య:145,000.

పర్యావరణ సంరక్షణ:సముద్ర గర్భం నుండి వెలికి తీసిన ప్లాస్టిక్ రీసైకిల్ చేయగా వచ్చిన మెటీరియల్‌ని తమ ఎక్స్పీఎస్ నోట్‌బుక్ ప్యాకెజింగుకి ఉపయోగించింది. 2020 నాటికల్లా వంద శాతం ఇలాంటి ప్యాకేజింగుని ఉపయోగించాలని సంస్థ లక్ష్యం.

15. వర్క్ డే

15. వర్క్ డే

ఫైనాన్స్ మరియూ హెచ్ ఆర్ కంపెనీ అయిన వర్క్ డే అమేజాన్, వాల్మార్ట్, టార్గెట్ లాంటి దిగ్గజ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని మార్కెట్లో శరవేగంగా దూసుకుపోతోంది. తమ కార్పోరేట్ సంస్కృతికి ప్రాధాన్యతనిస్తూనే తమ ఉద్యోగులకి పరిమితి లేని సెలవులు, బ్యూటీ ట్రీట్మెంట్స్(మానిక్యూర్, పెడిక్యూర్ తదితరాలు) అందిస్తోంది. ఈ సంస్థ ఒక్కోసారి ఉద్యోగులు ఆఫీసులో పై అంతస్థు నుండి క్రింది అంతస్థుకి వెళ్ళడానికి జారుడుబల్ల ఏర్పాటు చేస్తుంది(ఇది లిఫ్ట్ కంటే వేగవంతమనీ పైగా సరదాగా కూడా ఉంటుందని సంస్థ చెప్టోంది).

మొత్తం ఉద్యోగుల సంఖ్య:6.600

ఈ సంస్థ లింక్డ్ ఇన్ కి ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ సంస్థ గత సంవత్సరం 2000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించింది, వచ్చే సంవత్సరంలో ఇంకో 2200 మందిని తీసుకోబోతున్నరుట.ఈ ఖాళీలు ఎక్కువగా సాఫ్ట్ వేర్ ఇంజనీరు ఉద్యోగాలకే ఉన్నాయట.

English summary

ప్ర‌పంచంలో టాప్ 50 కంపెనీలివే | LinkedIn Top Companies 2017- Where the world wants to work now

To create the list LinkedIn analyzed the billions of actions taken by their 500+ million members across three categories of company interest. These three categories are interest in a company's jobs, interest in a company's brand and employees, and employee retention. Additional details of the methodology are available here. Individual country analyses are also available for Australia, Brazil, France, Germany, India and the United Kingdom.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X