For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రాఫిక్ స‌మ‌స్య ప‌రిష్కారానికి 2 ల‌క్ష‌ల ప్రైజ్

ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న స్థాయి పెంపు, వినూత్న ఆలోచ‌న‌ల ద్వారా మాత్ర‌మే స‌మ‌స్య ప‌రిష్క‌రాల‌ను కనుక్కునే వీలుంది. అందుకే ఫ్లిప్‌కార్ట్ స‌రికొత్త‌గా ఆలోచించింది. ఈ విష‌యంపై దృష్టి సారించి ప్ర‌జ‌ల నుంచి ఐడియ

|

బెంగుళూరు ట్రాఫిక్ స‌మ‌స్య‌పై ఫ్లిప్‌కార్ట్‌
బెంగుళూరు అంటేనే మొద‌ట ఐటీ కంపెనీలు గుర్తు రాగానే త‌ర్వాత మ‌దిలోకి వ‌చ్చేది ట్రాఫిక్ అనేది త‌ప్ప‌కుండా ఒప్పుకోవాల్సిన విష‌యం. అయితే వాహ‌నాల సంఖ్య పెరుగుతున్నా దానికి త‌గ్గ రోడ్లు లేక‌పోవ‌డం ఇక్క‌డ ట్రాఫిక్ జామ్‌ల‌కు ప్ర‌ధాన కార‌ణం. అయితే దీని గురించి ప్ర‌భుత్వాలు శ్ర‌ద్ద‌ప‌రిచిన‌ట్లు క‌న‌బ‌డ‌టం లేదు. ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న స్థాయి పెంపు, వినూత్న ఆలోచ‌న‌ల ద్వారా మాత్ర‌మే స‌మ‌స్య ప‌రిష్క‌రాల‌ను కనుక్కునే వీలుంది. అందుకే ఫ్లిప్‌కార్ట్ స‌రికొత్త‌గా ఆలోచించింది. ఈ విష‌యంపై దృష్టి సారించి ప్ర‌జ‌ల నుంచి ఐడియాల‌ను స్వీక‌రిస్తోంది. దీని గురించి మ‌రిన్ని వివ‌రాలు మీ కోసం...

ఫ్లిప్‌కార్ట్ 10 సంవత్స‌రాల సంద‌ర్భంగా

ఫ్లిప్‌కార్ట్ 10 సంవత్స‌రాల సంద‌ర్భంగా

బెంగుళూరు కేంద్రంగా ప‌నిచేస్తున్న ఫ్లిప్‌కార్ట్ ఈ ఏడాదితో ప‌దేళ్లు పూర్తిచేసుకుంటుంది. బెంగుళూరులో నిత్యం ఎన్నో ల‌క్ష‌ల మంది ఉద్యోగులు ఇంటి నుంచి కార్యాల‌యాల‌కు, అక్క‌డ నుంచి మ‌ళ్లీ ఇంటికి ప్ర‌యాణించేట‌ప్పుడు ట్రాఫిక్ గురించి భ‌య‌ప‌డుతుంటారు. అదే విధంగా ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులు సైతం స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. ఎక్కువ‌గా ఐటీ ఉద్యోగులు ప‌నిచేసే ఏరియాల్లో ఫ్లిప్‌కార్ట్ డెలివ‌రీలు స‌మ‌యానికి అందించ‌డం ప్ర‌ధాన సమ‌స్య‌. 10 ఏళ్ల సెల‌బ్రేష‌న్స్ సంద‌ర్భంగా ఈ సమ‌స్య ప‌రిష్కారానికి బెంగుళూరు పౌరుల నుంచి స‌ల‌హాల‌ను, సూచ‌న‌ల‌ను కొరుతున్న‌ది.

సృజ‌నాత్మ‌క వేదిక‌

సృజ‌నాత్మ‌క వేదిక‌

ఫ్లిప్‌కార్ట్ ముఖ్య ఆర్కిటెక్ట్ బి ఉత్క‌ర్ష్ ఎన్‌డీటీవీతో మాట్లాడుతూ, మా స్థాయిలో మేము చిన్న సృజ‌నాత్మ‌క వేదికను ఏర్ప‌రుస్తున్నాం. ప్ర‌జ‌లు వ‌చ్చి భాగ‌స్వామ్యుల‌య్యేందుకు అవ‌కాశం ఉంది. ఇక్క‌డ చ‌ర్చించి స‌మస్య‌పై దృష్టి పెట్టే సూచ‌న‌ల‌ను, త‌ద్వారా ప‌రిష్కారాల రాక కోసం కృషి చేస్తారు. స‌మ‌స్య తీవ్ర‌త‌ను త‌గ్గించేందుకు ఈ వేదిక కృషి చేయ‌వ‌చ్చు. అది సిల్క్ బోర్డ్ జంక్ష‌న్, కేఆర్ పురం జంక్ష‌న్ ట్రాఫిక్ ఉన్న ఎక్క‌డైనా కావొచ్చు. ఏదో స‌మ‌స్య లేకుండా చేసేందుకు ఫ్లిప్‌కార్ట్ కాస్త ఖ‌ర్చు పెడుతోంద‌ని ఆయ‌న అన్నారు.

సాంకేతిక‌త‌తో చెక్ పెట్టొచ్చా?

సాంకేతిక‌త‌తో చెక్ పెట్టొచ్చా?

ట్రాఫిక్ ప‌రిష్కారానికి బెంగుళూరు ప్ర‌జ‌లు ఎంచుకున్న మార్గం ఆన్‌లైన్ షాపింగ్‌. అయితే ఫుడ్ కోసం ఆన్‌లైన్ ఆర్డ‌ర్లు ఇచ్చినా స‌మ‌యానికి అవి వ‌స్తాయ‌ని రావ‌ని తెలుసు. ఫ్లిప్‌కార్ట్ రోజుకు కొన్ని వేల ఆర్డ‌ర్ల‌ను హ్యాండిల్ చేయాలి. గ్రౌండ్ లెవెల్లో స‌మ‌స్య తీవ్ర‌త‌ను వాళ్లు అర్థం చేసుకునే అవ‌కాశం ఉంది కాబ‌ట్టే ఇలా ఆలోచించారు. సాంకేతిక‌త‌తో వినూత్న ప‌రిష్కారాల‌ను క‌నుగొన‌వ‌చ్చేమో బెంగుళూరు పౌరులు ఆలోచించాలి. ఉత్త‌మ ప‌రిష్కారాల‌ను చూపిన వారి వివ‌రాల‌ను జులై1న ప్ర‌క‌టిస్తారు. విజేత‌ల‌కు రూ.2 ల‌క్ష‌ల, రూ.1 ల‌క్ష‌, రూ.50 వేల‌ విలువైన వోచ‌ర్ల‌ను మూడు ప్ర‌దేశాల్లో ఇస్తారు.

 బెంగుళూరులో ఇంత ట్రాఫిక్ ఎందుకు?

బెంగుళూరులో ఇంత ట్రాఫిక్ ఎందుకు?

1990ల నుంచి బెంగుళూరు న‌గ‌రానికి ప్ర‌పంచ దేశాల నంచి ఐటీ కంపెనీల రాక మొదలైంది. ఉపాధి కోసం దేశ‌వ్యాప్తంగా యువ ప‌ట్ట‌భ‌ద్రులు ఈ న‌గ‌రాన్నే ఎక్కువ‌గా ఎంచుకుంటున్నారు. అందుకే జ‌నాభా ఇంత‌లింత‌ల‌వుతోంది. 2011లో 87 ల‌క్ష‌లుగా ఉన్న జ‌నాభా ప్ర‌స్తుతం 1.15 కోట్ల‌కు పైగా ఉందంటే ప‌రిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

వాహ‌నాల విష‌యానికొస్తే

వాహ‌నాల విష‌యానికొస్తే

ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ లెక్క‌ల ప్ర‌కారం 2009 నాటికి బెంగుళూరు న‌గ‌రంలో 26 ల‌క్ష‌ల ద్విచ‌క్ర వాహ‌నాలు ఉన్నాయి. అదే మార్చి 2015 నాటిక‌ల్లా 41.86 ల‌క్ష‌ల టూవీల‌ర్లు ఉన్నాయి. బెంగుళూరులో ప‌న్ను చెల్లింపుదార్ల‌లో ప్ర‌తి ఇద్ద‌రిలో ఒక‌రికి కారు ఉంటుంద‌ని అంచ‌నా. కార్ల సంఖ్య 2015లో 11.8 లక్ష‌లుగా ఉండ‌గా; ర‌వాణా వాహ‌నాల సంఖ్య 5.91 ల‌క్ష‌ల పైన ఉండొచ్చ‌ని తెలుస్తోంది. మొత్తం వాహ‌నాల ప‌రంగా చూస్తే ఇవ‌న్నీ 60.59 ల‌క్ష‌లు ఉంటాయ‌ని బెంగుళూరు ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ లెక్క‌లు చెబుతున్నాయి. రిజిస్ట్రేష‌న్ లేని, ఎక్క‌డో నుంచి ఇక్క‌డ తిరిగే వాహ‌నాలు అన్నీ క‌లిపితే క‌నీసం 80 ల‌క్ష‌ల వాహ‌నాలు బెంగుళూరులో ఉంటాయి.

Read more about: flipkart traffic business bangalore
English summary

ట్రాఫిక్ స‌మ‌స్య ప‌రిష్కారానికి 2 ల‌క్ష‌ల ప్రైజ్ | flipkart plans to solve bengalurus traffic choas

Flipkart's Chief Architect, Utkarsh B, told NDTV, "In our own small way we are creating an open innovation platform. People can come in, collaborate, discuss, brainstorm. And seed certain ideas that can help solve part of the problem. It could be small localised junctions like Silk Board junction, KR Puram junction - what can be done for that. Or it could be a micro problem Flipkart is invested towards."
Story first published: Thursday, June 8, 2017, 13:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X