For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెజాన్ వాలెట్ రాక‌తో పేటీఎమ్‌,స్నాప్‌డీల్‌కు ఎదురుదెబ్బేనా?

|

భారత్‌లో తమ వ్యాపారాన్ని మరింత విస్తరించుకునేందుకు స్నాప్‌డీల్, పేటియమ్ లాంటి ప్రత్యర్థులతో విస్తృత స్థాయిలో పోటీపడుతున్న అంతర్జాతీయ ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ ఈ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. ఏడాది క్రితం వాలెట్ సేవ‌ల‌ను ప్రారంభించేందుకు ఆర్బీఐ అనుమ‌తి కోర‌గా ఇటీవ‌లే రిజ‌ర్వ్‌బ్యాంక్ అందుకు అవ‌కాశ‌మిచ్చింది. దీంతో దేశంలో డిజిట‌ల్ వాలెట్ల‌కు ఎదుర‌వ‌నున్న ప‌లు స‌వాళ్ల‌ను గురించి తెలుసుకుందాం.

నోట్ల ర‌ద్దు త‌ర్వాత డిజిట‌ల్ చెల్లింపులు

నోట్ల ర‌ద్దు త‌ర్వాత డిజిట‌ల్ చెల్లింపులు

నోట్ల ర‌ద్దు త‌ర్వాత ప్ర‌భుత్వం డిజిట‌ల్ చెల్లింపుల‌ను ప్రోత్స‌హిస్తోంది. ఈ దిశ‌గా ప్ర‌భుత్వ‌మే భీమ్‌, యూపీఐల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. మొబైల్ నుంచే చెల్లింపుల‌ను సులువుగా చేసేలా బ్యాంకుల‌ను ప్రోత్స‌హిస్తోంది. ఈ క్ర‌మంలో గ‌త ప‌దేళ్ల‌లో వివిధ వాలెట్ల‌ను సైతం ప్ర‌వేశ‌పెట్టారు. ఎన్నో కోట్ల పెట్టుబ‌డుల‌తో పేటీఎమ్ దేశ‌మంతా విస్త‌రించింది. ఇలా ఫ్రీచార్జీ, మొబిక్విక్, ఆక్సిజ‌న్ వంటి వాలెట్లు చెల్లింపులే ఆధారంగా ముందుకు సాగుతున్నాయి.

అమెజాన్ వాలెట్

అమెజాన్ వాలెట్

డిజిట‌ల్ లావాదేవీల సంఖ్య‌ పెంచేందుకు గాను డిసెంబ‌రులో అమెజాన్ డిజిట‌ల్ వాలెట్‌ను ప్రారంభించింది. అయితే ఇన్ని రోజులు అమెజాన్ వెబ్‌సైట్‌,యాప్ సంబంధిత చెల్లింపుల‌కు మాత్ర‌మే దీన్ని వినియోగించారు. ఇక‌పై దీన్ని సాధార‌ణ ప్ర‌జ‌లంద‌రికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. అమెజాన్ అంత‌ర్జాతీయ స్థాయి అనుభ‌వం క‌లిగిన సంస్థ‌. పాశ్చాత్య దేశాల్లో ఎదురైన ప‌లు అనుభ‌వాల‌తో అన‌తికాలంలోనే ఇది ప్ర‌జ‌ల్లోకి చొచ్చుకుపోయే వీలుంది.

అమెజాన్ స్పంద‌న‌

అమెజాన్ స్పంద‌న‌

రిజర్వు బ్యాంకు నుంచి తమకు పిపిఐ లైసెన్సు లభించిందని వెల్లడించేందుకు ఎంతగానో సంతోషిస్తున్నామని, ఇక తమ వినియోగదారులకు సౌకర్యవంతంగా, నమ్మకంగా నగదు రహిత చెల్లింపుల సేవలను అందించడంపై దృష్టి కేంద్రీకరిస్తామని అమెజాన్ ఇండియా బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అమెజాన్ లైసెన్స్‌కు సంబంధించి మింట్ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. మింట్‌తో మాట్లాడుతూ అమెజాన్ ఇండియా చెల్లింపుల విభాగ ఉపాద్య‌క్షుడు శ్రీ‌రామ్ జ‌గ‌న్నాథ‌న్ పై విష‌యాల‌ను వెల్ల‌డించారు. సుల‌భ‌త‌ర కేవైసీ విధానంలో వినియోగ‌దారు త‌నిఖీ పూర్తిచేసి తక్కువ ప‌రిమితి గ‌ల వ్యాలెట్ సేవ‌ల‌ను కొన‌సాగించ‌డానికి త‌మ కృషి కొనసాగ‌నుంద‌ని ఆయ‌న చెప్పారు.

అమెజాన్ వాలెట్ ద్వారా ఏమి చేయ‌వ‌చ్చు?

అమెజాన్ వాలెట్ ద్వారా ఏమి చేయ‌వ‌చ్చు?

ఇప్ప‌టి వ‌ర‌కూ అమెజాన్ పే పేరుతో క్లోజ్‌డ్ వాలెట్ సేవ‌ల‌ను మాత్ర‌మే అందిస్తున్న‌ది. ఈ విధానంలో క‌స్ట‌మ‌ర్లు పేటీఎమ్ లాగా అమెజాన్ పేలో ముంద‌స్తుగా త‌మ వాలెట్‌ను రీచార్జీ చేసుకోవాలి. ఆ త‌ర్వాత ఆ సొమ్మును అమెజాన్ కొనుగోళ్ల‌కు చెల్లించేందుకు వాడుకోవ‌చ్చు. ఇక‌పై అలా కాకుండా అమెజాన్ యాప్‌,వెబ్‌సైట్ కాకుండా ప్ర‌త్యేకంగా అమెజాన్ వాలెట్ యాప్ ప్ర‌వేశ‌పెడ‌తారు. ఇందులో బ‌స్సు,రైలు,విమాన టిక్కెట్ల కొనుగోలుకు అవ‌కాశ‌మిస్తారు. అంతే కాకుండా థ‌ర్డ్ పార్టీ బిల్లు చెల్లింపులు సైతం చేయ‌వ‌చ్చు.

 తీవ్ర పోటీలో ప్ర‌త్య‌ర్థులు

తీవ్ర పోటీలో ప్ర‌త్య‌ర్థులు

ఇప్ప‌టికే నిధుల విస్త‌ర‌ణ‌తో వినియోగ‌దారుల‌ను పెంచుకునేందుకు మార్కెట్లో ఉన్న వాలెట్లు తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నాయి. అలీబాబా ప్ర‌దాన ఇన్వెస్ట‌ర్‌గా ఉన్న పేటీఎమ్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విస్త‌రించేందుకు ప్ర‌ణాళిక‌లు రచిస్తోంది. ఇక‌పై అమెజాన్ వాలెట్ ప్రారంభ‌మైతే ఉన్న క‌స్ట‌మ‌ర్ల‌ను కాపాడుకోవ‌డ‌మే పేటీఎమ్‌కు స‌వాలుగా మార‌నుంది. అంతే కాకుండా ఒక‌వైపు బ్యాంకులు సైతం త‌మ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ల‌ను వాడుకునేలా త‌మ వినియోగ‌దారుల‌ను ప్రోత్స‌హిస్తున్నాయి. అందుకోసం ప‌లు ఆఫ‌ర్ల‌ను సైతం ఇస్తున్నాయి. ఎంతో రిటైల‌ర్ బేస్ క‌లిగిన అమెజాన్‌కు వాలెట్ సేవ‌ల‌ను విస్త‌రించ‌డం న‌ల్లేరు మీద న‌డ‌కే. వాలెట్ ప్రచారానికి సైతం ఎంతో డ‌బ్బు ఖ‌ర్చు పెట్టేందుకు అమెజాన్ వెనుకాడ‌క పోవ‌చ్చ‌నేది విశ్లేష‌కుల అంచ‌నా. అమెజాన్ వాలెట్‌తో మిగ‌తా కంపెనీల ప్ర‌ణాళిక‌లు ఏ విధంగా ఉంటాయ‌న్న‌ది వేచి చూడాలి.

English summary

Amazon Receives RBI approval to launch its own wallet in India

Amazon India is set to join the fast-emerging digital wallets business in India with the Reserve Bank of India’s (RBI) approval to launch its own digital wallet in India.
Story first published: Friday, April 14, 2017, 12:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X