For Daily Alerts
ఆఫ్‌లైన్ అమ్మకాల కోసం ఐడియా మనీతో జట్టుకట్టిన షాప్‌క్లూస్
ఆఫ్‌లైన్ అమ్మకాల కోసం ఐడియా మనీతో జట్టుకట్టిన షాప్‌క్లూస్ ఈ-కామర్స్ వెబ్‌సైట్లో ఉన్న ఉత్పత్తులను ఆఫ్‌లైన్ రిటైలర్లకు అమ్మేందుకు, ఆఫ్‌లైన్ అమ్మకందార్లు సైతం వెబ్‌సైట్ ద్వారా తమ ఉత్పత్తుల
|
ఈ-కామర్స్ వెబ్‌సైట్లో ఉన్న ఉత్పత్తులను ఆఫ్‌లైన్ రిటైలర్లకు అమ్మేందుకు, ఆఫ్‌లైన్ అమ్మకందార్లు సైతం వెబ్‌సైట్ ద్వారా తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచేందుకు షాప్‌క్లూస్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా డిజిటల్ వాలెట్ ఐడియా మనీతో జట్టుకట్టింది.
రిటైల్ అసిస్టెడ్ విధానంలో స్థానిక రిటైలర్ల ద్వారా షాప్‌క్లూస్ సంస్థకు చెందిన ఉత్పత్తులను ఐడియా మనీ అమ్మకం చేస్తుందని రెండు సంస్థల సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ఎవరైనా వినియోగదారులు ఉత్పత్తులు కొన్న వెంటనే ఐడియా మనీ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఐడియాకు ఉన్న రిటైల్ స్టోర్ల ద్వారా టైర్-3,4 మార్కెట్లలో షాప్‌క్లూస్ విస్తరించేందుకు ఇది దోహదం చేస్తుంది. ఐడియాకు దేశవ్యాప్తంగా 18 లక్షల రిటైలర్లు ఉన్నారు.
Comments
English summary
ఆఫ్‌లైన్ అమ్మకాల కోసం ఐడియా మనీతో జట్టుకట్టిన షాప్‌క్లూస్ | Idea Money, Shopclues Partner To Sell Products Offline
Story first published: Tuesday, April 11, 2017, 17:09 [IST]