For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ. 2 ల‌క్ష‌ల‌కు మించిన డిపాజిట్ల‌ను ఐటీఆర్ ఫారంలో వెల్ల‌డించాల్సిందే...

నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో ఎవ‌రైనా రూ.2 ల‌క్ష‌లు అంత‌కంటే ఎక్కువ విలువ క‌లిగిన సొమ్మును డిపాజిట్ చేసి ఉంటే ఆ వివ‌రాల‌ను కొత్త ఐటీఆర్ ఫారంలో తెలపాల్సిందేన‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది.

|

నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో విప‌రీతంగా అక్ర‌మ డిపాజిట్లు జ‌రిగాయ‌ని ప్ర‌భుత్వం వద్ద స‌మాచారం ఉంది. దాంతో వివిధ ఆదాయ వెల్ల‌డి ప‌థ‌కాల ద్వారా అక్ర‌మ ధ‌న వివ‌రాలు వెల్ల‌డించాల‌ని కోరింది. అయిన‌ప్ప‌టికీ చాలా మంది వాటి వివ‌రాల‌ను దాచిపెట్టారు. ఈ నేప‌థ్యంలో ఆదాయపు ప‌న్ను శాఖ ద్వారా ప్ర‌భుత్వం స‌రికొత్త పంథాను అనుస‌రిస్తోంది. నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో ఎవ‌రైనా రూ.2 ల‌క్ష‌లు అంత‌కంటే ఎక్కువ విలువ క‌లిగిన సొమ్మును డిపాజిట్ చేసి ఉంటే ఆ వివ‌రాల‌ను కొత్త ఐటీఆర్ ఫారంలో తెలపాల్సిందేన‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది.

 రూ. 2 ల‌క్ష‌ల‌కు మించిన డిపాజిట్ల‌ను ఐటీఆర్ ఫారంలో వెల్ల‌డించాల్సిందే...

చాలా మందికి ప్ర‌స్తుతం ఒకే పేజీని క‌లిగిన రిట‌ర్ను ఫారంను ఐటీ శాఖ అందుబాటులో ఉంచింది. పార్ట్ ఈలో ప‌న్ను చెల్లింపుదారు బ్యాంక్ వివ‌రాల‌ను కోరుతోంది. దాని త‌ర్వాతే మరో గ‌డిలో నవంబ‌రు 9 నుంచి డిసెంబ‌రు 30 మ‌ధ్య రూ. 2 ల‌క్ష‌లు, అంత‌కు మించి చేసిన డిపాజిట్ వివ‌రాల‌ను న‌మోదు చేయాల్సిందిగా కోరుతున్నారు. దీంతో అక్ర‌మ డిపాజిట్లను చేసిన వారికి గుండె గుబులుమంటోంది. ఒక‌వేళ ఇప్పుడు ఆ వివ‌రాల‌ను స‌మ‌ర్పించ‌క‌పోయినా పాన్ కార్డు, ఆధార్ సాయంతో వాట‌న్నింటినీ క్రోడిక‌రించే ప‌నిలో ఆదాయ‌పు ప‌న్ను శాఖ నిమ‌గ్న‌మైంది. ఇందుకు ఆర్‌బీఐ సైతం స‌హ‌క‌రించే వీలుంది.

Read more about: deposit notes ban income tax
English summary

రూ. 2 ల‌క్ష‌ల‌కు మించిన డిపాజిట్ల‌ను ఐటీఆర్ ఫారంలో వెల్ల‌డించాల్సిందే... | disclose deposits of Rs 2 lakh and above in ITR forms

Taxpayers who deposited Rs 2 lakh or more post demonetisation, will have to make this disclosure in the new Income Tax Returns (ITRs) forms notified today.The information has to be furnished in the new one-page, simplified ITR-1 'Sahaj' for taxpayers who have income from salary, a house property or earn interest totalling upto Rs 50 lakh
Story first published: Saturday, April 1, 2017, 12:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X