For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

న‌గ‌దు లావాదేవీల‌పై ప్ర‌భుత్వం కొర‌డా !

నగదు లావాదేవీల పరిమితి మూడు నుంచి రెండు లక్షలకు కుదించాలని ప్రతిపాదించటం ద్వారా ఎన్డీయే ప్రభుత్వం సంచలనం సృష్టించింది. నగదు లావాదేవీలను మూడు లక్షలకు పరిమితం చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ

|

నగదు లావాదేవీల పరిమితి మూడు నుంచి రెండు లక్షలకు కుదించాలని ప్రతిపాదించటం ద్వారా ఎన్డీయే ప్రభుత్వం సంచలనం సృష్టించింది. నగదు లావాదేవీలను మూడు లక్షలకు పరిమితం చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌లో ప్రతిపాదించటం తెలిసిందే. అయితే దీన్ని రెండు లక్షలకు పరిమితం చేస్తూ కేంద్రం మంగళవారం ఆర్థిక బిల్లుకు సవరణ ప్రతిపాదించింది. దీనికి సంబంధించి మ‌రిన్ని అస‌క్తి క‌ర అంశాలు తెలుసుకుందాం.

ఏప్రిల్ 1 నుంచి రూ.2 ల‌క్ష‌లే...

ఏప్రిల్ 1 నుంచి రూ.2 ల‌క్ష‌లే...

నగదు పరిమితి కుదింపు అంశం ఏప్రిల్ 1నుంచి అమల్లోకి వస్తుంది. రెండు లక్షలకంటే ఎక్కువ నగదు ఆమోదించే వారికి అంతేస్థాయి నగదు జరిమాన విధిస్తారు. అక్రమ లావాదేవీలు అదుపు చేయటంతోపాటు అవినీతిని అరికట్టేందుకే నగదు లావాదేవీలను రెండు లక్షలకు పరిమితం చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది.

బ‌డ్జెట్లో అలా... ఇప్పుడిలా...

బ‌డ్జెట్లో అలా... ఇప్పుడిలా...

నగదు లావాదేవీలను మూడు లక్షలకు పరిమితం చేస్తామని బడ్జెట్‌లో చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు మనసు మార్చుకుని కుదింపుప్రతిపాదన చేస్తుందనేది వెల్లడించలేదు. నగదు లావాదేవీల నియంత్రణ కోసమే ఈ పరిమితి విధిస్తున్నట్టు రెవెన్యూ కార్యదర్శి హస్‌ముఖ్ ఆధియా చెబుతున్నారు. నగదు లావాదేవీలపై పరిమితి విధించాలని నల్లధన నియంత్రణపై సిఫార్సులు చేసేందుకు నియమించిన సిట్ సూచించిన సంగ‌తి తెలిసిందే.

పార్టీల విరాళాల విష‌యంలో

పార్టీల విరాళాల విష‌యంలో

బ‌డ్జెట్ సంద‌ర్భంగా రాజ‌కీయ పార్టీల విరాళాల‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న ఆస‌క్తిక‌రంగా మారింది. ట్యాక్స్ ఇన్సెంటివ్‌ల‌ను నాలుగు విధాలుగా జైట్లీ ప్ర‌తిపాదించారు. చెక్కుల ద్వారా చెల్లింపులు, రాజ‌కీయ పార్టీల‌కు న‌గ‌దు రూ.20 వేలు కాకుండా రూ. 2 వేల వ‌ర‌కూ మాత్రమే న‌గ‌దు చెల్లింపులు జ‌రిగేలా ప్ర‌క‌టించారు. ఇంకా మూడోది చెల్లింపుల‌న్నీ ఆన్‌లైన్లో జ‌రిగేలా, అంతే కాకుండా ఎల‌క్ట్రోర‌ల్ బాండ్ల‌ను సైతం ప్ర‌తిపాదించారు.

అభ్యంత‌ర పెడుతున్న ప్ర‌తిప‌క్షాలు

అభ్యంత‌ర పెడుతున్న ప్ర‌తిప‌క్షాలు

ఆర్థిక బిల్లుకు ప్ర‌భుత్వం ప్ర‌తిపాదిస్తున్న స‌వ‌ర‌ణ‌లు ఎంత‌మాత్రం స‌మ‌ర్థ‌నీయం కాద‌ని టీఎంసీ, బీజేడీ, ఆర్‌ఎస్పీ త‌దిప‌ర పార్టీలు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్నాయి. స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజాన్ ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను కొట్టిపారేస్తూ ప్ర‌భుత్వ స‌వ‌ర‌ణ‌ల‌న్నీ మ‌నీ బిల్లు ప‌రిధిలోకి వ‌స్తాయి కాబ‌ట్టి వాట‌న్నింటినీ ఆర్థిక బిల్లులో చేర్చ‌డం ఎలాంటి త‌ప్పులేద‌ని స్ప‌ష్టం చేశారు. అంతేకాకుంఆ ఆర్థిక బిల్లుకు స‌వ‌ర‌ణలు ప్ర‌తిపాదించే అధికారి ప్ర‌భుత్వానికి ఉంటుంద‌ని అరుణ్ జైట్లీ ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను స‌మ‌ర్థించుకున్నారు.

Read more about: cash digital online arun jaitley
English summary

న‌గ‌దు లావాదేవీల‌పై ప్ర‌భుత్వం కొర‌డా ! | The government proposed to lower cap for cash transactions to Rs 2 lakh from April 1

The government today proposed to lower cap for cash transactions to Rs 2 lakh from April 1. In supporting these acts government made proposals to amend finance bill 2017. Jaitley justified the move, saying the amendments were all "incidental provisions" to the Finance Bill and relate to Budget announcements like combining some tribunals and creating uniform service conditions.Among the most important amendments was one relating to his 1 February proposal to limit cash transaction to Rs 3 lakh. This cap is now proposed to be lowered to Rs 2 lakh, at par with the current requirement of quoting permanent account number (PAN) for cash spendings.
Story first published: Wednesday, March 22, 2017, 17:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X