For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోట్ల ర‌ద్దు ప్ర‌భావంతో 5 ఏళ్ల క‌నిష్టానికి ప‌డిపోయిన సిమెంట్ ఉత్ప‌త్తి

నోట్ల రద్దుతో చిన్నాచిత‌కా వ్యాపారాలు చితికిపోవ‌డంతో కీల‌క రంగాలు కుదేలైన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రో ఆశ్చ‌ర్య‌క‌ర వాస్త‌వం వెలుగుచూసింది. 2016-17 సంవ‌త్స‌ర సిమెంట్ ఉత్ప‌త్తి చూస్తే చాలా విస్తుగొల

|

నోట్ల రద్దుతో చిన్నాచిత‌కా వ్యాపారాలు చితికిపోవ‌డంతో కీల‌క రంగాలు కుదేలైన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రో ఆశ్చ‌ర్య‌క‌ర వాస్త‌వం వెలుగుచూసింది. 2016-17 సంవ‌త్స‌ర సిమెంట్ ఉత్ప‌త్తి చూస్తే చాలా విస్తుగొలిపే అంశాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. విశ్లేష‌కుల అంచ‌నా ప్ర‌కారం 2017 జ‌న‌వ‌రి సిమెంట్ ఉత్ప‌త్తి గ‌ణాంకాల‌ను చూస్తే జ‌న‌వ‌రి 2001 త‌ర్వాత అత్యంత క‌నిష్టానికి దిగ‌జారింది. మొద‌టిసారి నోట్ల ర‌ద్దు త‌ర్వాత న‌వంబ‌రు నెల‌లో సిమెంట్ ఉత్ప‌త్తి వృద్ది రేటు 0.5% త‌గ్గింది. త‌ర్వాత డిసెంబ‌రులో 0.9% క్షీణించింది. త‌ద్వారా 2017 ఆర్థిక సంవ‌త్స‌రం మొద‌టి 9 నెల‌ల ఉత్ప‌త్తి 2.9% త‌గ్గిన‌ట్ల‌యిందని యాంబిట్ క్యాపిట‌ల్ లెక్క‌గ‌ట్టింది.

 5 ఏళ్ల క‌నిష్టానికి ప‌డిపోయిన సిమెంట్ ఉత్ప‌త్తి

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ప్ర‌కారం జ‌న‌వ‌రి సిమెంట్ ఉత్ప‌త్తి గ‌తేడాది అదే స‌మ‌యంతో పోలిస్తే 13% త‌గ్గుముఖం ప‌ట్టింది. దీంతో ఉత్ప‌త్తి ప‌రిమాణం ప‌రంగా చూస్తే ఈ రంగం క్షీణ‌త‌ను చూప‌గ‌ల‌ద‌ని విశ్లేష‌కులు అంకూర్ కుల్‌శ్రేష్ఠ‌, స‌ర్ఫరాజ్ సింగ్ మార్చి 2 నివేదిక‌లో పొందుప‌రిచారు. సిమెంట్ డిమాండ్ 2017 ఆర్థికంలో 10 ఏళ్ల క‌నిష్టానికి వెళ్లిన‌ప్ప‌టికీ రేట్లు మాత్రం 5% పెరిగాయి. ఎందుకంటే ఇది స‌ప్లై, డిమాండ్ పెంపుపైన ఆధార‌ప‌డి ఉంటాయని యాంబిట్ క్యాపిట‌ల్ విశ్లేష‌కులు నితిన్ భాసిన్‌, ప‌రితా ఆశార్ ఫిబ్ర‌వ‌రి నెల‌లో రూపొందించిన నివేదికలో పేర్కొన్నారు.

Read more about: cement production ultratech notes
English summary

నోట్ల ర‌ద్దు ప్ర‌భావంతో 5 ఏళ్ల క‌నిష్టానికి ప‌డిపోయిన సిమెంట్ ఉత్ప‌త్తి | cement production in January went to record lows after 2001

Cement production in 2016-17 is likely to see a year-on-year (y-o-y) decline for the first time since 2001 as the 8 November demonetisation hit the building sector, analysts said.After the government’s demonetisation move, cement production growth slowed to 0.5% in November and fell 9% in December—taking production growth for the first nine months of FY17 to a mere 2.6%, according to Ambit Capital
Story first published: Monday, March 6, 2017, 16:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X