English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

వాలెంటైన్స్ డే స్పెష‌ల్‌: ప‌్రేమ ప‌క్షుల‌కు ప్ర‌త్యేక ఆఫ‌ర్లు

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

పురాత‌న కాలం నుంచి కొన్ని అవ‌స‌రాల కోసం మ‌నిషి ప‌రిత‌పిస్తున్నాడు. భూమి- ఆడ‌వాళ్లు, ఆడ‌వాళ్లు- అధికారం, ఆడ‌వాళ్లు-ఆహారం, సామాజిక క‌ట్ట‌బాట్లు, ఆడ‌వాళ్లు-ఆయుధాలు, ప్లే స్టేష‌న్‌, ఎక్స్‌బాక్స్ మ‌రియు ఆడ‌వాళ్లు సైతం. కాలం గ‌డిచే కొద్దీ వీటిలో కొన్నింటిపై మ‌నిషి ప‌ట్టు సాధించాడు. భూమి, ఆహారం నుంచి ఆయుధాల వ‌ర‌కూ అంద‌రికీ ఈజీగా దొరుకుతున్నాయి. అయితే ఆడ‌దాని ప్రేమ పొందేందుకు మాత్రం నానా క‌ష్టాలు ప‌డాల్సి వ‌స్తోంది. మీకు అమ్మాయిల నుంచి ఫేస్‌బుక్‌లో లైక్‌లు తెచ్చుకునేందుకు సత్తా ఉందేమో. కానీ నిజంగా అమ్మాయిల మ‌న‌సులు చూర‌గొన‌డం అంత సులువు ఏమీ కాద‌ని చాలా మందికి తెలుసు. మీరు ప్ర‌య‌త్నించారా! లేదా అయితే ఇంకా చ‌ద‌వండి. వ‌న్ ఇండియా కూప‌న్ల కోసం

మీరు ఫిబ్ర‌వ‌రి నెల‌లో ఎంతో ఆశ‌గా ప్రేమికుల రోజు కోసం ఎదురు చూసి ఉండొచ్చు. ధైర్యం చాల‌కో, అన్నీ కుద‌ర‌కో ప్రేమ‌ను వ్య‌క్తీక‌రించి ఉండ‌క‌పోవ‌చ్చు. ప్రేమ‌ను కొంత మంది మాట‌ల్లో వ్య‌క్త‌ప‌రిస్తే కొంత మంది వ‌స్తువుల సాయంతో చేస్తారు. అంద‌రికీ కామ‌న్‌గా ప్రేమ‌ను వ్య‌క్తీక‌రించేందుకు వీలుగా ఇక్క‌డ కొన్ని టిప్స్ ఇస్తున్నాం. ఇవి మీకు ప‌నికొస్తాయామో ప్ర‌య‌త్నించండి.

వాలెంటైన్స్ డే స్పెష‌ల్‌: ప‌్రేమ ప‌క్షుల‌కు ప్ర‌త్యేక ఆఫ‌ర్ల

1. నేరుగా ఆ వ్య‌క్తిని ఆపాదిస్తూ చేయండి

ఇక్క‌డ ప‌ర్స‌న‌ల్(వ్య‌క్తి) అంటే పెద్ద‌గా తిక‌మ‌క ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఒక రోజును మీ ఇద్ద‌రిదిగానే ఉండేలా ప్ర‌య‌త్నించండి. ఎదుటి వ్య‌క్తి కోసం ఆ రోజును ప్ర‌త్యేకంగా కేటాయించండి. అప్పట్లో ఫోన్లో మాట్లాడేట‌ప్పుడు మీరు ఎన్నో ప్రామిస్‌లు చేసి ఉండొచ్చు. మ‌రిచిపోలేని ఒక రోజును నీకిస్తా అని చెప్పి ఉండొచ్చు. కానీ ఎందుకో ఇద్ద‌రికీ కుద‌ర‌క ఆమె లేదా అత‌డు మీపై కోపంగా ఉండొచ్చు. స‌మ‌యం చిక్కిన‌ప్పుడ‌ల్లా అదే విష‌యాన్ని గుర్తుచేస్తూ దెప్పి పొడుస్తూ ఉండొచ్చు. అందుకే మీదైన రోజు కోసం ఇంకా ఎంతో కాలం వేచిచూడొద్దు.

2. సోష‌ల్ మీడియాలో దాని గురించి ప్ర‌చారం వ‌ద్దు

దీని గురించి మీకు ఎక్కువ‌గా చెప్పవ‌ల‌సిన అక్క‌ర్లేదు. ఆ ప్ర‌త్యేక‌త‌ను మీ ఇద్ద‌రి మ‌ధ్యే దాగేలా చూస్తే మంచిది.

3. అనుకోని ట్రిప్‌ను ప్లాన్ చేయండి, ఇద్ద‌రూ క‌లిసి ఎక్క‌డికైనా వెళ్లండి

మీరు చార్మినార్ వెళ్లాల‌నే, ఆర్కే బీచ్‌లో ప్ర‌త్యేక హోట‌ల్‌కో వెళ్లాల‌నో కాదు. అక్క‌డెక్క‌డికో వెళ్లి ఒక సెల్ఫీ దిగి దాన్ని సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేసి క్లిక్‌లు, లైక్లు తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు. స‌రైన ట్రిప్‌ను ప్లాన్ చేయండి. ఎక్క‌డికైనా స‌రే, ఏకాంత‌త‌కు ప్రాముఖ్య‌త‌నివ్వాలి. అయ్యో! త‌క్కువ డబ్బు ఉందే, టైమ్ లేదే అని చింతించాల్సిన అక్క‌ర్లేదు. మీ కోస‌మే మేమున్నాం. వ్యాలెంటైన్ కూప‌న్ల కోసం

4. ఈ సినిమా టిక్కెట్ల కోసం ఇలా చేయండి

ఈ వ్యాలెంటైన్స్ డే సంద‌ర్భంగా రిలీజ్ అయిన సినిమాకు ఇద్ద‌రూ క‌లిసి వెళ్లొచ్చు. డెడెపూల్ త‌ర్వాత జాన్ విక్‌2, జాలీ ఎల్ఎల్‌బీ లాంటి ఏదైనా ప్ర‌త్యేక సినిమా చూడొచ్చు. దీనికి ఎవ‌రూ నో చెప్ప‌రు క‌దా! అందులోనూ మ‌న తెలుగువాళ్లు సిని ప్రేమికులు క‌దా గురూ...

5. ఆమె అంటే ఎందుకిష్ట‌మో తెలియ‌జేయండి

అవును. మేమంటుంది అదే. అదేదో సినిమా డైలాగో, ప్రేమ క‌విత్వ‌మో అక్క‌ర్లేదు. త‌నంటే మీకు ఎందుకు ఇష్ట‌మో, త‌న‌లో మీకు అమితంగా న‌చ్చిన అంశ‌మేదో ఉంటుది క‌దా. దాన్ని బ‌య‌ట పెట్టండి. రాత‌లో నైపుణ్యం ఉంటే పద్యం రాయొచ్చు. పొడి పొడి ప‌దాలు వాడండి. లేదా మంచి క‌ళాకారుడైతే పెయింటింగ్ వేయ‌వ‌చ్చు. అయితే ఆ రోజును ఆమెకే ప్ర‌త్యేకించార‌ని చేసేలా ఉండాలి మీరు చేసే ఏ ప‌నైనా. మీరు ఎన్నైనా చెబుతారు. మా ద‌గ్గ‌ర ఎలాంటి నైపుణ్యాలు లేక‌పోతే ఎలా? ప్రేమ‌ను మ‌ంచిగా వ్య‌క్త‌ప‌రిచే బ‌హుమ‌తే ఇవ్వాల‌ని అనుకుంటున్నారా? కానీ అంద‌రూ ఖ‌రీదైన గిఫ్ట్‌లు కొని ఇవ్వ‌లేక‌పోవ‌చ్చు. మీకు మంచి ఆఫ‌ర్ కావాల‌ని మేము అర్థం చేసుకున్నాం. ఈ విధంగా మీరు పొదుపు చేసేందుకు మేము స‌హ‌క‌రిస్తాం.

కాబ‌ట్టి, చివ‌రికి ఈ ఐదింటిలో ఏదో ఒక‌టి మీకు న‌చ్చింద‌ని భావిస్తున్నాం. మీదైన ప్ర‌త్యేక రోజును సెల‌బ్రేట్ చేసుకునేందుకు సిద్ద‌మ‌వండి. అంద‌రికీ బిలేటెడ్ వ్యాలెంటైన్స్ డే! ఇంకేంటి దూసుకెళ్లండి మ‌రి...

  మ‌రిన్ని ఆఫ‌ర్లు, కూప‌న్ల కోసం గుడ్‌రిట‌ర్న్స్ తెలుగును వీక్షించండి.

Read more about: coupons, కూప‌న్లు
English summary

Tell her that you love her in your own way using these coupons

Make that extra effort from your end to make her day special, rather than simply permanently borrowing stuff in exchange for money from others, for this. However, if this does not appeal to you, and all you are thinking about this, “Screw you guys. I need something where I can show off my Scrooge McDuck wealth and impress her with the best thing money can buy, but it would be great if you can help me save. Help me save. Pretty please help me save!”, then of course we will help you in saving as much as we can.
Story first published: Thursday, February 16, 2017, 15:31 [IST]
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC