For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.3 లక్షల వరకే నగదు

ఆర్థిక వ్యవస్థలో నగదు లావాదేవీలను తగ్గించేందుకు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఈ బడ్జెట్‌లో స్పష్టమైన చర్యలు ప్రకటించారు. ముఖ్యంగా ఇక ఏ ఆర్థిక లావాదేవీ విలువైనా రూ.3 లక్షలు దాటితే చెక్కు లేదా డిజిటల్‌ చ

|

న‌గ‌దు రూ. 3 ల‌క్ష‌ల‌కు మించ‌రాదు

దేశంలో నల్లధనాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా రూ.3 లక్షలు దాటిన నగదు లావాదేవీలపై ఏప్రిల్‌ నుంచి నిషేధం విధించాలని యోచిస్తున్నట్టుగా ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. దానికి సంబంధించిన విధివిధానాల‌ను ఆర్థిక శాఖ‌, రెవెన్యూ కార్య‌ద‌ర్శి వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాల‌ను ఇక్క‌డ తెలుసుకుందాం.

రాజకీయ పార్టీలూ ఇక‌పై డిజిట‌ల్ రూపేణా

రాజకీయ పార్టీలూ ఇక‌పై డిజిట‌ల్ రూపేణా

ముఖ్యంగా ఇక ఏ ఆర్థిక లావాదేవీ విలువైనా రూ.3 లక్షలు దాటితే చెక్కు లేదా డిజిటల్‌ చెల్లింపుల పద్దతిలో చేయాలి. అలాగే రూ.2,000 మించిన విరాళాలను రాజకీయ పార్టీలు చెక్కులు లేదా ఇతర ఎలక్ర్టానిక్‌ చెల్లింపుల పద్దతిలో స్వీకరించాలి.నల్లధనం నివారణకు ఎం.బి.షా నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్‌ జులైలో చేసిన సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా జైట్లీ వివరించారు. పన్ను పరిధిలోకి రాని చాలా సొమ్ము భారీగా నగదు రూపంలో నిలువచేసి ఉన్నట్టుగా ఆయన పేర్కొన్నారు. త్వరలోనే రూ.3 లక్షలు దాటిన నగదు లావాదేవీలపై నిషేధం విధించే విషయమై తొందరలోనే ఒక చట్టాన్ని రూపొందించి వెల్లడించనున్నట్టుగా తెలిపారు. ఈ పరిధి దాటిన లావాదేవీలు చట్టవిరుద్ధమని ప్రకటిస్తామన్నారు.

పరిధి దాటితే రెట్టింపు పెనాల్టీ..

పరిధి దాటితే రెట్టింపు పెనాల్టీ..

3 లక్షలకు మించి నగదు లావాదేవీలు జరిపితే ఇకపై భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంతే మొత్తం(100శాతం) జరి మానా రూపంలో సమర్పించుకోవాల్సి వస్తుంది. ఈ నిబంధన వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నట్టు రెవెన్యూ వ్యవహారాల విభాగం కార్యదర్శి హస్ముఖ్‌ అధియా తెలిపారు.

న‌గ‌దు తీసుకున్న వారికి ఇబ్బందులు

న‌గ‌దు తీసుకున్న వారికి ఇబ్బందులు

నల్లధనానికి చెక్‌పెట్టేందుకు రూ.3 లక్షలు, అంతకు మించి నగదు లావాదేవీలను నిషేధించే సెక్షన్‌ను ఐటీ చట్టంలో ప్రతిపాదిస్తూ 2017-18 కేంద్ర బడ్జెట్‌ సందర్భంగా అరుణ్‌జైట్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయమై అధియా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ... రూ.3 లక్షలకు మించి నగదు తీసుకుంటే, దానికి సమాన మొత్తంలో తీసుకున్న వారు జరిమానా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఉదాహరణకు రూ.4 లక్షల నగదు లావాదేవీ జరిపితే జరిమానా రూ.4 లక్షలు చెల్లించాలని, రూ.50 లక్షల లావాదేవీ అయితే జరిమానా రూ.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎవరైనా ఒకరు ఖరీదైన వాచీని నగదుపై కొనుగోలు చేస్తే షాపు నిర్వాహకుడే పన్ను చెల్లించాల్సి ఉంటుందని అధియా తెలిపారు. ఈ నిబంధన భారీ నగదు లావేదేవీల విషయంలో వెనక్కి తగ్గేలా చేస్తుందన్నారు. ఇది కూడా చ‌ద‌వండి కార్లు ముద్దంట ప‌న్ను వ‌ద్దంట‌

100 శాతం పెనాల్టీ

100 శాతం పెనాల్టీ

బడ్జెట్‌లో నగదు లావాదేవీలపై విధించిన రూ.3 లక్షల పరిమితిని దాటి లావాదేవీలు జరిపితే వాటిపై భారీగా అపరాధ రుసుమును వసూలు చేసే యోచనలో ఉన్నట్టుగా రెవెన్యూ సెక్రెటరీ హస్ముఖ్‌ ఆదియా తెలిపారు. ప్రభుత్వం నిర్ధేశించిన పరిధి దాటి నగదు లావాదేవీలు జరిపితే అలాంటి వాటిపై 100శాతం పెనాల్టీని విధించనున్నట్టుగా ఆయన వివరించారు. దీనికి తోడు ఇలాంటి వ్యయాన్ని ఆదాయపు పన్ను పరిధిలో తగ్గించి చూపడానికి కూడా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఇది కూడా చ‌ద‌వండి ప‌న్ను మినహాయింపుల కోసం 80సీ కాకుండా

Read more about: cash digital online arun jaitley
English summary

రూ.3 లక్షల వరకే నగదు | No Cash Transactions Above 3 Lakhs From April

No Cash Transactions Above 3 Lakhs From April, Says GovernmentIn a major step to check corruption and tax evasion, transactions above Rs. 3 lakh will not be allowed in cash, Finance Minister Arun Jaitley said today while announcing the union budget 2017.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X