For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐడీఐ సూచీలో చైనా, పాక్‌ల కంటే వెనుక‌బ‌డిన‌ భార‌త్‌

|

ఏ దేశ‌మ‌యినా ముందుకెళ్లాలంటే స‌మ్మిళిత అభివృద్ది జోరుగా సాగాలి. అంటే ప్ర‌భుత్వం అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకుని పోతూ అట్ట‌డుగు వ‌ర్గాల వారి సంప‌ద‌ను పెంచే ప్ర‌యత్నం చేయాలి. అయితే భార‌త్ ఈ విష‌యంలో త‌న వెనుక‌బాటును ప్ర‌ద‌ర్శిస్తూనే ఉంది. అభివృద్ది చెందుతున్న‌ 79 దేశాలను పరిశీలించినప్పుడు సమ్మిళిత అభివృద్ధి సూచీ (ఐడీఐ)లో భారత్‌కు 60వ స్థానంలో ఉంది. చైనా, పాకిస్థాన్‌లు ఈ విషయంలో చాలా ముందున్నాయి. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) సోమవారం ఈ మేరకు 'Inclusive Growth and Development Report 2017' పేరిట నివేదిక విడుదల చేసింది. నివేదిక‌లో పొందుప‌రిచిన కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ఇక్క‌డ తెలుసుకుందాం.

wef(డబ్ల్యూఈఎఫ్‌) :world economic forum

 ప్ర‌థ‌మ స్థానంలో లిథువేనియా

ప్ర‌థ‌మ స్థానంలో లిథువేనియా

ఆర్థికంగా అభివృద్ధి సాధించి, అసమానతల్ని తగ్గించుకునేందుకు ఉన్న కీలక అవకాశాల్ని అనేక దేశాలు కోల్పోతున్నాయని ఈ నివేదిక పేర్కొంది. కేవలం స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) లెక్కల్నే కాకుండా వృద్ధి, అభివృద్ధి, సమానత్వం, సుస్థిరత వంటి 12 ప్రామాణికాలు ఆధారంగా ఐడీఐని రూపొందించింది. దీనిలో లిథువేనియా మొద‌టి స్థానంలో; అజర్‌బైజాన్‌, హంగేరీ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రష్యా (13వ స్థానం), చైనా (15), నేపాల్‌ (27), బ్రెజిల్‌(30), బంగ్లాదేశ్‌ (36), పాకిస్థాన్‌ (52) వంటివి భారత్‌ కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. బ్రిక్స్ దేశాల్లో చూసినా ర‌ష్యా, బ్రెజిల్ మ‌న‌కంటే ముందు ఉన్నాయి. పేదరికాన్ని తగ్గించుకుంటూ, తలసరి జీడీపీ వృద్ధిలో మొదటి పది దేశాల్లో ఒకటిగా భారత్‌ ఉన్నా స‌మ్మిళిత అభివృద్దిలో మాత్రం 1 నుంచి 7 స్కోరులో 3.38 దాటలేదని డబ్ల్యూఈఎఫ్‌ తెలిపింది. రుణం, జీడీపీల నిష్పత్తి ఎక్కువగా ఉందని వివరించింది.

ట్యాలెంట్‌లో ఎన్నో ర్యాంకు..?

ట్యాలెంట్‌లో ఎన్నో ర్యాంకు..?

ప్రతిభా పాటవాల సూచీలో భారత్‌ ర్యాంకు మూడు స్థానాలు జారింది. ప్రతిభను ఆకట్టుకోవడం, దానిని నిలబెట్టుకోవడంలో వివిధ ప్రమాణాల ఆధారంగా రూపొందించిన ర్యాంకుల్లో స్విట్జర్లాండ్‌ అగ్రస్థానం, చైనా నాలుగో స్థానం దక్కించుకోగా భారత్‌ 92వ ర్యాంకుతో సరిపెట్టుకుంది.

బ్రిక్స్‌ దేశాల వరకు చూసినా చిట్టచివర స్థానమే. భారత్‌ గత ఏడాది 89వ స్థానంలో నిలిచింది. ప్రతిభను ఆకట్టుకోవడంలో 114, దానిని నిలబెట్టుకోవడంలో 104వ స్థానంలో నిలిచింది. విదేశాల నుంచి ప్రతిభావంతుల్ని ఆకట్టుకోవడం భారత్‌, చైనాలకు పెద్ద సవాల్‌ అని విశ్లేషించింది. మేధోవలస పెద్దఎత్తున కొనసాగుతోందనీ, ఆ నష్టం భారత్‌పై ప్రభావం చూపిస్తోందనీ తెలిపింది.

ప్ర‌తిభ‌ను ఆక‌ట్టుకోవ‌డంలో ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యికి చోటు

ప్ర‌తిభ‌ను ఆక‌ట్టుకోవ‌డంలో ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యికి చోటు

ప్రపంచంలో నగరాలకు కేటాయించిన ర్యాంకులతో ఓ సూచీని తొలిసారిగా విడుదల చేశారు. ప్రపంచవ్యాప్త ప్రతిభను ఆకట్టుకోవడం, ఎదగడం, ఆ ప్రతిభను నిలబెట్టుకోవడంలో నగరాల పనితీరు ఆధారంగా వీటిని రూపొందించారు. ప్రతిష్ఠాత్మకమైన ఈ జాబితాలో ఒక్క ముంబయికి మాత్రమే చోటు దక్కింది. తొలిస్థానంలో కోపెన్‌హేగన్‌ నిలిచింది. యంత్రాల రాక(మెక‌నైజేష‌న్‌)తో అనేక ఉద్యోగాలు కోల్పోయే ప‌రిస్థితి వ‌చ్చినా, సాంకేతికత అనేది కొత్త అవకాశాలను సృష్టిస్తోందని పేర్కొంది.

స‌మ్మిళిత అభివృద్దిలో వెనుక‌బాటు ఎందుకు?

స‌మ్మిళిత అభివృద్దిలో వెనుక‌బాటు ఎందుకు?

స‌మ్మిళిత అభివృద్ది అంటే వృద్ది, వెనుక‌బాటుత‌నాన్ని నిర్మూలించ‌డం, అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకుని పోవ‌డం, స్థిర‌మైన అభివృద్ది సాగాలి. 79 దేశాల్లో భార‌త్ 60వ స్థానంలో ఉండేందుకు గ‌ల ప్ర‌ధాన కార‌ణం అభివృద్ది అట్ట‌డుగు వ‌ర్గాల‌కు చేర‌క‌పోవ‌డం. ప్ర‌భుత్వ విధానాల కార‌ణంగా పేద‌లు ఇంకా నిరుపేద‌లు అవుతున్నారు. ధ‌నికులు ఇంకా కుబేరులు అవుతున్నారు. ఐడీఐలో ఇండియా స్కోర్ 3.38. త‌ల‌స‌రి జీడీపీ ప‌రంగా చూస్తే మ‌నం గొప్ప‌గానే ఉన్నాం. త‌ల‌స‌రి జీడీపీ అంటే దేశం మొత్తం జ‌నాభాతో జీడీపీని భాగిస్తే వ‌చ్చేది. ఇది బాగానే ఉంటుంది ఎందుకంటే కార్పొరేట్ల వ‌ద్ద కోట్ల సంప‌ద పోగుప‌డి ఉంది. మ‌రో వైపు పేద‌రికం రేటు మాత్రం చెప్పుకోద‌గ్గ స్థాయిలోనే ఉంది. అయితే స‌మ్మిళిత అభివృద్ది నివేదిక మాత్రం భార‌త్‌లో పేద‌రికం అధిక స్థాయిల నుంచి త‌గ్గుతున్న‌ట్లు పేర్కొన‌డం ఆనందించాల్సిన విష‌యం.

ఇది కూడా చ‌ద‌వండి ఈ 10 విష‌యాల్లో భార‌త్ దూసుకెళుతోంది

ఆటోమేష‌న్ కార‌ణంగా ఉద్యోగాలు హుష్‌...

ఆటోమేష‌న్ కార‌ణంగా ఉద్యోగాలు హుష్‌...

దేశంలో ఆటోమేషన్‌ కారణంగా పావుశాతం కంటే ఎక్కువ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోనున్నాయని... ప్రపంచ వ్యాప్తంగానూ ఆటోమేషన్‌ చాలా కంపెనీలను ప్రభావితం చేస్తుందని హెచ్‌ఆర్‌ కన్సల్టెన్సీ మ్యాన్‌పవర్‌గ్రూపు దావోస్‌లో విడుదల చేసిన నివేదికలో ప్రస్తావించింది. కొత్త సాంకేతిక‌త‌ల‌ వల్ల కంపెనీలకు, ఉద్యోగులకు ప్రత్యేక నైపుణ్యాల అవసరం ఏర్పడిందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 43 దేశాల్లో 18వేల కంపెనీలపై సర్వే చేయగా... 90% కంటే ఎక్కువే డిజిటైజేషన్‌వల్ల వచ్చే రెండేళ్లలో తమ కంపెనీలపై ప్రభావం పడనుంద‌ని పేర్కొన్నాయి.

Read more about: india development growth rate gdp wef
English summary

India Ranks At 60, Behind China, Pak In Inclusive Development Index

India has been ranked 60th among 79 developing economies, below neighbouring China and Pakistan, in the inclusive development index, according to a WEF report. WEF's 'Inclusive Growth and Development Report 2017', released, said that most countries are missing important opportunities to raise economic growth and reduce inequality at the same time because the growth model and measurement tools that have guided policymakers for decades require significant readjustment.Read more articles at telugu.goodreturns.in
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more