For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏపీ నుంచి భారీగా స్వైపింగ్ మెషీన్ల‌కు ఆర్డ‌ర్లు

ఒక్క శ్రీ‌కాకుళంలోనే 5 వేల స్వైపింగ్ మెషీన్ల‌కు ఆర్డ‌ర్లు

|

పెద్ద నోట్ల రద్దు త‌ర్వాత వ్య‌వ‌స్థ‌లో న‌గ‌దు ప్ర‌వాహం త‌గ్గింది. దీంతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ న‌గ‌దు కొర‌త నుంచి ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను తీర్చేందుకు శ్రీ‌కాకుళం జిల్లా యంత్రాంగం స‌మాయ‌త్త‌మైంది. దాదాపు అన్ని ప్ర‌భుత్వ ఏజెన్సీలు పీవోఎస్‌(పాయింట్ ఆఫ్ సేల్స్‌) మెషీన్ల కోసం అభ్య‌ర్థిస్తున్నాయి.
ఆ జిల్లా లీడ్ బ్యాంక్ అధికారులు చెపుతున్న దాని ప్ర‌కారం ఇప్ప‌టి వ‌ర‌కూ దాదాపు 5 వేల స్వైపింగ్ మెషీన్ల కోసం ఇండెంట్ల దాఖ‌లు పూర్త‌యింది.

 క్యాష్ లెస్ ఎకాన‌మీకి ఏపీ ఊతం

జిల్లా వ్యాప్తంగా ఇప్ప‌టికే 5 వేల స్వైపింగ్ మెషీన్ల కోసం ఆర్డ‌ర్లు ఇచ్చిన‌ట్లు లీడ్ బ్యాంక్ మ‌నేజ‌ర్ వెంక‌టేశ్వ‌ర‌రావు చెప్పారు. న‌గ‌దు ఇబ్బందుల నేప‌థ్యంలో చాలా వాణిజ్య సంస్థ‌లు, ప్ర‌భుత్వ ఏజెన్సీలు స్వైపింగ్ మెషీన్ల కోసం క్యూ క‌డుతున్నాయ‌ని ఆయన అన్నారు. ముఖ్యంగా హోట‌ళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ ఎక్కువ ఆస‌క్తిని చూపుతున్నాయ‌ని వెల్ల‌డించారు. "చెన్నై నుంచి రోజుకు 100 మెషీన్ల వ‌ర‌కూ వ‌స్తున్నాయి. అయితే అవి వ‌చ్చిన త‌ర్వాత సాంకేతిక త‌నిఖీలు పూర్త‌యి, సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేష‌న్ జ‌ర‌గాలి. ఆ త‌ద‌నంత‌ర‌మే వాటిని వినియోగ‌దార్ల‌కు అంద‌జేస్తాం" అని చెప్పుకొచ్చారు. వ‌చ్చే ప‌దిరోజుల్లో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అవ‌స‌ర‌మైన‌న్ని స్వైపింగ్ మెషీన్ల‌ను వ్యాపార వ‌ర్గాల‌కు అంద‌జేస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

Read more about: cash money
English summary

ఏపీ నుంచి భారీగా స్వైపింగ్ మెషీన్ల‌కు ఆర్డ‌ర్లు | Indent for 5k swiping machines placed in srikakulam district

To promote cashless transactions and bail out people from the cash shortage woes, the government agencies in Srikakulam are gearing up to procure more PoS machines.According to the lead bank authorities in the district, they have placed indent for as many as 5,000 swiping machines.
Story first published: Wednesday, November 23, 2016, 16:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X