For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వివాహాల‌కు ఎంతైనా తీసుకోవ‌చ్చు, అయితే ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి

వివాహాలు ఉన్న‌వారు రూ. 2.50 ల‌క్ష‌ల డ‌బ్బు విత్‌డ్రా చేసుకునేందుకు ఆర్‌బీఐ అనుమ‌తించింది. అయితే ఇందుకోసం కొన్ని వివ‌రాల‌తో పాటు ఒక ఫారంను నింపి ఇవ్వాల్సి ఉంద‌ని సూచించింది. డిసెంబ‌రు 30 వ‌ర‌కూ బ్యాంకు

|

వివాహాలు ఉన్న‌వారు రూ. 2.50 ల‌క్ష‌ల డ‌బ్బు విత్‌డ్రా చేసుకునేందుకు ఆర్‌బీఐ అనుమ‌తించింది. అయితే ఇందుకోసం కొన్ని వివ‌రాల‌తో పాటు ఒక ఫారంను నింపి ఇవ్వాల్సి ఉంద‌ని సూచించింది.
ఆర్‌బీఐ విధించిన ష‌ర‌తులు
1. డిసెంబ‌రు 30 వ‌ర‌కూ బ్యాంకు డిపాజిట్ అకౌంట్ల నుంచి రూ. 2.50 ల‌క్ష‌ల వ‌ర‌కూ తీసుకోవ‌చ్చు.
2. కేవైసీ వెరిఫికేష‌న్ పూర్త‌యిన ఖాతాల నుంచి మాత్ర‌మే విత్‌డ్రాయ‌ల్స్‌కు అనుమ‌తి.
3. డిసెంబ‌రు 30 లేదా అంత‌కంటే ముందు వివాహాలు ఉన్న వారి కోస‌మే ఈ విత్‌డ్రాయ‌ల్స్ స‌డ‌లింపు వ‌ర్తిస్తుంది.
4. విత్‌డ్రాయ‌ల్స్ కోసం వ‌రుడు లేదా వ‌ధువు వైపు ఎవ‌రైనా ఒక‌రినే అనుమ‌తిస్తారు.
5. తీసుకున్న డ‌బ్బు ఎవ‌రికైతే చెల్లిస్తారో వారికి బ్యాంకు అకౌంట్లు లేవ‌ని తెల‌పాల్సి ఉంటుంది.

 వివాహాల‌కు ఎంతైనా తీసుకోవ‌చ్చు, అయితే ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి

6. ద‌ర‌ఖాస్తు ఫారంతో పాటు వివాహ ఆహ్వాన‌ ప‌త్రిక, ఇదివ‌ర‌కే అడ్వాన్స్ చెల్లింపు ర‌సీదుల‌ను జ‌త‌చేయాల్సి ఉంటుంది.
7. ఎవ‌రెవ‌రికి న‌గ‌దు చెల్లింపులు చేయ‌బోతున్నారో వారి జాబితాను రాయాలి. అంతే కాకుండా వారు త‌మ‌కు బ్యాంకు ఖాతా లేద‌ని డిక్ల‌రేష‌న్ ఇవ్వాలి. జాబితాలో పేర్ల వ‌ద్దే ఏ ఉద్దేశం కోసం ఎవ‌రికి డ‌బ్బు చెల్లిస్తున్నారో వివ‌ర‌ణ‌లివ్వాలి.

ఆర్‌బీఐ అధికారిక ప‌త్రికా ప్ర‌క‌ట‌న కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Read more about: rbi cash
English summary

వివాహాల‌కు ఎంతైనా తీసుకోవ‌చ్చు, అయితే ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి | RBI allows higher cash withdrawals for weddings but with conditions

The Reserve Bank of India (RBI), on Monday, approved the withdrawal of Rs 2.5 lakh for wedding expenses, in the midst of the tight liquidity condition created by the government's demonetization move. However, in a circular published on its website, the RBI charted out a long list of particulars that will need to be followed before the aforementioned amount can be withdrawn, including a form.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X