For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన రిటైల్ వ్యాపారాన్ని కొన్న ఫ్యూచ‌ర్ రిటైల్

|

కిశోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచ‌ర్ గ్రూప్ హెరిటేజ్ రిటైల్‌, అనుబంధ వ్యాపారాల‌ను సొంతం చేసుకుంది. ఈ మేరకు ఫ్యూచర్‌ గ్రూప్‌తో హెరిటేజ్‌ సంస్థ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. 124 రిటైల్‌ స్టోర్లను ఫ్యూచర్‌ గ్రూప్‌తో కలిసి నిర్వహించాలని హెరిటేజ్‌ ఫుడ్స్‌ నిర్ణయం తీసుకుంది. ఒప్పందం ప్రకారం ఫ్యూచ‌ర్ రిటైల్‌లో హెరిటేజ్ ఫ్రెష్‌కు 3.65శాతం వాటా ఉండ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఆ సంస్థ‌లు, ఒప్పందంలోని అంశాల‌ను గురించి తెలుసుకుందాం.

హెరిటేజ్ ఫ్రెష్ డీల్‌

హెరిటేజ్ ఫ్రెష్ డీల్‌

తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందినదే హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్. ‘హెరిటేజ్ ఫ్రెష్' బ్రాండ్ పేరిట వివిధ ప్రాంతాల్లో మొత్తం 124 రిటైల్ ఔట్‌లెట్లను ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఇందులో తెలంగాణలోనే సగానికిపైగా ఉండగా, ఇకపై ఈ రిటైల్ స్టోర్లన్నీ ఫ్యూచర్ గ్రూప్ చేతిలోకి వెళ‌తాయి. ఇందుకుగాను ఫ్యూచర్ రిటైల్ నుంచి 295 కోట్ల రూపాయల విలువైన 3.65 శాతం షేర్లు హెరిటేజ్ ఫుడ్స్‌కు వస్తాయని హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ డైరెక్టర్ నారా లోకేశ్, కిశోర్ బియానీ వెల్ల‌డించారు.

ఫ్యూచ‌ర్ గ్రూప్‌

ఫ్యూచ‌ర్ గ్రూప్‌

ఫ్యూచర్ గ్రూప్ సంస్థ ఇప్పటికే బిగ్ బజార్, ఈ-జోన్, షాపర్స్ స్టాప్ వంటి బ్రాండ్లతో రిటైల్ రంగంలో తనదైన ముద్ర సంపాదించుకుంది. బిగ్‌బజార్, ఫుడ్ బజార్ పేర్లతో దేశవ్యాప్తంగా 738 స్టోర్స్‌ను కలిగి వున్న కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూపు వ్యాపార విస్తరణ వ్యూహాల‌ను అన్వేషిస్తోంది. ఈ మధ్య కాలంలో ఫ్యూచర్ గ్రూపు బిగ్ ఆపిల్, నిలగిరీ, భారతీ రిటైల్ ఔట్‌లెట్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఒప్పందంపై సెప్టెంబర్లోనే వార్తలు వెలువ‌డినా ఇప్పుడు స్ప‌ష్ట‌త వ‌చ్చింది.

2021 నాటికి 3000 స్టోర్లే ల‌క్ష్యం

2021 నాటికి 3000 స్టోర్లే ల‌క్ష్యం

హెరిటేజ్ ఫుడ్స్‌తో ఒక ఒప్పందానికి వ‌చ్చిన‌ట్లు కిశోర్ బియానీ వెల్ల‌డించారు. ద‌క్షిణ భార‌త‌దేశంలో 3 ప్ర‌ధాన మెట్రో న‌గ‌రాల్లో ఉన్న హెరిటేజ్ స్టోర్ల ద్వారా తాము గ్రాస్‌రూట్ స్థాయికి విస్త‌రించేందుకు మార్గం ఏర్ప‌డ‌నుంద‌ని ఆయ‌న అన్నారు. 2021 నాటికి4వేల స్టోర్లు ఏర్పాటు చేసే ల‌క్ష్యం దిశ‌గా సాగుతున్నామ‌ని, తద్వారా రోజువారీ, వారంవారీగా వినియోగ‌దార్ల అవ‌స‌రాల‌ను తీర్చేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని బియానీ చెప్పారు. మొత్తం 4000 స్టోర్ల‌లో 1000 స్టోర్లు ఫ్రాంచైజీ ప‌ద్ద‌తిలో న‌డ‌వ‌నున్నాయి.

ఫ్యూచ‌ర్ గ్రూప్ గురించి

ఫ్యూచ‌ర్ గ్రూప్ గురించి

ఫ్యూచ‌ర్ గ్రూప్‌కు ప్ర‌ధానంగా సెంట్ర‌ల్‌, ప్యాంట‌లూన్ రిటైల్ ఇండియా లిమిటెడ్‌, బిగ్‌బ‌జార్ పేర్ల‌తో రిటైలింగ్ మాల్స్ ఉన్నాయి. ఇంతే కాకుండా ఫుడ్ బ‌జార్‌, ప్లానెట్ స్పోర్ట్స్‌, ఈజోన్ పేరుతో ఔట్‌లెట్ల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇటాలియ‌న్ ఇన్సూరెన్స్ సంస్థ జెన‌రాలితో భాగ‌స్వామ్యం కుదుర్చుకొని ఫ్యూచ‌ర్ జెన‌రాలి పేరుతో బీమా వ్యాపారంలో సైతం ఉంది.

హెరిటేజ్ రిటైల్

హెరిటేజ్ రిటైల్

హెరిటేజ్ రిటైల్ వ్యాపారానికి సంబంధించి ఆ సంస్థకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో 125కు పైగా రిటైల్ దుకాణాలు ఉన్నాయి. హైద‌రాబాద్‌లో 71,బెంగుళూరులో 20, చెన్నైలో 34 ఉన్నాయి. వీటిని హెరిటేజ్ ఫ్రెష్ పేరిట నిర్వ‌హిస్తున్నారు. 1992లో చంద్రబాబు వ్యవస్థపకులుగా హెరిటేజ్ ఫుడ్స్ ప్రారంభమైంది. ఇందులోని ప్రధాన రిటైల్ విభాగాన్ని ఇప్పుడు ఫ్యూచర్ గ్రూప్ సొంతం చేసుకోనుంది.

షేర్ల విలువ‌లు

షేర్ల విలువ‌లు

సోమ‌వారం ఈ రెండు సంస్థ‌ల షేర్ విలువ‌లు చురుకుగా క‌దిలాయి. ఫ్యూచ‌ర్ రిటైల్ బీఎస్ఈలో 1.36% పైకి ఎగ‌సి రూ.152.65 వ‌ద్ద ముగిసింది. హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు 9.55% పెరిగి రూ. 879.60 వ‌ద్ద క్లోజ‌యింది.

Read more about: heritage future group
English summary

uture Group To Acquire Heritage Foods' Retail, Allied Businesses

Kishore Biyani-led Future Group on Monday said it has signed a definitive agreement to acquire retail and allied businesses of city-based Heritage Foods Ltd in an all-stock deal.
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more