For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీఎఫ్ డెత్ క్లెయింల‌ను 7 రోజుల్లోగా ప‌రిష్క‌రించాలి: ఈపీఎఫ్

డెత్‌ క్లెయిమ్‌లను 7 రోజుల్లోగా పరిష్కరించాలని, పదవీ విరమణ లోపే ఉద్యోగులకు అన్ని మొత్తాలు అందించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) తమ ప్రాంతీయ‌ కార్యాలయాలకు మార్గదర్శకాలు జారీ చేసింది

|

డెత్‌ క్లెయిమ్‌లను 7 రోజుల్లోగా పరిష్కరించాలని, పదవీ విరమణ లోపే ఉద్యోగులకు రావాల్సిన వాటిని అందించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) తమ ప్రాంతీయ‌ కార్యాలయాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో అక్టోబర్ 26 న జరిగిన సమీక్షా సమావేశంలో ఆదేశించిన ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.

pf death claim

ఈ గవర్నెన్స్‌లో ఈపీఎఫ్‌ఓ భాగమైనందుకు కార్మిక‌ మంత్రి అభినందనలు తెలిపారు. 50 లక్షల మంది ఈపీఎఫ్‌ పింఛనుదార్లలో ఆధార్‌ కలిగిన వారికి జీవిత బీమా 'జీవన్‌ ప్రమాణ్‌ పత్ర' అందించేందుకు ఇది వీలు కల్పిస్తుందన్నారు. ఈపీఎఫ్‌ చందాదార్లకు గృహనిర్మాణంతో పాటు అమలులో లేని ఖాతాలను ఏం చేయాలనే అంశాన్ని గురించి చర్చ జ‌రిపారు. ప్రాంతీయ‌ కార్యాలయాలకు ఇచ్చిన ఆదేశాలను కేంద్ర ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ (సీపీఎఫ్‌సీ) వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో వెలుగులోకి వచ్చే సమస్యలపైనా వేగంగా స్పందించాలని నిర్ణయించారు.

English summary

పీఎఫ్ డెత్ క్లెయింల‌ను 7 రోజుల్లోగా ప‌రిష్క‌రించాలి: ఈపీఎఫ్ | EPF Death Claims To Be Settled In 7 Days

Labour Minister Bandaru Dattatreya today took stock of the action taken on directions of Prime Minister Narendra Modi during a review meeting on October 26, the Labour Ministry said.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X