For Daily Alerts
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2% డీఏ పెంపుకు నిర్ణయం
|
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్డీఏ గవర్నమెంట్ తీపి కబురు అందించింది. దాదాపు 50.68లక్షల మంది ఉద్యోగులు, 58 లక్షల మంది పింఛనుదారులకు ప్రభుత్వం 2శాతం డీఏను పెంపుదల చేశారు. ఈ పెంపుదల 2016 జులై1 నుంచి వరిస్తుంది. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా దీనిని మార్చినట్లు సమాచారం. ఈ ఏడాది ఆరంభంలోనే ప్రభుత్వం ఒకసారి డీఏను పెంచిన సంగతి తెలిసిందే. తర్వాత ఏడో వేతన సంఘ సిఫార్సులు అమల్లోకి రావడంతో దానిని మూల వేతనంలో కలిపారు.

ఉద్యోగ సంఘాలు మాత్రం దాదాపు 3శాతం పెంపును ఆశించాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కె.కె.ఎన్. కుట్టీ పీటీఐతో మాట్లాడుతూ 12నెలల వినియోగదారు ధరల సూచీ 2.92శాతం పెరిగింది. అందుకే సంఘాలు 3శాతం పెంపును డిమాండ్ చేశాయి. ప్రస్తుత నిర్ణయంతో మేము సంతృప్తిగా ఉన్నామని అన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం డీఏను నిర్ణయించింది. ఏడో వేతన సంఘానికి ఏ కే మాథుర్ నేతృత్వం వహించారు. ఈ ఏడాది జనవరి 1 వ తేదీన ఆయన తన నివేదికను అరుణ్ జైట్లీకి సమర్పించారు.
Comments
English summary
Cabinet approves 2 percent DA for Central government employees
Story first published: Thursday, October 27, 2016, 17:11 [IST]