For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆన్‌లైన్ నియామ‌కాల్లో 17% పెరుగుద‌ల‌

|

గతేడాది ఆగ‌స్టు నెల‌లో ఉన్న ఆన్‌లైన్ నియామ‌కాలతో పోల్చి చూసిన‌ప్పుడు ఈ ఏడాది ఆగ‌స్టులో నియామ‌కాల్లో 17% పెరుగుద‌ల ఉన్న‌ట్లు మాన్‌స్ట‌ర్ ఇండియా నివేదిక వెల్ల‌డించింది. గతేడాది ఆగ‌స్టులో సూచీ విలువ 208 ఉండ‌గా ఈ ఏడాది 17% పెరుగుద‌ల‌తో 244కి పెరిగింది. ఐటీ, ఉత్ప‌త్తి, త‌యారీ రంగాల్లో నియ‌మాకాలు త‌గ్గిన‌ప్ప‌టికీ బ్యాంకింగ్‌,ఫైనాన్స్‌, విద్యా రంగాల్లో హైరింగ్ బాగా ఉందని నివేదిక పేర్కొంది.

ఆన్‌లైన్ నియామ‌కాల్లో 17% పెరుగుద‌ల‌

బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టార్ (బీఎఫ్ఎస్ఐ) ఎన్నో సంస్క‌ర‌ణ‌ల‌తో ముందుకెళుతున్న త‌రుణంలో నియామ‌కాల్లో సైతం ఆశావ‌హంగా ఉంది. గ‌తేడాది క‌న్నా 30 శాతం పెరుగుద‌ల‌ను చూపింది. బ‌డ్జెట్లో ప్ర‌భుత్వం ప్ర‌త్యేక శ్ర‌ద్ద చూపిన కార‌ణంగా విద్యా రంగం దీర్ఘ‌కాల వృద్ది దిశ‌గా సాగుతుంద‌ని నివేదిక ఉటంకించింది. న‌గ‌రాల వారీగా ఉన్న డేటా పరంగా చూస్తే చండీఘ‌డ్‌(36%), జైపూర్‌(34%), కోయంబ‌త్తూర్‌(29%) వార్షిక మెరుగుద‌ల‌ను చూపాయి.

English summary

ఆన్‌లైన్ నియామ‌కాల్లో 17% పెరుగుద‌ల‌ | Online hiring sees 17% jump in the august month

Online recruitment activity in August registered a growth of 17 per cent over the corresponding period last year led by robust hiring in education and banking sectors, says a Monster India report.
Story first published: Wednesday, September 7, 2016, 17:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X