For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న‌తో సొంత ఇల్లు

ప‌ట్ట‌ణ ప్రాంత వాసులంద‌రికీ సొంత ఇల్లు ఉండాల‌నే ఉద్దేశంతో కేంద్ర ప్ర‌భుత్వం కృషి చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న ద్వారా ప‌ట్ట‌ణ పేద‌ల‌కు ఆర్థిక సాయాన్ని అందించేందుకు ప్ర‌య‌త్నిస్తున

|

ప‌ట్ట‌ణ ప్రాంత వాసులంద‌రికీ సొంత ఇల్లు ఉండాల‌నే ఉద్దేశంతో కేంద్ర ప్ర‌భుత్వం కృషి చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న ద్వారా ప‌ట్ట‌ణ పేద‌ల‌కు ఆర్థిక సాయాన్ని అందించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. 2015 జ‌న‌వ‌రిలో ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. 2022 సంవ‌త్స‌రాన్ని ఈ ప‌థ‌కానికి తుది గ‌డువుగా నిర్ణ‌యించారు. అప్ప‌టిక‌ల్లా అందరికీ ఇళ్లు ఉండాల‌నేది కేంద్రం స్వ‌ప్నం.

భారతీయులందరికీ 2022లోపు సొంతిళ్లు ఉండాలన్నదే నా కల. ఆ ఏడాదే భారత్‌ 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోనుంది. ఇప్పటి వరకు రాజకీయనాయకులు సొంతిళ్లు నిర్మించుకున్నారనే వార్తలనే మనం విన్నాం ఇప్పటి నుంచి పేదలు సొంతిళ్లు పొందారనే వార్తలు వింటాం అని మోదీ అన్నారు.

ప్రధానమంత్రి ఆవాజ్‌ యోజన కింద ఇళ్లు పొందేందుకు ఎటువంటి లంచాలు ఇచ్చుకునే అవసరం లేదు. ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే మధ్యవర్తులను సంప్రదించాల్సిన పని లేదు. అప్పట్లో బ్యాంకులు పేదలకు అప్పులిచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు అవి పేదల వద్దకే వచ్చి రుణాలిస్తామని అంటున్నాయి. గుజరాత్‌ నాకు ఎన్నో నేర్పించింది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద ఇళ్లు పొందడంలో మహిళలు ఎంతో సంతప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న‌తో సామాన్యుడికి క‌లిగే లాభాలేంటో చూద్దాం.

సొంత ఇల్లు:

సొంత ఇల్లు:

ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాలు అంటే సంవ‌త్స‌రాదాయం రూ. 3 ల‌క్ష‌ల లోపు ఉంటే మీకు ర‌క‌ర‌కాల స‌బ్సిడీలు

వ‌స్తాయి. మీకు సొంత ఇల్లు లేకుండా, మీరు ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల జాబితాలో ఉంటే కేంద్ర ప్ర‌భుత్వ సాయం ద్వారా మీరు సొంత ఇంటిని సాధించుకోవ‌చ్చు. గృహ రుణానికి వ‌డ్డీ రాయితీ ల‌భిస్తుంది.

మామూలుగా ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాలంటే రూ. 3 ల‌క్ష‌ల లోపు ఆదాయం ఉండాల‌ని నిర్వ‌చిస్తున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని బ‌ట్టి మారుతూ ఉండొచ్చు., కేంద్రాన్ని సంప్ర‌దించి రాష్ట్ర ప్ర‌భుత్వాలు దీని గురించి వివ‌ర‌ణ ఇవ్వాలి.

 గృహ రుణం :

గృహ రుణం :

మీరు ఆర్థికంగా వెనుక‌బ‌డిన కేట‌గిరీలో ఉంటే 15 ఏళ్ల కాలానికి మీరు గృహ రుణానికి 6.5 శాతం స‌బ్సిడీ పొందేందుకు అర్హులు. రూ. 6 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఈ స‌దుపాయం ఉంది. దానికి మించి తీసుకునే రుణాల‌కు ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న కింద మార్కెట్ వ‌డ్డీ రేటు అమ‌ల‌వుతుంది.

వ‌డ్డీ రాయితీ ప్ర‌యోజ‌నాలు ల‌బ్దిదారుల ఖాతాలో జ‌మ‌వుతాయి. ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల వారి ఇల్లు ఉండే కార్పెట్ ఏరియా 30 చ‌ద‌ర‌పు మీట‌ర్లుగా ఉండాలి.

 మీ సొంత ఇంటికి ప్ర‌భుత్వ సాయం

మీ సొంత ఇంటికి ప్ర‌భుత్వ సాయం

మీ కుటుంబ ఆదాయం రూ. 3 ల‌క్ష‌ల లోపు ఉంటే కేంద్ర ప్ర‌భుత్వం మీకు ఇల్లు క‌ట్టుకోవ‌డానికి రూ.లక్షా 50వేల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఇందుకోసం మీరు ప‌ట్ట‌ణ ప్రాంత స్థానిక‌, న‌గ‌ర పాల‌క సంస్థల అధికారుల‌ను మీకు ఉన్న స్థ‌ల ప‌త్రాల‌ను, ఇత‌ర ప‌త్రాల‌ను తీసుకుని వెళ్లి సంప్రదించాలి. ఇందుకు అద‌నంగా రాష్ట్ర ప్ర‌భుత్వాలు సైతం ఈ ప‌థ‌కంలో ఆర్థిక‌ సాయం చేస్తే ఇల్లు క‌ట్టుకునే ఖ‌ర్చు మ‌రింత త‌గ్గుతుంది.

రాష్ట్ర ప్ర‌భుత్వాల భాగ‌స్వామ్యం

రాష్ట్ర ప్ర‌భుత్వాల భాగ‌స్వామ్యం

రాష్ట్ర ప్ర‌భుత్వాల భాగ‌స్వామ్యంతో కేంద్రం ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల వారికి రూ. 1. 5 లక్ష సాయం అందిస్తోంది. అంతే కాకుండా ఇళ్ల‌ను లాభం, న‌ష్టం లేకుండా నిర్మించే ప్ర‌ణాళిక‌తో త‌క్కువ ధ‌ర‌కు ఇళ్ల‌ను నిర్మించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

 మురికి వాడ‌ల్లో ఉండేవారికి సొంత ఇల్లు

మురికి వాడ‌ల్లో ఉండేవారికి సొంత ఇల్లు

ప్ర‌ధాన మంత్రి ఆవాస యోజ‌న‌లో మెచ్చుకోద‌గ్గ అంశం మురికి వాడ‌ల్లో ఉండే వారికి సొంత ఇళ్లను నిర్మించాల‌నే ల‌క్ష్యం నిర్దేశించుకోవ‌డం. ఇందుకోసం కేంద్ర ప్ర‌భుత్వ, రాష్ట్ర ప్ర‌భుత్వాల సొంత స్థ‌లం లేదా ప్ర‌యివేటు భూముల‌ను వినియోగిస్తారు. పై ప్ర‌యోజ‌నాల‌తో పాటు మురికివాడ‌ల అభివృద్ది ఉద్దేశంతో మురికివాడ‌ల పున‌రావాసానికై రూ. 1 ల‌క్ష గ్రాంటును ఇస్తున్నారు.

ఇందులో రెండు అంశాలు ఉన్నాయి. మొద‌టిది మురికివాడ‌ల పున‌రావాసం, అంటే ఆ ప్రాంతంలో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న. ఇంకో అంశం డెవ‌ల‌ప‌ర్ ఆ ప్రాజెక్టును ప్ర‌యివేటు రంగానికి విక్ర‌యించ‌డం. ఇది క్రాస్ స‌బ్పిడైజేష‌న్‌కు అవ‌కాశం క‌ల్పిస్తుంది. దీంతో ప్రైవేటు రంగ బిల్డ‌ర్ల‌ను పోటీ ప‌ద్ద‌తిలో బిడ్డింగ్ ద్వారా ఎంపిక చేయ‌డానికి అవ‌కాశం క‌లుగుతుంది.

అల్పాదాయ వ‌ర్గాలు:

అల్పాదాయ వ‌ర్గాలు:

అర్హ‌త ఉన్న వ్య‌క్తులెవ‌రైనా ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న ద్వారా ల‌బ్ది పొందొచ్చు. రూ. 3 ల‌క్ష‌ల ఆదాయం అని నిర్దేశించి ఉన్నందున దేశంలో కొన్ని కోట్ల మంది ఆ కేట‌గిరీలోకి వ‌స్తారు. అల్ప ఆదాయ వ‌ర్గం అనే కేట‌గిరీలో రూ. 3 ల‌క్ష‌ల ఆదాయం నుంచి రూ. 6 ల‌క్ష‌ల ఆదాయం ఉండాల‌ని నిర్దేశించారు. ఈ కేట‌గిరీలో సైతం చాలా మంది ఉంటారు. అల్పాదాయ వ‌ర్గాల వారికి 60 చ‌ద‌ర‌పు మీట‌ర్లను అర్హ‌త‌గా నిర్ణ‌యించారు.

ఇది కూడా చ‌ద‌వండి డిజి ధ‌న్‌, ల‌క్కీ గ్రాహ‌క్ లాట‌రీల్లో మీ పేరుందో లేదో తెలుసుకోవ‌డం ఎలా?

 ముగింపు

ముగింపు

మీరు తీసుకునే గృహ రుణానికి వ‌డ్డీ స‌బ్పిడీ ఇవ్వ‌డమే కాకుండా, ఇల్లు క‌ట్టుకునేందుకు నేరుగా ఆర్థిక సాయం చేయ‌డం సానుకూల అంశం. అర్హ‌త క‌లిగిన వారంతా ద‌ర‌ఖాస్తు చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. ఈ ప‌థ‌కానికి ద‌ర‌ఖాస్తు చేసుకునేముందు గుర్తుంచుకోవాల్సిన అంశం మీకు ఇంత‌కు ముందు సొంత ఇల్లు ఉండ‌కూడ‌దు. ఇది ప్ర‌భుత్వ ప‌థ‌కం కాబ‌ట్టి అమ‌లు చేసేట‌ప్పుడు ప్ర‌భుత్వ చిత్త శుద్ది, అధికారుల ప‌నిత‌నంపైనే దీని స‌త్ఫ‌లితాలు, స‌క్ర‌మ అమ‌లు ఆధార‌ప‌డి ఉంటాయి. కాబ‌ట్టి ఎంత పార‌ద‌ర్శ‌క‌త‌తో ఇది జ‌రుగుతుందో భ‌విష్య‌త్తులో చూడాలి.CLSS అంటే క్రెడిట్ లింక్‌డ్ స‌బ్సిడీ స్కీమ్‌

CLSS Toll-Free Helpline Numbers

NHB: 1800-11-3377

1800-11-3388

HUDCO: 1800-11-6163

ఈ ప‌థ‌కం గురించిన మ‌రింత స‌మాచారం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

English summary

ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న‌తో సొంత ఇల్లు | Benefits of Pradhan mantri awas yojana

The Pradhan Mantri Awas Yojana is an extremely beneficial scheme to finally own your own home, especially to those who fulfill certain criteria. It is a central government scheme and runs until 2022.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X