English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

దేశంలో క్రెడిట్ కార్డు మోసాలు-జాగ్ర‌త్త‌లు

Posted By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుంచి ముందస్తుగా రుణం రూపంలో డ‌బ్బు వాడ‌కునేందుకు ఆధార‌మ‌య్యేది క్రెడిట్‌కార్డు. క్రెడిట్ కార్డులో కొంత ప‌రిమితి విధించి అంత‌వ‌ర‌కూ మీరు ముంద‌స్తుగా వాడుకునేందుకు వీలు క‌ల్పిస్తారు. ఇప్పుడు చాలా షాపింగ్ మాళ్ల‌లో, రెస్టారెంట్ల‌లో, హోట‌ళ్ల‌లో క్రెడిట్ కార్డును అంగీక‌రిస్తున్నారు. ఇది ఉంటే మీరు న‌గ‌దు తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా చెల్లింపులు సులువుగా జ‌రిపేయ‌చ్చ‌న్న‌మాట‌. ఇలా చాలా చోట్ల మ‌నం ఈ క్రెడిట్ కార్డుల‌ను వాడేస్తూ ఉంటాం. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు మ‌న‌కు ఇబ్బందుల‌ను సైతం క‌ల‌గ‌జేస్తుంది. మ‌న ప్ర‌మేయం లేకుండా వేరేవ‌రో క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జ‌ర‌ప‌డాన్ని క్రెడిట్ కార్డు మోసాల కింద ప‌రిగ‌ణించ‌వ‌చ్చు. అలాంటి క్రెడిట్‌కార్డు మోసాల నుంచి కాపాడుకునేందుకు దేశంలో ఉన్న ర‌క‌ర‌కాల క్రెడిట్ కార్డు మోసాల గురించి తెలుసుకుందాం.

కార్డు చోరీకి గుర‌వ్వ‌డం

కార్డు చోరీకి గుర‌వ్వ‌డం

క్రెడిట్ కార్డు మోసాల్లో మొట్ట‌మొద‌టి ర‌కం క్రెడిట్ కార్డు దొంగ‌త‌నానికి గురవ్వ‌డం. మ‌నం క్రెడిట్ కార్డు జారీ చేసిన సంస్థ‌కు ఫోన్ చేసి విష‌యాన్ని తెలిపి క్రెడిట్ కార్డును బ్లాక్ చేయించేంత వ‌ర‌కూ ఈ క్రెడిట్ కార్డును దొంగ‌తనం చేసిన వ్య‌క్తి ఉప‌యోగించేందుకు ఆస్కారం ఉంటుంది. అందుకే క్రెడిట్‌కార్డు ఎప్పుడైనా పోయింద‌ని గుర్తించిన వెంట‌నే కార్డును బ్లాక్ చేయించాలి.

ఫిషింగ్ మెయిల్స్‌

ఫిషింగ్ మెయిల్స్‌

అస‌లు ఏ మాత్రం భౌతికంగా క‌ష్ట‌ప‌డ‌కుండానే చేసే మోసం ఇంట‌ర్నెట్ ద్వారా క్రెడిట్ కార్డు వాడ‌కం దార్ల‌ను బురిడీ కొట్టించ‌డం. వివిధ వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని తెలుసుకునే చోరులు ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో మ‌న క్రెడిట్ కార్డు వివ‌రాలు న‌మోదు చేయ‌డం ద్వారా చెల్లింపులు చేసేయ‌డం. అందుకే వెబ్‌సైట్‌కు ముందు హెచ్‌టీటీపీఎస్ అనే భ‌ద్ర‌తా ప్ర‌మాణం లేని వెబ్‌సైట్ల‌లో చెల్లింపులు చేయ‌కుండా ఉండేందుకు చూసుకోండి. బాగా న‌మ్మ‌క‌మైన వారికి అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప ఎవ‌రికీ క్రెడిట్ కార్డు వివ‌రాల‌ను చెప్ప‌వ‌ద్దు. మెయిల్స్ పంపి దాని ద్వారా కంపెనీ అస‌లు వెబ్‌సైట్ల‌లాగే ఉండే ఇత‌ర వెబ్‌సైట్ల‌కు మ‌ళ్లిస్తారు. అక్క‌డ నుంచి మ‌న క్రెడిట్ కార్డు స‌మాచారాన్ని కొట్టేస్తారు. నేరుగా చెల్లింపు వెబ్‌సైట్ల‌లోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించండి కానీ మెయిల్ నుంచి వ‌చ్చే అనుమాన‌పూరిత లింక్‌ల‌పై క్లిక్ చేయ‌కండి.

స్కిమ్మింగ్‌

స్కిమ్మింగ్‌

కార్డు మాగ్న‌టిక్ స్ట్రిప్‌లో ఉండే ర‌హ‌స్య స‌మాచారాన్నితెలుసుకుని దాని ద్వారా న‌కిలీ కార్డు త‌యారు చేయ‌డాన్ని స్కిమ్మింగ్ అంటారు. వ్యాపార‌స్థుల వ‌ద్ద నేరపూరిత స్వ‌భావం క‌లిగిన ఉద్యోగులు ఇలా చేయ‌డానికి ఆస్కారం ఉంటుంది. చిన్ని ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల ద్వారా క్రెడిట్ కార్డు మాగ్న‌టిక్ స్ట్రిప్‌లోని స‌మాచారాన్ని ఈ మార్గంలో త‌స్క‌రిస్తారు. అందుకే ఎప్పుడూ చెల్లింపులు చేసేట‌ప్పుడు జాగ్ర‌త్త వ‌హించండి. క్రెడిట్‌కార్డు బిల్లుల‌ను, న‌గ‌దు చెల్లింపు ర‌సీదుల‌ను ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ప‌డ‌వేయ‌వ‌ద్దు.

 అకౌంట్ టేకోవ‌ర్‌

అకౌంట్ టేకోవ‌ర్‌

ఖాతా వివ‌రాలు తెలుసుకోవ‌డం ద్వారా ఒకరి ఖాతాను మ‌రొక‌రు వాడుకునే ప‌ద్ద‌తి అకౌంట్ టేకోవ‌ర్‌. క్రెడిట్ కార్డు గురించి, కార్డు వాడే వ్య‌క్తి అన్ని వివ‌రాలు తెలుసుకుని క్రిమిన‌ల్స్ ఇలాంటి నేరాల‌కు పాల్ప‌డ‌తారు. ఈ ప‌ద్ద‌తిలో మొద‌ట తామే కార్డు సొంత‌దారులాగా కంపెనీకి ఫోన్ చేసి బిల్లింగ్ చిరునామా మార్చ‌మ‌ని కోర‌తారు. త‌ర్వాత కార్డు పోయింద‌ని చెప్పి కొత్త చిరునామాకు కొత్త కార్డును పంపాల్సిందిగా కోర‌తారు. అయితే ఇది అంత సులువు కాదు. కార్డు వివ‌రాల‌ను మ‌నం జాగ్ర‌త్త‌ప‌రుచుకున్నంత వ‌ర‌కూ మ‌నం అప్రమ‌త్తంగా ఉండొచ్చు.

అప్లికేష‌న్ ఫ్రాడ్

అప్లికేష‌న్ ఫ్రాడ్

క్రెడిట్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు ద‌శ‌లో మోస‌పూరిత వ్య‌క్తులు వివ‌రాల‌ను సేకరించ‌డం కూడా జ‌రిగేందుకు వీలుంది. మ‌న పేరు మీద ఖాతా తెరిచేందుకు బిల్లు చెల్లింపు ర‌సీదులు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు వంటివి ఉప‌యోగించుకోవ‌చ్చు. తద్వారా మ‌న‌కు తెలియ‌కుండానే క్రెడిట్ కార్డు ఖాతా తెరిచి మోసాల‌కు పాల్ప‌డే అవ‌కాశం సైతం ఉంటుంది.

జాగ్ర‌త్త‌లు

జాగ్ర‌త్త‌లు

క్రెడిట్ కార్డు లావాదేవీ జ‌రిపేట‌ప్పుడు మీ సమ‌క్షంలోనే జ‌రిగేలా చూసుకుంటే మంచిది.

క్రెడిట్ కార్డు జారీ చేసిన కంపెనీ సైతం మిమ్మల్ని కార్డు వివ‌రాలు అడ‌గ‌దు. కాబ‌ట్టి ఎవ‌రికీ కార్డు వివ‌రాల‌ను

ఫోన్‌లో చెప్ప‌కండి.

మీ కార్డు వివ‌రాల‌ను వెంట‌నే పంపండి, లేకపోతే ఫైన్ లేదా పెనాల్టీ ప‌డుతుంద‌నే అనుమాన‌స్పద మెయిల్స్‌ను

న‌మ్మ‌వ‌ద్దు.

ప్ర‌తిసారీ మీకు వ‌చ్చిన క్రెడిట్ కార్డు బిల్లుల‌ను త‌ప్ప‌నిస‌రిగా చ‌ద‌వండి.

క్రెడిట్ కార్డు పైన ఉండే సీవీవీ లేదా సీఎస్‌సీని ఎవ‌రికీ తెలియ‌నివ్వ‌కండి.

ఫిషింగ్ త‌ర‌హా మెయిల్‌లో ఉండే లింక్‌పైన క్లిక్ చేయ‌కండి.

ఆన్‌లైన్ లావాదేవీల‌ను జ‌రిపేట‌ప్పుడు న‌మ్మ‌క‌మైన వెబ్‌సైట్ల‌లోనే చేయండి.

కార్డు పిన్‌ను కార్డు పైనే రాసి ఉంచ‌కుండా గుర్తుంచుకోవ‌డానికి ప్ర‌య‌త్నించండి.

పుట్టిన తేదీ, 1111, 2345 లాంటి సులువైన పాస్‌వ‌ర్డ్‌లు కాకుండా క‌ఠిన‌మైన వాటిని పెట్టుకోవ‌డం సూచ‌నీయం.

English summary

Types of credit card frauds in India

Credit card frauds are the thefts and scams committed while using other's credit card fraudulently. Credit card frauds are the cases where one uses other's credit cards to purchase goods or services using the funds of other accounts, without their authorization.
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC