For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీవిత బీమా పాల‌సీల్లోని ర‌కాలు

|

ప్ర‌స్తుతం జీవ‌న విధానం చాలా వేగంగా మారిపోయింది. ఈ నేప‌థ్యంలో పిల్ల‌ల బాధ్య‌త నెర‌వేర్చేందుకు సైతం ఒక్కోసారి స‌రైన స‌మ‌యం కేటాయించ‌లేక‌పోతున్నారు. పిల్ల‌ల ఆర్థిక భ‌ద్ర‌త త‌ల్లిదండ్రుల బాధ్య‌త‌. మీకు, మీ కుటుంబానికి ఆర్థిక ర‌క్ష‌ణ క‌ల్పించేవే బీమా పాల‌సీలు. జీవిత బీమా తీసుకుంటున్నారంటే దాన‌ర్థం కుటుంబానికి భ‌రోసాగా నిలుస్తున్నార‌ని . వివిధ ర‌కాల వ్య‌క్తుల అవ‌స‌రాల రీత్యా మార్కెట్లో ర‌క‌ర‌కాల బీమా పాల‌సీలు ఉన్నాయి.
ఈ నేప‌థ్యంలో సాధార‌ణంగా జీవిత బీమా పాల‌సీలో ఉండే ర‌కాల‌ను గురించి తెలుసుకుందాం.

ట‌ర్మ్ పాల‌సీ:

ట‌ర్మ్ పాల‌సీ:

పాల‌సీల్లో త‌క్కువ ప్రీమియంకే ఎక్కువ ర‌క్ష‌ణ క‌ల్పించే పాల‌సీలు ట‌ర్మ్‌పాల‌సీల‌ని చెప్పుకోవ‌చ్చు. ఈ పాల‌సీలు 5, 10, 15, 20 లేదా 30 ఏళ్ల కాల‌ప‌రిమితిలో ల‌భిస్తాయి. ఒక నిర్దేశిత కాల‌ప‌రిమితి వ‌ర‌కూ ఇవి ర‌క్ష‌ణ‌ను క‌ల్పిస్తాయి. పాల‌సీదారుడు మ‌ర‌ణించిన సంద‌ర్భంలో వారి కుటుంబానికి లేదా నామినీకి ప్ర‌యోజ‌నాల‌ను అంద‌జేస్తారు.

 సంపూర్ణ జీవిత బీమా

సంపూర్ణ జీవిత బీమా

ప్రీమియం స‌క్ర‌మంగా క‌డుతున్న కొద్దీ మొత్తం జీవిత కాలానికి బీమా క‌ల్పించే పాల‌సీల‌ను సంపూర్ణ జీవిత బీమా పాల‌సీల‌ని అంటారు. మొత్తం కాలానికి ఒకే ర‌క‌మైన ప్రీమియం ఉంటుంది. ట‌ర్మ్ పాల‌సీల్లో ఒక నిర్ణీత కాల‌ప‌రిమితి ఉంటే ఇక్క‌డ పాల‌సీదారు మొత్తం జీవితానికి ఈ పాల‌సీ క‌వ‌రేజీ వర్తిస్తుంది.

ఎండోమెంట్ పాల‌సీ

ఎండోమెంట్ పాల‌సీ

ఎండోమెంట్ పాల‌సీల్లో పెట్టుబ‌డి, బీమా రెండు క‌లిసి ఉంటాయి. పాల‌సీ కాల‌ప‌రిమితి ముగిసే వ‌ర‌కూ పాల‌సీదారు జీవించి ఉంటే చివ‌ర్లో స‌ర్వైవ‌ల్ బెనిఫిట్స్‌(బీమా హామీ మొత్తం)తో పాటు బోన‌స్‌లు ఏవైనా ఉంటే అవి కూడా అంద‌జేస్తారు. ఎండోమెంట్ పాల‌సీ హామీగా రుణాల‌ను పొంద‌వ‌చ్చు.

 మ‌నీ బ్యాక్ ప్లాన్స్‌

మ‌నీ బ్యాక్ ప్లాన్స్‌

ఈ ర‌క‌మైన ప్లాన్ల‌లో బీమా కాల‌ప‌రిమితి మ‌ధ్య‌లో నిర్ణీత కాల‌వ్య‌వ‌ధుల్లో బీమా హామీ మొత్తంలో కొంత శాతం చొప్పున చెల్లిస్తూ వ‌స్తారు. ప్లాన్ కాల‌ప‌రిమితి ముగిసిన త‌ర్వాత మిగిలిన సొమ్మును చెల్లిస్తారు. స‌ర్వైవ‌ల్ బెనిఫిట్స్‌తో సంబంధం లేకుండా పాల‌సీ ర‌క్ష‌ణ‌కు సంబంధించి మొత్తం బీమా హామీ మొత్తం ఉంటుంది.

పిల్ల‌ల పాల‌సీలు

పిల్ల‌ల పాల‌సీలు

పిల్ల‌లు పుట్ట‌గానే వారి పేరిట పాల‌సీల‌ను తీసుకునేందుకు బీమా కంపెనీలు పాల‌సీల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నాయి. జీవితంలో వారు ఎదిగే ద‌శ‌లో అవ‌స‌రాల‌ను బ‌ట్టి పాల‌సీ ప్ర‌యోజ‌నాల‌ను చెల్లించేలా పాల‌సీ కొనుగోలు స‌మ‌యంలో ఎంచుకోవ‌చ్చు. అనుకోని ప‌రిస్థితుల్లో పాల‌సీదారు మ‌ర‌ణిస్తే భ‌విష్య‌త్తు ప్రీమియంల‌ను మాఫీ చేసేలా కొన్ని బీమా కంపెనీలు అవ‌కాశం క‌ల్పిస్తున్నాయి.

పింఛ‌ను ప్లాన్లు

పింఛ‌ను ప్లాన్లు

క్ర‌మ‌మైన ఆదాయం వ‌స్తుంది కాబ‌ట్టి పింఛ‌ను ప్లాన్లు ఒక విధంగా మంచి మార్గం. సంపాద‌న ద‌శ‌లో అధికంగా ఉన్న డ‌బ్బును పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా వ‌య‌సు మ‌ళ్లిన త‌ర్వాత ఉప‌యోగించుకునేందుకు వీలుంటుంది. పింఛ‌ను పాల‌సీల‌కు సెక్ష‌న్ 80సీసీసీ కింద గ‌రిష్టంగా రూ. 1.5 ల‌క్ష‌ల వ‌ర‌కూ మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి.

 యులిప్‌లు

యులిప్‌లు

జీవిత బీమాతో పాటు మార్కెట్ పెట్టుబ‌డి క‌ల‌గ‌లిపి ఉండే పాల‌సీలు యులిప్‌లు(యూనిట్ లింక్‌డ్ ఇన్సూరెన్స్ పాల‌సీలు). ఈ ప్లాన్ల‌లో ప్రీమియంలో కొంత శాతాన్ని బాండ్లు, ఈక్విటీలు, డెట్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెడ‌తారు. మిగ‌తా దాన్ని బీమా ర‌క్ష‌ణ‌కు ఉప‌యోగిస్తారు. ఈ ప్లాన్ల‌ను కొనుగోలు చేస్తున్నారంటే మార్కెట్ న‌ష్ట‌భ‌యాల‌కు సిద్ద‌మ‌వుతున్నార‌ని అర్థం.

 పాల‌సీ జాగ్ర‌త్త‌లు

పాల‌సీ జాగ్ర‌త్త‌లు

జ‌ర‌గ‌రాని ప్ర‌మాదం జ‌రిగితే ఆర్థికంగా ర‌క్షిస్తుంద‌ని బీమా పాల‌సీ తీసుకుంటాం. అలానే చాలా ప్ర‌మాద స‌మ‌యాల్లో పాల‌సీ అండ‌గా నిల‌వ‌డం మ‌నం చూస్తుంటాం. సాధార‌ణంగా ఎవ‌రైనా జీవిత బీమా తీసుకునే ముందు నిపుణుల అభిప్రాయం తీసుకుంటే స‌మ‌స్య‌లు ఉండ‌వు. ఐఆర్‌డీఏ వ‌ద్ద న‌మోదు కాని ఏజెంట్లు, ఆర్థిక అవ‌గాహ‌న లేని వ్య‌క్తుల మాట‌లు విని బీమా నిర్ణ‌యం తీసుకుంటే భ‌విష్య‌త్తులో క‌ష్ట‌మే. ప్ర‌స్తుతం చాలా మంది వెబ్‌సైట్ల‌లో వెతికి, బంధు మిత్రుల స‌ల‌హాల‌ను, సూచ‌న‌ల‌ను పాటిస్తూ పాల‌సీల‌ను కొంటున్నారు. అయితే ఇది ఎలా ఉన్న‌ప్ప‌టికీ పాల‌సీకి సంబంధించిన నియ‌మ నిబంధ‌న‌లు క్షుణ్ణంగా చ‌దివి పాల‌సీని కొనుగోలు చేయ‌డమే ఉత్త‌మం.

English summary

జీవిత బీమా పాల‌సీల్లోని ర‌కాలు | Types of Life insurance policies

In present busy life we can not expect what happens at certain times.Having a life insurance will financially cover your family in cases such as death, disability, accident, retirement etc. Life insurance will provide family with a definite amount of money in case the life insured dies during the policy term or becomes disabled on account of an accident. Life insurance is a mu
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X