For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆధార్ అనుసంధానం చేయ‌కపోతే ఇవి కోల్పోతారు

ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌తో పాటు పీఎఫ్ఆర్‌డీఏ, ఆదాయ‌పు ప‌న్ను శాఖ వంటి నియంత్ర‌ణ సంస్థ‌లు ఆధార్ అనుసంధానానికి ప్ర‌య‌త్నిస్తున్నాయి. వివిధ ర‌కాల సేవ‌ల‌ను పౌరులు అందుకోవాలంటే ఆధార్ అనుసంధానం త‌ప్ప

|

యూఐడీఏఐ జారీ చేసే 12 అంకెల సంఖ్య ఆధార్‌. ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌తో పాటు పీఎఫ్ఆర్‌డీఏ, ఆదాయ‌పు ప‌న్ను శాఖ వంటి నియంత్ర‌ణ సంస్థ‌లు ఆధార్ అనుసంధానానికి ప్ర‌య‌త్నిస్తున్నాయి. వివిధ ర‌కాల సేవ‌ల‌ను పౌరులు అందుకోవాలంటే ఆధార్ అనుసంధానం త‌ప్ప‌నిస‌రి. దీంతో పాటు వివిధ చోట్ల వ్య‌క్తిగ‌త, చిరునామా గుర్తింపుగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ ఆధార్‌, ఆధార్ లెట‌ర్ సైతం త‌గిన గుర్తింపు ప‌త్రాలుగా ప‌నికొస్తాయి.

అయితే కేంద్ర ప్ర‌భుత్వం ఆధార్‌ను త‌ప్ప‌నిస‌రి చేయ‌న‌ప్ప‌టికీ చాలా లావాదేవీల‌కు, స‌రికొత్త సేవ‌ల‌కు, ప‌థ‌కాల‌కు ఆధార్ అనుసంధానం ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్ర‌స్తుతం చాలా సంస్థ‌లు ఈకేవైసీని అంగీక‌రిస్తున్నాయి. కాబ‌ట్టి వెరిఫికేష‌న్‌కు ప‌ట్టే స‌మ‌యం ఆదా అవ‌డంతో పాటు శ్ర‌మ త‌గ్గుతుంది.

1) ఆదాయ‌పు ప‌న్ను

1) ఆదాయ‌పు ప‌న్ను

వ్య‌క్తులంతా ఆధార్‌ను పాన్‌(శాశ్వ‌త ఖాతా సంఖ్య‌)కు అనుసంధానించ‌డం మంచిది. ఇన్‌క‌మ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌లో పాన్,ఆధార్ అనుసంధానం జ‌రిగి ఉంటే మీరు ఐటీఆర్Vను ప్రింట్ తీసి పంపాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. దీంతో ప‌న్ను రిట‌ర్నుల ప్ర‌క్రియ త్వ‌రిత‌గ‌తిన పూర్త‌వ‌డంతో పాటు మీ ఖాతాలో డ‌బ్బు త్వ‌ర‌గా జ‌మ‌వుతుంది.

2) బ్యాంకింగ్‌

2) బ్యాంకింగ్‌

బ్యాంకు ఖాతా తెరిచేందుకు ఆధార్ వ్యక్తిగ‌త‌, చిరునామా గుర్తింపుగా ఉప‌యోగప‌డుతుంది. ఆధార్ ఉంటే చాలు ఇక ఏ ఇత‌ర గుర్తింపు ప‌త్రాలు అవ‌స‌రం లేదు. ఒక్కోసారి ఈ ఆధార్‌ను సైతం బ్యాంకులు అంగీక‌రించే అవ‌కాశం ఉంది. (ఇది కూడా చ‌ద‌వండి) ఆధార్ కార్డు-ప‌లు అంశాలు

3) డిజిట‌ల్ లైఫ్ స‌ర్టిఫికెట్

3) డిజిట‌ల్ లైఫ్ స‌ర్టిఫికెట్

పెన్ష‌న‌ర్లు బ్యాంకులో ఆధార్ నంబ‌రు ఇస్తే వారి ప్ర‌క్రియ మ‌రింత సులువ‌వుతుంది. త‌మ‌కు చెల్లింపు జ‌రిగే బ్యాంకు శాఖ‌కు వెళ్లి ఆధార్‌, బ్యాంకు పాస్‌బుక్ న‌క‌ళ్లు ఇచ్చి అనుసంధానం ప్ర‌క్రియ‌ను పూర్తిచేయాలి.

దీంతో ఆధార్ ఆధారిత డిజిట‌ల్ లైఫ్ స‌ర్టిఫికెట్ (జీవ‌న్ ప్ర‌మాణ్‌)ను సులువుగా పొంద‌వ‌చ్చు. దీంతో ప్ర‌తి ఏడాది బ్యాంకుకు వెళ్లాల్సిన అవ‌స్థ త‌ప్పుతుంది.

ఇది కూడా చ‌ద‌వండి దేశంలో వీట‌న్నింటికి ఆధార్ త‌ప్ప‌నిసరి

4) మ్యూచువ‌ల్ ఫండ్స్‌

4) మ్యూచువ‌ల్ ఫండ్స్‌

యూఐడీఏఐ జారీ చేసిన ఆధార్ లెట‌ర్‌, ఈ-ఆధార్‌ను ప్రామాణిక‌మైన‌దిగా అంగీక‌రించాల‌ని సెబీ, ఐఆర్‌డీఏ చాలాకాలం కింద‌టే నిర్ణ‌యించాయి. దీంతో మీకు గుర్తింపు ప‌త్రాల బాధ త‌ప్పుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబ‌డులు పెట్టాల‌న్నా, బీమా తీసుకునేందుకు ఈ-ఆధార్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ కేవైసీ కోసం అవ‌స‌ర‌మైన ప‌త్రాల‌ను ఆన్‌లైన్‌లో స‌మ‌ర్పించ‌వచ్చు.

5) నెల‌వారీ పింఛ‌ను

5) నెల‌వారీ పింఛ‌ను

పింఛ‌ను అక్ర‌మంగా పొందుతున్న వారిని ఏరివేసేందుకు కేంద్రం కొత్త‌గా ఆధార్ మార్గాన్ని ఎంచుకుంది. ప్ర‌తి నెలా పింఛ‌ను అందుకునేందుకు పింఛ‌నుదార్లు ఆదార్ న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది.

6) ప్రావిడెంట్ ఫండ్

6) ప్రావిడెంట్ ఫండ్

ఈపీఎఫ్ విత్‌డ్రాయ‌ల్‌ను ఆన్‌లైన్ ద్వారా చేసుకునేందుకు ఆదార్‌ను పీఎఫ్ ఖాతాతో అనుసంధానించాలి. విత్‌డ్రాయ‌ల్స్‌ను వేగ‌వంతం చేసేందుకు చాలా కంపెనీలు ఆధార్‌, పీఎఫ్ అనుసంధానాన్ని ప్రోత్స‌హిస్తున్నాయి. ఆధార్

7) డిజిట‌ల్ లాక‌ర్

7) డిజిట‌ల్ లాక‌ర్

డిజిట‌ల్ లాకర్ ద్వారా మీ ముఖ్య‌మైన స‌ర్టిఫికెట్ల‌ను ఆన్‌లైన్‌లో భ‌ద్ర‌ప‌రుచుకోవ‌చ్చు. దీనికి మీ వ‌ద్దే డిజిట‌ల్ కీ (కోడ్) ఉంటుంది. ఇది బ్యాంకు ఏటీఎమ్ పిన్‌లాగే ప‌నిచేస్తుంది. దీనిలో భ‌ద్ర‌ప‌రిచిన ప‌త్రాలకు ఈ-సైన్ చేసి స‌మ‌ర్పించ‌డం ద్వారా స‌మ‌యం ఆదా చేసుకోవ‌చ్చు.

ఆధార్‌లో త‌ప్పుల‌ను స‌రిదిద్దుకోవ‌డం ఎలా?ఆధార్‌లో త‌ప్పుల‌ను స‌రిదిద్దుకోవ‌డం ఎలా?

ఉప‌కార వేత‌నాలు

ఉప‌కార వేత‌నాలు

విద్యార్థుల‌కు స‌కాలంలో ఉప‌కార వేత‌నాలు అందించేందుకు, ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌లో ఎదుర‌వుతున్న చిన్న చిన్న అవాంత‌రాల‌ను తొల‌గించేందుకు విద్యార్థుల ఉప‌కార వేత‌నాల‌ను సైతం ఆధార్‌తో అనుసంధానించారు. అంటే ప్ర‌తి విద్యార్థి క‌ళాశాల‌లో, వారు చ‌దివే విద్యాల‌యాల్లో బ్యాంకు ఖాతాతో పాటు ఆధార్ సంఖ్య‌ను ఇవ్వాలి. త‌మ బ్యాంకు శాఖ‌కు వెళ్లి ఖాతాను ఆధార్ సంఖ్య‌తో అనుసంధానం చేసేలా చూసుకోవాలి.

ఆధార్ కార్డులో త‌ప్పులున్నాయా? స‌వ‌రించుకోండిలా...ఆధార్ కార్డులో త‌ప్పులున్నాయా? స‌వ‌రించుకోండిలా...

 గ్యాస్ స‌బ్సిడీ

గ్యాస్ స‌బ్సిడీ

ఎల్పీజీ వంటగ్యాస్ సబ్సిడీ పొందేందుకు ఆధార్‌కార్డు తప్పనిసరి చేసింది. ఇప్పటివరకు ఆధార్ లేనివారు ఇకనుంచి విశిష్ట గుర్తింపు సంఖ్య (ఆధార్) తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ చట్టం ప్రకారం ఈ నిబంధన గ‌తేడాది నుంచి అమ‌ల‌వుతోంది. ప్రస్తుతం సంవత్సరానికి 14.2 కిలోల సిలిండర్లు 12 వరకు సబ్సిడీ కింద సరఫరా చేస్తున్నారు. వీటి సబ్సిడీని ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌దిలీ(డీబీటీ) కింద నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు.ఇది కూడా చ‌ద‌వండి ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న‌తో సొంత ఇల్లు

English summary

ఆధార్ అనుసంధానం చేయ‌కపోతే ఇవి కోల్పోతారు | 7 Benefits of Getting Aadhar linkage

Aadhaar number is a 12 digit identification number which can be linked to a host of services, which help you to get immense benefits, apart from convenience. This number will act as proof of identity and address, anywhere in India. Even aadhaar letter, e-Aadhaar downloaded from UIDAI website are equally valid.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X