For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లోకి రూ. 22,915 కోట్ల మూలధ‌నం

|

ప్రభుత్వ రంగ బ్యాంకుల మూల‌ధ‌న కోసం కేటాయించిన నిధుల్లో మొదటి విడత నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఈ ఆర్థిక సంవత్సరంలో 25వేల కోట్ల రూపాయల కేటాయించిన ప్రభుత్వం రూ22,915 కోట్లను విడుద‌ల చేస్తోంది. ఈ నిధుల‌ను 13 ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఈ పంపిణీ చేయనుంది. బ్యాంకుల సామర్థ్యం, ​​క్రెడిట్, నిక్షేపాలు, ఖర్చుల తగ్గింపు తదితర కార్యకలాపాల పనితీరుతో ముడిపడి మిగిలిన మొత్తం నిధుల జారీ ఉంటుందని తెలిపింది.
ఇందులో సింహ భాగం రూ. 7575 కోట్లు దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్‌బీఐకు వెళ్ల‌నున్నాయి.

కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన 'ఇంద్రధనుష్‌' పథకం కింద ఈ నిధులను విడుదల చేయనున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత సంవత్సరం మూలధనం, వార్షిక వృద్ధి రేటు, గత ఐదు సంవత్సరాలుగా క్రెడిట్ వృద్ధి రేటు ఆధారంగా ఈ కేటాయింపులు చేసినట్టు తెలిపింది. ద్రవ్యత మద్దతు అందించడానికి వీలుగా 75 శాతం నిధులును అందజేయనున్నట్టుస్పష్టం చేసింది.
బ్యాంకుల‌కు అంద‌జేసిన మూల‌ధ‌నం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి
ఎస్ బీఐ - రూ.7,575 కోట్లు
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌- రూ 3,101 కోట్లు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ - రూ. 2,816 కోట్లు.
బ్యాంక్ ఆఫ్ ఇండియా -రూ. 1,784 కోట్లు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ 1,729 కోట్లు
సిండికేట్ బ్యాంక్ - రూ. 1,034 కోట్లు
యూకో బ్యాంక్‌- రూ. 1033 కోట్లు
కెనరా బ్యాంక్ - రూ. 997 కోట్లు
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- రూ. రూ. 810 కోట్లు
యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- రూ. 821 కోట్లు
కార్పొరేష‌న్ బ్యాంక్‌- రూ. 677 కోట్లు
దేనా బ్యాంక్‌- రూ. 594 కోట్లు
అల‌హాబాద్ బ్యాంక్‌- రూ. 44 కోట్లు

ఈ ఆర్థిక సంవత్సరంలో 25వేల కోట్ల రూపాయలను బ్యాంకుల‌కు మూల‌ధ‌నంగా అందించ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం బ‌డ్జెట్‌లో ప్రకటించింది. దీనిపై స్పందించిన నిపుణులు ప్రభుత్వం కేటాయించిన దాని కన్నా బ్యాంకులకు మరింత మూలధనం అవసరపడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇవే అంతిమ నిధులు కావాలని, అదనపు నిల్వలు కావాల్సిన పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాల ఏర్పాటుపై దృష్టి సారిస్తామని జైట్లీ హామి ఇచ్చిన సంగతి తెలిసిందే.

మొత్తానికి ఈ విడ‌త‌లో ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లోకి రూ. 22,915 కోట్ల మూలధ‌నం వెళ్ల‌నుంది.

English summary

ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లోకి రూ. 22,915 కోట్ల మూలధ‌నం | Centre to release 22915 crores for recapitalisation of PSBs

The government on Tuesday said it is releasing Rs 22,915 crore to recapitalise 13 public sector banks, including the biggest lender State Bank of India. The sum is about 92% of the budgeted provision of Rs 25,000 crore.
Story first published: Tuesday, July 19, 2016, 16:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X