For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప‌సిడి న‌గ‌దీక‌ర‌ణ ప‌థ‌కం 2015

|

మనదేశంలో ఇళ్లల్లో ఖాళీగా ఉండిపోయిన రూ.లక్షల కోట్ల విలువైన బంగారాన్ని బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తీసుకొచ్చే పసిడి నగదీకరణ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. బంగారం దిగుమతులకు అడ్డుకట్ట వేసే కాగితం బాండ్లను విడుదల చేశారు. తొలిసారిగా భారతీయ బంగారు నాణేన్నీ, బులియన్‌ను ఆవిష్కరించారు. దీనిపై ఒకవైపు జాతీయ చిహ్నమైన అశోకచక్రం, మరోవైపు మహాత్మాగాంధీ చిత్రం చెక్కారు. గృహాలు, వివిధ సంస్థల్లో 20 వేల టన్నుల బంగారం నిర‌ర్ద‌కంగా ఉండ‌టంతో ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని ప్ర‌భుత్వం ఈ విధంగా యోచించింది. అశోకచక్రంతో కూడిన భారతీయ బంగారు నాణేన్ని విడుదల చేయడం దేశానికి గర్వకారణం. త‌ద్వారా ఇకపై ప్రజలు విదేశాల్లో తయారైన బంగారం కడ్డీలు, నాణేలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. నాణేలు రూపొందించే ప్రక్రియ భారత్‌లో తయారీ కార్యక్రమానికీ వూతమిస్తుంది. ఈ మూడు పథకాల నుంచి ప్రజలు ప్రయోజనాలు పొందుతారని ప‌థ‌కాల ఆరంభం సంద‌ర్భంగా ప్ర‌ధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇంత‌కుముందు ఉన్న బంగారు డిపాజిట్ ప‌థ‌కం,1999 స్థానంలో ప్ర‌స్తుతం బంగారు డిపాజిట్ ప‌థ‌కం, 2015 వ‌చ్చింది.

ప‌థ‌కం వివ‌రాలు:
* దేశంలో నివ‌సించే పౌరులు ఈ ప‌థ‌కంలో డిపాజిట్ చేయ‌వ‌చ్చు.
* క‌నీస పెట్టుబ‌డి మొద‌ట 30 గ్రాముల నుంచి ప్రారంభ‌మై త‌గ్గిస్తూ వ‌స్తున్నారు.
*బీఐఎస్‌చేత ధ్రువీక‌రించ‌బ‌డి కేంద్ర ప్ర‌భ‌త్వంచే ప్ర‌క‌టించ‌బ‌డిన సేక‌ర‌ణ‌, శుద్ద‌తా ప‌రీక్షా కేంద్రాలు(సీపీటీసీలు) బంగారాన్ని స్వీక‌రిస్తాయి. 995స్వ‌చ్చ‌త గ‌ల బంగారానికి సమానంగా బ్యాంకులు డిపాజిట్ స‌ర్టిఫికెట్ల‌ను జారీ చేస్తాయి.
* ప్రారంభంలో బంగారం నాణేలు 5, 10 గ్రాముల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. 125 ఎంఎంటీసీ కేంద్రాల ద్వారా 20 గ్రాముల బంగారం కూడా అందుబాటులోకి తీసుకొస్తారు.
* పసిడి నగదీకరణ పథకం(జీఎంఎస్‌), 2015 కింద బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టే డిపాజిట్‌దారులకు 2.5 శాతం వార్షిక వడ్డీ దక్కుతుంది.
* ఆ వ‌డ్డీ రాబ‌డికి మూల‌ధ‌న రాబ‌డి ప‌న్ను, సంప‌ద ప‌న్ను, ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపులిచ్చారు.
* భౌతికంగా బంగారం కొనడాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ప్రారంభించిన అధికార పసిడి బాండ్ల పథకంలో 2.75 శాతం వార్షిక వడ్డీ ఇస్తారు.
* కొనుగోలుదారులు శాశ్వత ఖాతా సంఖ్య(పాన్‌)ను, వినియోగదారుల సమాచారం తెలిపే కేవైసీ పత్రాల్ని అందజేయాల్సి ఉంటుంది.
* నిర్దేశిత బ్యాంకులు బంగారం డిపాజిట్లను స్వల్పకాలిక (1-3 సంవత్సరాలు), మధ్యకాలిక (5-7 సంవత్సరాలు), దీర్ఘకాలిక (12-15 సంవత్సరాలు) పథకాల కింద స్వీకరిస్తాయి.

ప‌సిడి న‌గ‌దీక‌ర‌ణ ప‌థ‌కం 2015

ప్రపంచంలో భారత్‌ అతిపెద్ద బంగారం దిగుమతిదారుగా నిలుస్తోంది. భారత్‌ ఏటా వెయ్యి టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఫలితంగా విదేశీ మారకద్రవ్యం ఖర్చయిపోతూ, ద్రవ్యలోటు ఒత్తిడి పెరిగిపోతోంది. మనదేశంలో రూ.52 లక్షల కోట్ల విలువైన 20 వేల టన్నుల బంగారం గృహాలు, ఆలయాల్లో ఉండిపోయినట్లు అంచనా. అందుకే ప్ర‌భుత్వం బంగారు బాండ్ల ద్వారా ప్ర‌జ‌లంద‌రినీ నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని డిపాజిట్ చేయ‌డం ద్వారా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను వృద్ది చేయాల‌ని కోరుతోంది.

ఆధారం: వికాస్‌పీడియా.ఇన్‌, ఆర్‌బీఐ

English summary

ప‌సిడి న‌గ‌దీక‌ర‌ణ ప‌థ‌కం 2015 | Details about Gold Monetisation scheme

The objectives of the Gold Monetization scheme are:i.To mobilize the unused gold ii. To provide a fillip to the gems and jewellery sector in the country by makinggold available as raw material on loan from the banks.iii. To be able to reduce reliance on import of gold over time to meet the domestic demand.
Story first published: Saturday, July 16, 2016, 15:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X