For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్యాపారులకు, వినియోగదారులకు సంధానకర్త యాడ్‌రోబ్

By Srinivas
|

హైదరాబాద్: భాగ్యనగరం కేంద్రంగా హైపర్ లోకల్ మార్కెట్ సేవలు అందిస్తున్న యాడ్‌రోబ్.. స్థానిక వర్తకులు, రిటైలర్లు తమ ఉత్పత్తులు, సేవలను ప్రమోట్ చేసుకోవడంతో పాటు వాటిని వినియోగదారులకు అందించే వీలును కూడా కల్పిస్తోంది. త్వరలో యాడ్‌రోబ్ చిన్న నగరాలకు కూడా విస్తరించనుంది.

www.adrobe.in ఇటు వినియోగదారులకు, అటు వ్యాపారులకు సంధానకర్తగా పని చేస్తుందని చెప్పవచ్చు. ఇది అమ్ముకునేవారికి, వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఇందులో, వ్యాపారులు అడ్వర్టయిజ్‌మెంట్ల రూపంలో ఉత్పత్తులను ప్రచారం చేసుకొని విక్రయించుకునే సౌలభ్యం ఉంది. ప్రస్తుతం ఈ సంస్థలో వెయ్యి మంది వెండర్స్ నమోదయ్యారు.

ఇక కష్టమర్ల పరంగా ఆలోచిస్తే... గాడ్జెట్స్, ఎలక్ట్రానిక్, ఫ్యాషన్.. ఇలా వందకు పైగా కేటగిరీలు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు నాలుగు వేలకు పైగా ఉత్పత్తులను కొనుగోలు చేసుకునే వీలు ఉంది. ఉచితంగా 24 గంటలలో డెలివరీ చేస్తారు.

దీనిని కేశిరెడ్డి రాజిరెడ్డి గత ఏడాది అక్టోబర్ నెలలో రూ.కోటి పెట్టిబడితే స్థాపించారు. గ్రోత్ క్యాపిటల్ కోసం నిధుల సమీకరణ చేయాలని ఆయన నిర్ణయించనున్నారు. కొద్ది రోజుల క్రితం ముంబైకి చెందిన ఓ ప్రయివేట్ ఈక్విటీ ప్లేయర్లతో ప్రాథమిక చర్చలు జరిగాయి. రూ.30 కోట్లకు పైగా పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నారు.

Aadobe to start its operations in Warangal

ప్రస్తుతం వెయ్యి మంది వర్తకులు ఈ యాడ్‌రోబ్‌లో నమోదై ఉన్నారు. రెండు మూడు నెలల్లో దీనిని అయిదు వేలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి ఏడాది రూ.3కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 10 పట్టణాలకు విస్తరించనున్నారు.

ఈ ఏడాది చివరి కల్లా విజయవాడ, విశాఖ, గుంటూరు, వరంగల్, తిరుపతిలకు విస్తరించనున్నారు. వచ్చే నెలలో వరంగల్‌లో ప్రారంభమవుతుంది.

యాడ్‌రోబ్ ప్రత్యేకతలు...

యాడ్‌రోబ్ వ్యాపారులకు, వినియోగదారులకు సంధానకర్తగా పని చేస్తుంది.
వ్యాపారులు అడ్వర్టయిజ్‌మెంట్ రూపంలో తమ వస్తువులను విక్రయించుకోవచ్చు.
వినియోగదారులకు వేలాది ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. 24 గంటలలోనే డెలివరీ.
ప్రతి వ్యాపారికి ఓ ప్రత్యేక పేజీ ఉంటుంది. అందులో వారి పూర్తి వివరాలు ఉంటాయి.
కొనుగోలులో సందేహాలు ఉంటే పుష్ టు కాల్, పుష్ టు మెయిల్ ఆప్షన్లు ఉంటాయి. వీటిని క్లిక్ చేస్తే నేరుగా మీరు వెండర్‌కు కనెక్ట్ కావొచ్చు.
మీరు ఉన్న పరిధిలోనే.. బెస్ట్ ఆఫర్ల్ చూసుకొని కొనుక్కోవచ్చు.

English summary

వ్యాపారులకు, వినియోగదారులకు సంధానకర్త యాడ్‌రోబ్ | Aadobe to start its operations in Warangal

Aadobe Networks Private Limited to start its operations in Warangal soon.
Story first published: Sunday, April 17, 2016, 12:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X